PSU bank
-
‘అసలే ఎన్నికలు’, బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుందా?
ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు వేతనాల్ని సగటున 15 శాతం పెంపుపై బ్యాంకులు - బ్యాంకు యూనియన్ సంఘాలు చర్చిస్తున్నాయి. ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. తాజాగా, ఉద్యోగులు వేతనాల్ని 15 శాతం పెంపును ప్రతిపాదించింది. అయితే, పనిదినాల మార్పులతో పాటు వేతనాల శాతాన్ని మరింత పెంచాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికే పీఎన్బీ వంటి కొన్ని బ్యాంకులు వేతనాల పెంపుకు పెద్దమొత్తంలో కేటాయింపులు జరుపుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వేతనం 10 శాతం పెరిగేలా బడ్జెట్ కేటాయించడానికి బదులుగా, 15శాతం పెరుగుదల కోసం నిధులను కేటాయించింది. నిశితంగా పరిశిలీస్తున్న కేంద్రం ‘ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు బాగా పెరిగాయని, కొవిడ్ సమయంలో పనిచేయడం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుణదాతలను తిరిగి గాడిలో పెట్టడానికి ఉద్యోగులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటే తమకు మెరుగైన పరిహారం లభిస్తుందని’ ఉద్యోగులు, యూనియన్లు వాదించుకుంటున్నాయి. ఈ చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. అసలే ఎన్నికలు అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నందున వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కంటే ముందే వేతన సెటిల్ మెంట్‌తో పాటు వారానికి ఐదురోజుల పనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు అంచనా వేస్తున్నాయి. -
లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) గత ఆర్థిక సంవత్సరం(2022– 23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 457 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 346 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం సాధించింది. రూ. 1,313 కోట్లు ఆర్జించింది. 2021–22లో రూ. 1,039 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇది 26 శాతంపైగా వృద్ధికాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 12.17 శాతం నుంచి 6.97 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.74 శాతం నుంచి 1.84 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎస్బీ షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 37.35 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
బ్యాం‘కింగ్’ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.48,000 కోట్ల డివిడెండ్‌ను అంచనా వేస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఈ తరహా రాబడి బడ్జెట్ లక్ష్యం రూ.73,948 కోట్లుకాగా, చాలా తక్కువగా రూ.40,953 కోట్లు ఒనగూడుతుందన్నది తాజా అంచనా. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం డివిడెంట్ దాదాపు 17 శాతం అధికం. 2022 మేలో జరిగిన బోర్డ్ సమావేశంలో ప్రభుత్వానికి రూ.30,307 కోట్ల డివిడెండ్ పేమెంట్లను చెల్లించడానికి ఆర్బీఐ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.43,000 కోట్లు.. బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఇన్వెస్ట్మెంట్ల నుంచి 2023–24 సంవత్సరంలో రూ.43,000 కోట్ల డివిడెండ్లు రానున్నాయి. 2022–23 సవరిత అంచనాల ప్రకారం, రూ. 43,000 కోట్లు ఒనగూరుతున్నాయి. 2022–23 బ డ్జెట్ అంచనా రూ.40,000 కోట్లకన్నా ఇది అధికం. మొత్తం డివిడెండ్ ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సవరిత అంచనా (ఆర్ఈ) ప్రకారం, మొత్తంగా రూ.1,08,592 కోట్ల డివిడెండ్ ఒనగూరనుంది. రానున్న 2023–24లో ఈ వసూళ్లు రూ.1,15,820 కోట్లకు చేరనున్నాయి. బ్యాంకింగ్ చట్టాలకు సవరణలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, బ్యాంకుల నిర్వహణను మెరుగుపర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్, బ్యాంకింగ్ కంపెనీస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాల్లో నిర్దిష్ట సవరణలను ప్రతిపాదించారు. మరిన్ని వినూత్న ఫిన్‌టెక్ సేవలను అందించేందుకు డిజిలాకర్‌లో ఉండే పత్రాల వినియోగ పరిధిని పెంచనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
యూనియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 49 శాతం జంప్‌చేసి రూ. 1,085 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 727 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,103 కోట్ల నుంచి రూ. 19,454 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.49 శాతం నుంచి 11.62 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే నికర ఎన్పీఏలు 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 5,210 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 2,549 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ షేరు 1 శాతం నీరసించి రూ. 48 వద్ద ముగిసింది. -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! ఆగిపోనున్న బ్యాంకు కార్యకలాపాలు..!
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిసెంబర్ 16, 17వ తేదీన సమ్మెను చేపట్టనున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కార్యాకలాపాలు రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో సుమారు తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్టొంటారు. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులను అలర్ట్ చేశాయి. చెక్ క్లియరెన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. సమ్మెను విరమించండి..! రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలతో ఆయా బ్యాంకులు సమ్మెను విరమించాలని ఉద్యోగులను కోరాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునివ్వగా.. ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమయ్యాయి. రెండు రోజులపాటు..! 2021-22 బడ్జెట్ సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రేవేటీకరణ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ వెల్లడించారు. అంతేకాకుండా బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి ఈపీఎఫ్ఓ శుభవార్త! -
రూ. 1.75 లక్షల కోట్లు టార్గెట్..! ప్రైవేటుపరం కానున్న 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు..!
