Q4 net profit
-
మరోసారి టీసీఎస్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవ లకు దేశంలో నంబర్ వన్.. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. మార్చితో ముగిసిన గతేడాది (2023–24)తోపాటు చివరి త్రైమాసికంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేట్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో రూ. 12,434 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో సాధించిన రూ. 11,392 కోట్లతో పోలిస్తే 9 శాతం అధికం. త్రైమాసిక ప్రాతిపదికన(రూ. 11,058 కోట్లు) సైతం 12 శాతంపైగా వృద్ధి నమోదైంది. ఇందుకు మెరుగుపడిన మార్జిన్లు, దేశీ బిజినెస్‌లో వృద్ధి దోహదపడ్డాయి. మొత్తం ఆదాయం వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 61,237 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 59,162 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ బోర్డు షేరుకి రూ. 28 చొప్పున వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదిలో.. గత ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ 9 శాతం అధికంగా రూ. 45,908 కోట్ల నికర లాభం ప్రకటించింది. నిర్వ హణ లాభ మార్జిన్లు 1.5 శాతం బలపడి 26 శాతాన్ని తాకా యి. మొత్తం ఆదాయం 7% వృద్ధితో రూ. 2,40,893 కోట్లయ్యింది. టర్నోవర్‌లో అతిపెద్ద మార్కెట్ ఉత్తర అమెరికా వాటా 2.3% తగ్గి 50 శాతానికి పరిమితమైంది. 24.6% నిర్వహణ మార్జిన్లు సాధించింది. దేశీ బిజినెస్ 38% ఎగసింది. దీంతో మొత్తం ఆదాయంలో దేశీ వాటా 5% నుంచి 6.7 శాతానికి బలపడింది. 40ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. అయితే కొత్త సీవోవోగా ఎవరినీ ఎంపిక చేయబోమని, సీనియర్లకు బాధ్యతలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఉద్యోగు లకు 4.7% వార్షిక వేతన పెంపును చేపట్టనున్నట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అత్యుత్తమ పనితీరు చూపినవారికి రెండంకెలలో పెంపు ఉంటుందని తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ 0.5% పెరిగి రూ. 4,005 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు ► క్యూ4లో కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందింది. ► పూర్తి ఏడాదికి 42.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► క్యూ4లో యూకే బీమా దిగ్గజం అవైవాతో 15 ఏళ్ల కాలానికి మెగా డీల్‌ను సాధించింది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 13.3 శాతం నుంచి 12.5 శాతానికి దిగివచి్చంది. ► క్యూ4లో సుమారు 2,000 మంది తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కు చేరింది. ► వరుసగా మూడు త్రైమాసికాలలో మొత్తం 13,249 మంది సిబ్బంది తగ్గారు. ► 2004లో టీసీఎస్ లిస్టింగ్ తదుపరి గతేడాదిలోనే తొలిసారి ఉద్యోగుల సంఖ్యలో కోతపడింది. అనిశ్చితిలోనూ లాభాల మార్జిన్, ఆర్డర్ బుక్ సమర్ధవంత ఎగ్జిక్యూషన్, పటిష్ట బిజినెస్ మోడల్ కంపెనీ విలువను తెలియజేస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితిలోనూ కీలకమైన, ప్రాధాన్యతగల అంశాలలో మెరుగైన సేవలను అందించాం. విభిన్న ఆఫరింగ్స్, కొత్తతరహా సామర్థ్యాలు, నాయకత్వ సలహాల ద్వారా కస్టమర్లకు మద్దతిచ్చాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) గత ఆర్థిక సంవత్సరం(2022– 23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 457 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 346 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం సాధించింది. రూ. 1,313 కోట్లు ఆర్జించింది. 2021–22లో రూ. 1,039 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇది 26 శాతంపైగా వృద్ధికాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 12.17 శాతం నుంచి 6.97 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.74 శాతం నుంచి 1.84 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎస్బీ షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 37.35 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 507 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 121 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు రెట్టింపై రూ. 2988 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,587 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 973 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 100 శాతం వృద్ధికాగా.. 2021–22లో రూ. 489 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు మొత్తం ఆదాయం రూ. 5,548 కోట్ల నుంచి రూ. 8,633 కోట్లకు జంప్ చేసింది. ఇంధన విక్రయాలు 58 శాతం పుంజుకుని 14,880 మిలియ న్ యూనిట్లకు చేరాయి. సామర్థ్య విస్తరణ ఇందుకు సహకరించింది. గతేడాది 2,676 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. వినీత్ ఎస్.జైన్ 2023 మే 11 నుంచి ఎండీగా కొనసాగనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం బలపడి రూ. 977 వద్ద ముగిసింది. అదానీ గ్యాస్ లాభంలో వృద్ధి పట్టణాల్లో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ సేవలు అందించే అదానీ టోటల్ గ్యాస్, మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.98 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన రూ.81 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి చెందింది. విక్రయాల పరిమాణం 2 శాతం పెరిగి 193 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్లుగా ఉంది. కొత్తగా 126 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో మొత్తం సీఎన్జీ స్టేషన్ల సంఖ్య 460కు చేరుకుంది. పైపుల ద్వారా గ్యాస్ అందించే కనెక్షన్ల సంఖ్య 1.24 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు 7.04 లక్షలకు చేరాయి. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లు 7,435కు పెరిగాయి. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.4,683 కోట్ల ఆదాయంపై రూ.546 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
