ముంబై: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్‌బీ) గత ఆర్థిక సంవత్సరం(2022– 23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 457 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 346 కోట్లు మాత్రమే ఆర్జించింది.
ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి
ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం సాధించింది. రూ. 1,313 కోట్లు ఆర్జించింది. 2021–22లో రూ. 1,039 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇది 26 శాతంపైగా వృద్ధికాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 12.17 శాతం నుంచి 6.97 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.74 శాతం నుంచి 1.84 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎస్‌బీ షేరు బీఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 37.35 వద్ద ముగిసింది.
ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు
Comments
Please login to add a commentAdd a comment