పలు ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగంగా చేపట్టనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా కన్పిస్తోంది. అందుకోసం రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు 26 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ రూ.1.75 లక్షల కోట్లే లక్ష్యంగా..! ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సుమారు రూ.1. 75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా కేంద్రం బ్యాంకులపై తీసుకువస్తోన్న బిల్లుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకుగానూ 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటుగా 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ బిల్లును కూడా కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లుతో ద్వారా విస్తృతమైన పెన్షన్ కవరేజీని ప్రోత్సహించడానికి పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను వేరు చేయడానికి వీలు కల్గుతుందని గత బడ్జెట్ సెషన్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. చదవండి: 81 కోట్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త! -
ఇండియన్ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 220 శాతం దూసుకెళ్లి రూ. 1,182 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 369 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2020 ఏప్రిల్ 1నుంచి అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేసుకుంది. వ్యయాల నియంత్రణ, వడ్డీ, వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి వంటి అంశాలు లాభదాయకతకు దోహదం చేసినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు. చౌకలో నిధుల సమీకరణకు విలీనం సహకరించినట్లు తెలియజేశారు. మార్జిన్లు అప్ నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 3,994 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం మాత్రం 41 శాతం ఎగసి రూ. 1,877 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.51 శాతం బలపడి 2.85 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10.9 శాతం నుంచి 9.69%కి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 3.76% నుంచి 3.47%కి తగ్గాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 4,204 కోట్లుగా నమోదయ్యాయి. నగదు రికవరీ రూ. 657 కోట్లకు చేరగా.. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 2,290 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు 0.6% పుంజుకుని రూ. 139 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) 2020 నవంబర్‌లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ)తో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐలను పంపిణీ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 2021లో కెనరా బ్యాంక్ నికర లాభం రూ.2,557 కోట్లు. దీంతో కెనరా బ్యాంక్ ఈ వారం తన సిబ్బందికి 15 రోజుల జీతం విలువైన పీఎల్ఐ(పనితీరు-ఆధారంగా ప్రోత్సాహకాల)ను చెల్లించింది. బ్యాంకులు మే 18న నాలుగవ త్రైమాసికంలో 1,010.87 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని ఆర్జించాయి. 2020-21 నాలుగో త్రైమాసికంలో 165 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీఎల్ఐ కింద నగదును తన ఉద్యోగులకు విడుదల చేసింది. అన్ని ర్యాంకులు, హోదాల్లోని ఉద్యోగులకు ఈ పీఎల్ఐలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐలో 2.5 లక్షల మందికి ఈ లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా లభిస్తుంది. చదవండి: నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు -
పీఎస్‌యూ బ్యాంకు షేర్లతో ఈటీఎఫ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థల షేర్లతో కూడిన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, తగు సూచనలిచ్చేందుకు త్వరలో సలహాదారు నియామకం కూడా జరపనుందని అధికార వర్గాలు తెలిపాయి. సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్–22 ఈటీఎఫ్‌లు విజయవంతం కావడంతో కేంద్ర ఆర్థిక శాఖ ఈ సాధనం పరిధిని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో రెండు బీమా సంస్థలు (జనరల్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స), 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐఎఫ్సీఐ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. కేంద్రం భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రూ. 32,900 కోట్లు, అయిదు విడతల సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల ద్వారా రూ. 38,000 కోట్లు దేశీ మార్కెట్ నుంచి సమీకరించగలిగింది. సీపీఎస్ఈ షేర్ల ఆధారిత ఈటీఎఫ్‌లను అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టడంపై ఆర్థిక శాఖ విదేశీ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) ఈటీఎఫ్‌లో ప్రస్తుతం 11 సంస్థలు ఉన్నాయి. ఓఎన్ జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, పవర్ ఫైనాన్స, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్ టీపీసీ, ఎన్ బీసీసీ, ఎన్ఎల్సీ, ఎస్‌జేవీఎన్ ఇందులో ఉన్నా యి. సీపీఎస్ఈల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 90,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. -
బ్యాంకులకు పూర్తి స్వయం ప్రతిపత్తి!