బజాజ్ ఫిన్సర్వ్ ఫలితాలు ఆకర్షణీయం
న్యూఢిల్లీ: బజాజ్ ఫిన్సర్వ్ మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. లాభం 32 శాతం పెరిగి రూ.839 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా 44 శాతం వృద్ధితో 12,995 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.637 కోట్లు, ఆదాయం రూ.9,055 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో అన్ని అంశాల్లోనూ మంచి వృద్ధి నమోదైనట్టు, అనుబంధ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ లాభం 57 శాతం పెరిగిందని బజాజ్ ఫిన్సర్వ్ సీఈవో ఎస్ శ్రీనివాసన్ తెలిపారు. ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.42,606 కోట్ల ఆదాయంపై రూ.3,219 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.32,863 కోట్లు, నికర లాభం రూ.2,650 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. జనరల్ ఇన్సూరెన్స్ బజాజ్ ఫిన్సర్వ్ అనుబంధ బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం మాత్రం అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.187 కోట్ల నుంచి రూ.83 కోట్లకు క్షీణించింది. అంటర్రైటింగ్ నష్టాలు ఎక్కువగా ఉండడం, పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.20 కోట్లను కేటాయించడం లాభం తగ్గడానికి కారణమని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియం ఆదాయం 23 శాతం వృద్ధితో 3,402 కోట్లకు చేరింది. క్లెయిమ్ రేషియో 75.5 శాతంగా ఉంది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం జనరల్ ఇన్సూరెన్స్ లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం తగ్గి రూ.780 కోట్లకు పరిమితమైంది. లైఫ్ ఇన్సూరెన్స్ మరో అనుబంధ కంపెనీ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.171 కోట్ల నుంచి రూ.112 కోట్లకు తగ్గింది. బజాజ్ ఫైనాన్స్ లాభం 50% అప్ ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 50 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.743 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,114 కోట్లకు పెరిగిందని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,425 కోట్ల నుంచి రూ.4,888 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 6 డివిడెండ్ (300 శాతం) ఇవ్వనున్నామని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.2,485 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,890 కోట్లకు పెరిగిందని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 1.54 శాతంగా, నికర మొండి బకాయిలు 0.63 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేర్ 3.6 శాతం లాభంతో రూ.3,112 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ అదరగొట్టింది!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ 4 లాభాల్లో అదరగొట్టింది. స్టాండలోన్ నికర లాభాలను మార్చి క్వార్టర్ లో 123 శాతం పెంచుకుని రూ.2,812.82 కోట్లగా నమోదుచేసింది. ఈ లాభాలు విశ్లేషకులు అంచనాలను కూడా అధిగమించాయి. బ్యాంకు లాభాలు రూ.2,701 కోట్లగా మాత్రమే ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఎస్బీఐ లాభాలు రూ.1,263.81 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయాలు కూడా బ్యాంకువి ఏడాది ఏడాదికి 17.3 శాతం పెరిగాయి. మార్చితో ముగిసిన క్వార్టర్ లో ఈ ఆదాయాలు రూ.18,070.7 కోట్లగా నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయాలు రూ.15,401.30 కోట్లగా ఉన్నట్టు రిపోర్టు చేసింది. క్వార్టర్ క్వార్టర్ కు అసెట్ క్వాలిటీని బ్యాంకు మెరుగుపరుచుకుంది. డిసెంబర్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ లో స్థూల నిరర్థక ఆస్తులు కూడా 6.90 శాతానికి దిగొచ్చాయి. నికర ఎన్పీఏలు కూడా డిసెంబర్ క్వార్టర్ కంటే తక్కువగానే నమోదయ్యాయి. డిసెంబర్ క్వార్టర్ లో 4.24గా ఉన్న ఎన్పీఏలు ఈ క్వార్టర్ లో3.71 శాతంగా రికార్డయ్యాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో కూడా బ్యాంకు నికర ఎన్పీఏలు 3.71 శాతమే. లాభాల్లో అదరగొట్టడంతో ఎస్ బీఐ షేరు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ లో బ్యాంకు షేరు టాప్ గెయినర్ గా లాభాలు పండిస్తోంది. 2.3 శాతం జంప్ చేసిన షేర్ ధర రూ.310 ని తాకింది. -
నికర లాభాలు తగ్గినా.. బెటర్ అమ్మకాలే
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీకి గడిచిన రెండేళ్లలో మొదటిసారి నికర లాభాలను పడిపోయాయి. నేడు(మంగళవారం) ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు 12 శాతం పడిపోయి, రూ.1,130 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,284 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది. కంపెనీకి ఖర్చులు అపరిమితంగా పెరగడం, ఫ్యాక్టరీలో నెలకొన్న పౌర అశాంతితో ఉత్పత్తి నష్టాలను ఎక్కువగా నమోదుచేయడం ఈ ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అయితే కంపెనీ నికర అమ్మకాలు ఈ ఏడాది మెరుగ్గానే ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. 15.27 శాతం వృద్ధి కనిపించిన నికర అమ్మకాలు రూ. 15,300 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ అమ్మకాలు రూ.13,273 కోట్లగా ఉన్నాయి. గతేడాది కంటే మెరుగైన అమ్మకాలను మారుతి సుజుకీ చూపించడంతో, కంపెనీ ఒక్క షేరుకు రూ.35 డివిడెంట్ ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్లో మారుతీ సుజుకీ షేర్లు లాభాలను పుంజుకున్నాయి. ఈ షేరు 3.96 శాతం పెరిగి 147.75 వద్ద నమోదయ్యాయి. నేడు(మంగళవారం) మార్కెట్లను లీడ్ చేసిన కంపెనీలో మారుతి సుజుకీ ఉండటం విశేషం.