న్యూఢిల్లీ: మెరుగైన సామర్థ్యం, వ్యవస్థీకృత పటిష్టత వంటి అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి అవసరమని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సూచించింది. బీపీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్ టైమ్ డైరెక్టర్ల నియామక అత్యున్నత సంస్థ– బీబీబీ, మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. బ్యాంకింగ్ రుణ వ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. రుణ వ్యయాలు మరింత తగ్గాలని, రుణ ఆమోదం, కేటాయింపులు, పంపిణీల విషయంలో బ్యాంకింగ్ సామర్థ్యం మెరుగుపడాలని సూచించింది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు ఉండాలని పేర్కొంది. మార్చి వరకూ గడచిన ఆరు నెలల కాలంలో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకింగ్ హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకాలు జరిగాయని నివేదిక పేర్కొంటూ, సకాలంలో బీబీబీ ఇచ్చిన సిఫారసులు దీనికి కారణమని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్‌టైమ్ డైరెక్టర్లు అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలకు తగిన సిఫారసులు చేయడానికి నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులతో బీబీబీ ఏర్పాటుకు 2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డ్ డైరెక్టర్లతో చర్చించి, విలీనాలు సహా బ్యాంకింగ్ రంగ పురోగతికి తగిన వ్యూహ రూపకల్పనలోనూ బీబీబీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. -
త్వరలో బ్యాంక్ ఈటీఎఫ్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్)ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లతో కూడిన బ్యాంక్ ఈటీఎఫ్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ బ్యాంక్ ఈటీఎఫ్‌లో చేర్చాల్సిన బ్యాంక్ షేర్లు, వాటి వెయిటేజీపై కసరత్తు చేస్తున్నామని ఆ అధికారి వివరించారు. బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ బ్యాంక్ ఈటీఎఫ్ మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ఒక్కో బ్యాంక్‌షేర్ పట్ల ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపకపోయినా, బ్యాంక్ షేర్లతో కూడిన ఈటీఎఫ్‌కు మంచి డిమాండ్ ఉండగలదని ఆయన అంచనా వేస్తున్నారు. 20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం వాటాలు 63–83 శాతం రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే రెండు ఈటీఎఫ్‌లు... కేంద్రం ఇప్పటికే రెండు ఈటీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న రెండు ఈటీఎఫ్‌లు–సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్–22 ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనే లభించింది. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం 2017 నుంచి రూ.32,900 కోట్లు, సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా 2014 నుంచి రూ.28,500 కోట్ల మేర పెట్టుబడులను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకూ రూ.53,558 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. -
రికార్డ్ల ర్యాలీకి బ్రేక్
వరుస రెండు రోజుల రికార్డ్ల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకినప్పటికీ, చివరి గంటలో భారీగా అమ్మకాలు జరగడంతో చివరకు నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోవడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యలోటు ఒత్తిడులు తప్పవంటూ మూడీస్ సంస్థ హెచ్చరించడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టపోయి 38,723 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 47 పాయింట్లు నష్టంతో 11,692 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,990 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. లోహ, రియల్టీ, పీఎస్‌యూ, ఆయిల్, గ్యాస్, మౌలిక, వాహన రంగ షేర్లు పెరిగాయి. లాభాల స్వీకరణ... ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారంతో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని, రూపాయి పతనం కూడా తోడవడంతో మార్కెట్ నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 217 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 310 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 15 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 60 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఏడు రోజుల తర్వాత రిలయన్స్‌కు నష్టాలు... వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్లలో లాభపడుతూ వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ నష్టపోయింది. 1.8 శాతం క్షీణించి రూ.1,294 వద్ద ముగిసింది. కోల్ ఇండియా 2.5 శాతం పతనమై రూ.287 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈలో వాటా విక్రయ వార్తల కారణంగా ఎస్బీఐ షేర్ 1.5 శాతం లాభంతో రూ.310 వద్ద ముగిసింది. ఇక లాభాల స్వీకరణ కారణంగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 9 శాతం అప్... నిఫ్టీ 50 సూచీలో వచ్చే నెల 28 నుంచి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను చేరుస్తున్నారు. దీంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 12 శాతం లాభంతో తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.409ను తాకింది. చివరకు 9 శాతం లాభంతో రూ.398 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ సూచీ నుంచి తొలగిస్తున్న లుపిన్ 2% నష్టపోయి రూ. 884 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
బ్యాంకును ముంచేసిన మరో డైమండ్ వ్యాపారి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి మరిన్ని కేసులు వెలుగులో వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన వజ్రాల వ్యాపారి బుట్టలో మరో ప్రభుత్వ రంగ బ్యాంకు పడటం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. ఇటీవల నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వేల కోట్ల కుంభకోణం తాలూకు ప్రకంపనల వేడి ఇంకా చల్లాకరముందే మరో డైమండ్ వ్యాపారిపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) రూ. 389 కోట్ల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై సంస్థపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల ఎగుమతిదారుడు ద్వారకా దాస్ సేథ్ కూడా నీరవ్ మోదీ, చోక్సీ మోడస్ ఒపరాండీని ఫాలో అయ్యాడు. అక్రమ లావాదేవీలతో భారీ ఎత్తున ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన బ్యాంకు సీబీఐకు ఫిర్యాదు చేసింది. దీంతో ద్వారకా దాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. డైమండ్ వ్యాపారి నిరవ్ మోడీ, మెహల్ చోక్సిల తరహాలోనే ఓబీసీలో 2007-2012 మధ్య కాలంలో ద్వారకా దాస్ రూ.389.85 కోట్లు మోసానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సంస్థలోని మొత్తం డైరెక్టర్లు సభా సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవి సింగ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరితోపాటు ద్వారకా దాస్ సేథ్ సెజ్ ఇన్కార్పొరేషన్ అనే మరో సంస్థను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీలెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ల ద్వారానే మోసానికి పాల్పడినట్టు బ్యాంకు ఆరోపించింది. ఈ సంస్థ కూడా ఉనికిలో లేని సంస్థలపేర్లతో వ్యాపార లావాదేవీలు చేసినట్టు చెప్పింది. కాగా బ్యాంకు ఆరు నెలల క్రితమే సీబీఐకి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
ప్రభుత్వ వాటాల విక్రయంతో భారీ ఆదాయం!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంకులకు భారీగా మూలధన సాయాన్ని ప్రకటించిన కేంద్రం... ఆ ప్రణాళికలో భాగంగా బ్యాంకుల్లో తనకున్న వాటాలను 52% వరకూ తగ్గించుకుంటే, రూ.58,000 కోట్ల కంటే అధిక ఆదాయమే సమకూరనుందని అసోచామ్ నివేదికలో తెలిపింది. ‘‘ప్రభుత్వం మూలధన సాయాన్ని ప్రకటించిన తర్వాత పీఎస్‌యూ బ్యాంకులకు మార్కెట్ అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. వాటి విలువ ఇప్పటికే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయంతో రూ.58,000 కోట్ల కంటే ఎక్కువే రానున్నాయి’’ అని అసోచామ్ తెలిపింది. పీఎస్‌యూ బ్యాంకులకు మార్కెట్లో అధిక వ్యాల్యూషన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన బాండ్ల సైజును రూ.1,35,000 కోట్ల లోపునకు తగ్గించుకోగలదని, దాంతో బడ్జెట్‌పై వడ్డీ రేట్ల భారం తగ్గడంతోపాటు, ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. వీటితోపాటు రుణ వితరణ పుంజుకుంటే అధిక ఆర్థిక వృద్ధి రూపేణా మరిన్ని ప్రయోజనాలు సమకూరతాయని అసోచామ్ తన నివేదికలో పేర్కొంది. -
షార్ట్ సెల్లర్స్‌పై ‘బ్యాంకు’ పిడుగు!
(సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి) బ్యాంకులే కాదు... బ్యాంకు షేర్లూ నోట్లు కురిపించాయి. కొన్ని షేర్లయితే ఒకేరోజు ఏకంగా 45 శాతానికిపైగా పెరిగిపోయాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీ, ఐడీబీఐ, కెనరా బ్యాంక్... ఒకటేమిటి!! దాదాపు అన్ని బ్యాంకులదీ ఇదే పరిస్థితి. కాకపోతే... డెరివేటివ్స్‌లో (ఎఫ్ అండ్ ఓ) ట్రేడవుతున్న పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మాత్రమే ఈ స్థాయిలో పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా... డెరివేటివ్స్‌లో లేనివైతే ఒక మోస్తరు స్థాయిలో మాత్రమే పెరిగాయి. ఈ మేజిక్‌తో ఒకేరోజులో కొందరు ట్రేడర్లు వందలు, వేల కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ షార్ట్ సెల్లర్లు అదే స్థాయిలో నష్టపోయారు. నిజానికి డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో ఒకరికి లాభం వచ్చిందంటే దానర్థం మరొకరు నష్టపోయినట్లే. అంటే! బ్యాంకులకు ఈ స్థాయిలో ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ గడువుకు ఒక్కరోజు ముందు ఈ ప్రకటన వస్తుందని... దాంతో అవి ఇంతలా పెరిగిపోతాయని తెలియక షార్ట్ సెల్లింగ్ చేసినవారంతా ఉచ్చులో చిక్కుకుపోయినట్లే. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం. ఒక రంగానికి చెందిన షేర్లన్నీ గంపగుత్తగా ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు... బహుశా స్టాక్ మార్కెట్ చరిత్రలో లేవనే చెప్పాలి. మొండి బకాయిలు పేరుకుపోవడమే కాక రోజురోజుకూ కొత్త ఎన్పీఏలు బయటపడుతుండటంతో ఈ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు దయనీయంగా తయారయింది. లాభాలుగా వచ్చిన సొమ్మును ఈ ఎన్పీఏలకు సర్దుబాటు చేస్తూ అవి భారీ నష్టాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఈ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఇన్వెస్టర్లకు మోజు తగ్గింది. ట్రేడర్లు వీటిలో షార్ట్ పొజిషన్లు తప్ప లాంగ్ పొజిషన్లు మానేశారు. ఫలితంగానే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి షేరు సోమవారం ఉదయానికి ఏకంగా రూ.240 స్థాయిలోకి పడిపోయింది. మిగిలిన బ్యాంకుల పరిస్థితీ అంతే. ఎన్పీఏలు మరీ పెరిగిపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) సహా బ్యాంకులన్నీ కనిష్ఠ స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు బాగానే పెరుగుతున్నప్పటికీ... ప్రభుత్వ రంగ షేర్లవైపు ఎవరూ చూడటం మానేశారు. ఎఫ్ అండ్ ఓలో వీటిలో షార్ట్ పొజిషన్లు భారీ స్థాయిలో ఉండటమే దీన్ని సూచిస్తోందని చెప్పాలి. షేరు అంతలా ఎందుకు పెరిగాయంటే... అక్టోబర్ నెల డెరివేటివ్స్ గడువు గురువారంతో ముగియనుంది. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇప్పటికే బాగా పడి ఉన్నాయి. ఇంకొక్క రెండ్రోజులు గడిస్తే ఎక్స్పైరీ అయిపోతుంది. నవంబర్ కాంట్రాక్టులు మొదలవుతాయి. ఈ సమయంలో బ్యాంకులకు ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చవచ్చునంటూ మంగళవారం ఉదయం నుంచే కొన్ని వార్తలు వెలువడ్డాయి. కాకపోతే ఎంత మొత్తమిస్తారనేది ఎవ్వరూ చెప్పలేకపోయారు. దీంతో సోమ, మంగళవారాల్లో చాలా వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు 2 నుంచి 4 శాతం వరకూ పెరిగాయి. మంగళవారం మార్కెట్లు ముగిశాక ఆర్థిక మంత్రి నేతృత్వంలో మీడియా సమావేశం పెట్టి... బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్లను మూలధనంగా సమకూరుస్తామని చెప్పారు. అంటే చాలా బ్యాంకులు మొండి బకాయిల్లో కూరుకుపోయి ఉన్నాయి కనుక... వాటికి మరిన్ని రుణాలివ్వటానికి తగిన మూలధనం లేదు కనుక... ఆ మూలధనాన్ని ప్రభుత్వం కొంత బడ్జెట్ నుంచి, కొంత బాండ్ల జారీ ద్వారా సమకూరుస్తుందన్న మాట. అంటే డిపాజిట్లు కాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లోకి గాలివాటం డబ్బులు ఏకంగా కేంద్రం నుంచి వస్తాయి. బ్యాంకులకిది నిజంగా కిక్కిచ్చే వార్తే!!. డెరివేటివ్స్ గడువు తీరే ముందు ఇలాంటి వార్త రావటం... ఆ షేర్లలో లాంగ్ పొజిషన్లున్న వారికి కనకవర్షం కురిపించేదే!!. నిజానికి బ్యాంకులకు ఈ డబ్బులన్నీ వెంటనే వచ్చేవి కావు. కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. సానుకూల వార్త కనక బ్యాంకు షేర్లు కొంత పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికే ఆ షేర్లలో షార్ట్‌లు విపరీతంగా ఉండటంతో... బుధవారం ఉదయాన్నే సదరు బ్యాంకు షేర్లలో దాదాపు 15–20–30% గ్యాప్ అప్‌తో ట్రేడింగ్ మొదలయ్యింది. నిజానికి డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసేవారంతా మార్జిన్ ట్రేడర్లే. అంటే లాట్ ధరలో 15–20% మాత్రమే పెట్టి ట్రేడింగ్ చేస్తారు. ఉదయాన్నే గ్యాప్ అప్‌తో ట్రేడింగ్ మొదలయ్యేసరికి... ఆయా బ్యాంకుల్లో షార్ట్ పొజిషన్లున్న వారందరికీ వారి బ్రోకింగ్ సంస్థల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అర్జంటుగా మరింత మార్జిన్ మనీ అందుబాటులో ఉంచాలని, లేకపోతే ఆ పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ అయిపోతాయని దాని సారాంశం. కొందరి షార్ట్ పొజిషన్లయితే ఎలాంటి మెసేజ్‌లూ లేకుండానే స్క్వేర్ ఆఫ్ అయిపోయాయి. పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ అవుతున్న కొద్దీ ఆయా షేర్లు మరింత పెరగటం మొదలెట్టాయి. ఫలితం... కొన్ని షేర్లు ఏకంగా ఒకేరోజు 45%పైగా పెరిగిపోయాయి. అదీ కథ!! ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? బ్యాంకులకు మూలధనాన్ని అందజేయనున్నట్లు మంగళవారం సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. బుధవారం బ్యాంకు షేర్లు బీభత్సమైన ర్యాలీ చేశాయి. కాకపోతే మంగళవారం ఈ ప్రకటన వెలువడటానికి ముందే కొన్ని ప్రభుత్వ బ్యాంకు షేర్లలో ఆసక్తికరమైన ట్రేడింగ్ జరిగింది. ఉదాహరణకు భారీగా 46 శాతం పెరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంకునే తీసుకుంటే... మంగళవారంనాడు 145 స్ట్రైక్ ప్రైస్ వద్ద దీని కాల్ ధర కనిష్టం 5 పైసలు. గరిష్ఠం రూ.2.20. చిత్రమేంటంటే... గత శుక్రవారం బ్యాంకు షేర్లన్నీ బాగా పపడగా... ఈ కాల్లో రూ.1.98 కోట్ల టర్నోవర్ మాత్రమే జరిగింది. సోమవారం ఈ టర్నోవర్ రూ.4 కోట్లకు చేరింది. కానీ మంగళవారం ఏకంగా ఈ ఒక్క కాల్‌లోనే రూ.104 కోట్ల మేర టర్నోవర్ నమోదయింది. ఇంకేముంది! బుధవారం ఇది ఏకంగా 4,140 శాతం పెరిగిపోయింది. మరి సమాచారం తెలియని వారు అమ్మితే... తెలిసిన వారే ఈ కాల్‌ను కొన్నారా? కొని ఒకేరోజులో ఏకంగా 414 రెట్ల లాభాన్ని జేబులో వేసుకున్నారా? ఇది ఇన్సైడర్ ట్రేడింగేనా? అనే అనుమానాల్ని ట్విటర్ వేదికగా కొందరు వ్యక్తం చేయటం గమనార్హం. -
మొండిబకాయిలే సవాల్..
• బ్యాంకులకు మరిన్ని నిధులిచ్చేందుకు బడ్జెట్ పరమైన పరిమితులు... • సొంతంగా సమీకరణపై దృష్టిపెట్టాలి... • ఆర్థిక వ్యవస్థ మెరుగైతే ఎన్పీఏలు తగ్గుతాయ్.. • పీఎస్‌యూ బ్యాంక్ చీఫ్‌లతో భేటీ తర్వాత • ఆర్థిక మంత్రి జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలు(ఎన్పీఏ) సవాలుగా మారాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ)కు భారీగా నిధులను ఇచ్చే విషయంలో బడ్జెట్ పరంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయని... సొంతంగా నిధుల సమీకరణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన సూచించారు. శుక్రవారమిక్కడ పీఎస్బీ చీఫ్‌లతో బ్యాంకుల పనితీరు సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లపై కొన్ని ఎన్పీఏలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల రుణాల మంజూరుకు అడ్డుకట్టపడుతోంది. ఎన్పీఏల సమస్య ఇలాగే కొనసాగడమో లేదంటే శాశ్వతంగా ఉండిపోయేది కూడా కాదు. అయితే, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ఈ ఇక్కట్లు తగ్గుముఖంపట్టడంతోపాటు రుణాలిచ్చేందుకు నిధులు కూడా అందుబాటులోకి వస్తాయి. పీఎస్బీలకు మరిన్ని మూలధన నిధులను అందించేందుకు మేం సుముఖమే. కానీ, బడ్జెట్ పరంగా పరిమితులు ఉన్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ఎన్పీఏల విక్రయానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడటం లేదని బ్యాంకుల చీఫ్‌లు ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. ఎన్పీఏల విక్రయానికి అవసరమైతే బ్యాంకులకు ఆర్థిక సేవల విభాగం సహకారం అందిస్తుందన్నారు. ఈ ప్రతికూలతలు సద్దుమణిగితే బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకు వీలవుతుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని సాధిస్తాం... ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2014-15లో 5.43 శాతం(రూ.2.67 లక్షల కోట్లు) నుంచి 2015-16 నాటికి 9.32 శాతానికి(రూ.4.76 లక్షల కోట్లు) పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దివాళా చట్టం అమలు; సర్ఫేసీ, డీఆర్టీ చట్టాల్లో సవరణలు వంటి పలు చర్యలను ఇటీవల ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్నాయని.. వీటిని సమర్ధంగా అమలు చేస్తే బ్యాంకులు ఎన్పీఏల సమస్యను ధీటుగా ఎదుర్కోగలవని జైట్లీ చెప్పారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయని ఆయన పేర్కొన్నారు. కాగా, నిధుల కొరతను ఎదుర్కొంటున్న 13 పీఎస్బీలకు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా తొలివిడత రూ.22,915 కోట్ల మూలధనాన్ని కేంద్రం ఇటీవలే సమకూర్చిది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ఈ ఏడాది మరిన్ని నిధులను కేంద్రం అందించనుంది. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం పీఎస్బీలకు రూ.70,000 కోట్ల మేర మూలధన నిధులను ఇచ్చింది. కాగా, వ్యవసాయ రుణాలపై మాట్లాడుతూ.. ఈ రంగానికి అత్యధిక రుణాలే తమ ప్రాధాన్యత అని చెప్పారు. ఈ ఏడాది రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలిచ్చే లక్ష్యాన్ని సాధించగలమని జైట్లీ పేర్కొన్నారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి పూర్తి మద్దతు ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ... ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి కట్టుబడిఉన్నామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తే లేదని జైట్లీ తేల్చిచెప్పారు. ఐదు అనుబంధ బ్యాంకుల(స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావంకోర్, పాటియాలా, మైసూర్)తో పాటు భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ)ను ఎస్బీఐలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం తెలిసిందే. ‘ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి మద్దతు పలికింది. కేబినెట్ కూడా ఓకే చెప్పింది. నిబంధనల ప్రకారమే విలీనం పూర్తవుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయడం విదితమే. మరోపక్క, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ విలీనం వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కాగా, ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 73.98% వాటా ఉంది. దీన్ని దశలవారీగా 49%కి తగ్గించుకోవాలన్నది కేంద్రం యోచన. ద్రవ్యోల్బణం తగ్గుదలను ఆర్బీఐ పరిగణించాలి.. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలను(ఆగస్టులో 5.05 శాతం) దృష్టిలోపెట్టుకొని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రానున్న పాలసీ సమీక్ష(అక్టోబర్ 4న)లో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. ‘వచ్చే నెలలో జరిగే సమీక్షలో ఆర్బీఐ/ఎంపీసీ(ఒకవేళ అప్పటికి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైతే) ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నా. ఆర్బీఐ అనేది అత్యంత బాధ్యతాయుతమైన నియంత్రణ సంస్థ. దాని నిర్ణయంకోసం మనం ఎదురుచూడటంతో పాటు విశ్వసించాలి కూడా’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో గడిచిన సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొన సాగించిన సంగతి తెలిసిందే. -
12,13 తేదీల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల ప్రతిపాదిత విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు నిరసనగా జూలై 12,13 తేదీల్లో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ)బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలంకావడంతో తాము గతంలో ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేయనున్నట్లు ఆల్ అండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం చెప్పారు. జూలై 12న కేవలం ఐదు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేస్తారని, ఆ మరుసటిరోజు జూలై 13న ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని ఆయన వివరించారు. -
బ్యాంకులకు ఇం‘ధనం’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానున్న కొద్ది రోజుల ముందు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటా తగ్గింపుపై ఆర్బీఐ ప్యానల్ చేసిన సూచనల ప్రభావంతో బుధవారం పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ కమిటీ నిబంధనలు అమలు చేయాల్సి వస్తే ముందుగా ఏ బ్యాంకులను ఎంచుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. అధిక వాటా కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంకులు కంటే వాటా తక్కువ ఉన్న బీవోబీ,పీఎన్బీ, ఎస్బీఐ, ఓబీసీ వంటి బ్యాంకులతో ప్రారంభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీ.జే నాయక్ నేతృత్వంలో కమిటీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాను 50 శాతం దిగువకు తగ్గించుకోమని సిఫార్సుచేసింది. దీంతో పీఎస్‌యూ బ్యాంకులు అధిక రుణాలను మంజూరు చేయడానికి కావల్సిన మూలధనాన్ని సులభంగా సమకూర్చుకోవాలని సూచించింది. గత కొంత కాలంగా బ్యాంకులు వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనాన్ని ప్రభుత్వం సమకూరుస్తుండటంతో పలు బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎస్బీఐతో సహా 22 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా వీటిలో 21 బ్యాంకులు స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి. ఈ లిస్టయిన బ్యాంకుల్లో 5 బ్యాంకుల్లో ప్రభుత్వం 80 శాతానికిపైగా వాటాను కలిగి ఉంది. నాలుగు బ్యాంకుల్లో 70 నుంచి 80 శాతం వాటా, ఆరు బ్యాంకుల్లో 60 నుంచి 70 శాతం, మరో ఆరు బ్యాంకుల్లో 50 నుంచి 60 శాతం వాటాను ప్రభుత్వం కలిగి ఉంది. ఈ మధ్యనే ఏర్పడిన భారతీయ మహిళా బ్యాంక్ ఇంకా స్టాక్ మార్కెట్లో నమోదు కాలేదు. అందువల్ల ఈ బ్యాంకులో 100 శాతం వాటా ప్రభుత్వం వద్దే వుంటుంది. అలాగే ఎస్బీఐకి అనుబంధంగా మరో అయిదు ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నప్పటికీ వాటిలో మోజార్టీ వాటా ఎస్బీఐనే కలిగి ఉంది. అన్నిటికంటే అత్యధికంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వానికి 88.63% వాటా ఉండగా, 88%తో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అత్యల్పంగా 56.6% వాటా ఉంది. తలకు మించిన భారం... పీఎస్‌యూ బ్యాంకుల వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం సమకూర్చడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 14,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చగా, ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో రూ.11,200 కోట్లు సమకూర్చడం తెలిసిందే. అదనపు మూలధనం సమకూర్చడం కంటే ప్రభు త్వ వాటాను తగ్గించుకోవడం, పబ్లిక్ ద్వారా ఈ నిధులను సేకరించుకోవడానికి ఆర్బీఐ ప్యానల్ మొగ్గు చూపింది. స్వాగతించిన మార్కెట్లు పీఎస్‌యూ బ్యాంకు బోర్డుల్లో మరింత పారదర్శకత పెంచుతూ, ప్రభుత్వ వాటాలను తగ్గించుకునే విధంగా ఆర్బీఐ కమిటీ చేసిన సూచనలను మార్కెట్లు స్వాగతించాయి. మార్కెట్ సూచీలు స్థిరంగా ముగిసినప్పటికీ నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.3% పెరిగింది. కెనరా, ఇండియన్ బ్యాంకులు ఒక్కరోజులోనే 11 శాతానికిపైగా పెరగడం విశేషం. బ్యాంకులకు మూలధనం అవసరం కావడంతో ఈ నిర్ణయం పీఎస్‌యూ బ్యాంకులను మరింత పటిష్టపరుస్తుందని షేర్‌ఖాన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ దువా పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న ఆశాభావం, ఆర్థిక వృద్ధిరేటు గాడిలో పడుతుందన్న నమ్మకంతో గత కొంతకాలంగా పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పరుగులు తీస్తున్నాయి. 2013లో 30 శాతం నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాది గడిచిన నాలుగున్నర నెలల్లో 29%కి పైగా పెరగడం విశేషం. వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు నాయక్ కమిటీ సిఫార్సులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రకటించింది. ఈ సిఫార్సులను తక్షణం తిరస్కరించకపోతే సమ్మెకు వెనుకాడమని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం హెచ్చరించారు. ప్రభుత్వ వాటాను 51% కంటే తగ్గించడం ద్వారా వీటిని పరోక్షంగా ప్రైవేటీకరించేలా ఈ సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏ బ్యాంకులో ఎంతంటే... బ్యాంకు పేరు ప్రభుత్వ వాటా% సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 88.63 యునెటైడ్ బ్యాంక్ 88 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 85.21 ఇండియన్ బ్యాంక్ 81.51 పంజాబ్ సింథ్ 81.42 యూకో బ్యాంక్ 77.20 ఐడీబీఐ 76.50 విజయా బ్యాంక్ 74.06 ఇండియన్ ఓవర్సీస్ 73.80 కెనరా బ్యాంక్ 69 సిండికేట్ బ్యాంక్ 67.39 బ్యాంక్ ఆఫ్ ఇండియా 66.70 కార్పొరేషన్ బ్యాంక్ 63.33 ఆంధ్రా బ్యాంక్ 60.14 యూనియన్ బ్యాంక్ 60.13 ఓరియంటల్ బ్యాంక్ 59.13 అలహాబాద్ బ్యాంక్ 58.13 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 58.87 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 58.6 దేనా బ్యాంక్ 58.01 బ్యాంక్ ఆఫ్ బరోడా 56.26 -
ఒక్క పాయింట్లో రికార్డు మిస్
ఒక్క పాయింట్ తేడాతో బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని మిస్సయ్యింది. పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ముగింపు సమయంలో 21,205.44 పాయింట్ల స్థాయికి పరుగులు పెట్టింది. అయితే 2008 జనవరి 10న నెలకొల్పిన 21,206.77 పాయింట్ల రికార్డును అధిగమించలేకపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 130 పాయింట్లు లాభపడి 21,164 వద్ద క్లోజయ్యింది. ఇది సెన్సెక్స్‌కు కొత్త క్లోజింగ్ రికార్డు. ఎన్ఎస్ఈ నిఫ్టీ మూడేళ్ల విరామం తర్వాత తొలిసారిగా 6,300 స్థాయిని అధిగమించి, 6,309 వద్దకు చేరింది. చివరకు 47 పాయింట్ల పెరుగుదలతో 6,299 వద్ద ముగిసింది. ఎఫ్ఐఐలు రూ. 1875 కోట్ల పెట్టుబడి చేయగా, రూ. 834 కోట్ల విలువైన షేర్లను దేశీయ సంస్థలు విక్రయించాయి. 2008 జనవరి 8ననెలకొల్పిన 6,357 పాయింట్ల రికార్డుస్థాయిని నిఫ్టీ ఇంకా బద్దలు చేయాల్సివుంది. 2010 నవంబర్ 5న 6,312 పాయింట్ల గరిష్ట ముగింపు రికార్డుకు నిఫ్టీ మరో 13 పాయింట్ల దూరంలో వుంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని కొనసాగించనున్నట్లు గత రాత్రి ప్రకటించినా, ఇతర ప్రపంచ మార్కెట్లు లాభాల స్వీకరణ ఫలితంగా క్షీణించాయి. కానీ స్థానిక మార్కెట్లో అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు ముగింపురోజైనందున, ట్రేడింగ్ చివరి అరగంటలో పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరిగిందని, దాంతో సూచీల ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత మూడురోజుల్లో సెన్సెక్స్ 594 పాయింట్లు లాభపడింది. ఒక్క అక్టోబర్ నెలలో భారీగా 1,785 పాయింట్ల ర్యాలీ జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్‌ల ఫలితాలు మార్కెట్‌ను పాజిటివ్‌గా ఆశ్చర్యపర్చడంతో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి. భారీ టర్నోవర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండు ఎక్స్ఛేంజీల్లో నగదు, డెరివేటివ్ విభాగాల్లో కలిపి భారీగా రూ. 5.33 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది. భారత్ స్టాక్ మార్కెట్లో ఇంత పెద్ద ఎత్తున టర్నోవర్ నమోదుకావడం ఇదే ప్రధమం. సెన్సెక్స్ పెరిగినా, సంపద పోయింది.... బీఎస్ఈ సెన్సెక్స్ 1.33 పాయింట్ల తేడా మినహా రికార్డుస్థాయికి చేరువైనా, ఇన్వెస్టర్ల సంపద మాత్రం మూడేళ్ల క్రితంకంటే ఇప్పుడు రూ. 10 లక్షల కోట్లు తగ్గింది. లిస్టెడ్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 68,44, 774 కోట్లకు చేరింది. 2010 నవంబర్ 5న సెన్సెక్స్ 21,005 పాయింట్ల వద్ద ముగిసినపుడు ఆ విలువ రూ. 77,28,600 లక్షల కోట్లు వుండేది. ఇప్పటివరకూ ఆ విలువే భారత్‌లో రికార్డు. -
కాని వసూళ్లు.. బాకీలకు నీళ్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ(పీఎస్‌యూ) బ్యాంకులను ఆర్థిక మందగమనం అతలాకుతలం చేస్తోంది. ముక్కుపిండి మరీ రుణ బకాయిలను వసూలు చేయాలంటూ ఆర్థిక శాఖ పదేపదే ఉపదేశిస్తున్నా... ఫలితం మాత్రం కానరావడంలేదు. రికవరీ చేస్తున్న మొత్తంకంటే మాఫీ చేస్తున్నదే రెట్టింపునకు పైగా ఉండటం దీనికి నిదర్శనం. మొత్తం 26 పీఎస్‌యూ బ్యాంకులకుగాను 17 బ్యాంకులది ఇదే పరిస్థితి కావడం గమనార్హం.గత ఆర్థిక సంవత్సరం(2012-13) మార్చితో ముగిసిన ఆఖరి తైమాసికం(క్యూ4)లో మొత్తం 17 పీఎస్‌యూ బ్యాంకుల రుణ రికవరీలు రూ.4,172 కోట్లు మాత్రమే. ఆర్థిక శాఖ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇదే కాలంలో ఈ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల విలువ రూ.10,787 కోట్లు కావడం మొండి బకాయిల దెబ్బకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ జాబితాలో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సహా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. 2011-12లో మొత్తం 26 పీఎస్‌యూల బ్యాంకుల మాఫీల కంటే ఒక్క గతేడాది క్యూ4లో మాఫీలు నాలుగురెట్లకుపైగా ఉండటం గమనార్హం. 2011-12లో వాస్తవ ప్రభుత్వ బ్యాంకుల వాస్తవ రుణ రికవరీలు రూ.47,800 కోట్లు కాగా... మాఫీల మొత్తం రూ.2,300 కోట్లుగా ఉంది. చిదంబరం మేల్కొలుపు... తాజాగా పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లతో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి చిదంబరం మొండిబకాయిల పెరుగుదలను ప్రధానంగా చర్చించారు. మాఫీల మొత్తం పెరిగిపోతుండటం... రికవరీలు నత్తనడకపై ఆర్థిక శాఖ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది కూడా. మొండి బకాయిల(ఎన్పీఏలు) సమస్యను పరిష్కరించేందుకు చిదంబరం పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ఒక ఏడాదిలో బ్యాంకులు తమ మొత్తం రికవరీల కంటే మాఫీలు అధికంగా ఉండకుండా తప్పని సరిగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లాభాలు ఆవిరి... ఏదైనా ఒక ఖాతాదారుడికి ఇచ్చిన రుణాన్ని మాఫీ చేయాలంటే సంబంధిత మొత్తానికి 100% ప్రొవిజనింగ్(బ్యాంక్ తన సొమ్మును పక్కన పెట్టాల్సి ఉంటుంది) కేటాయింపు చేయా ల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు తమ స్థూల మొండి బకాయిలు తక్కువగా ఉన్నట్లు ఖాతాల్లో కనబడొచ్చు. అయితే, ప్రొవిజనింగ్‌కు అధిక మొత్తం వెచ్చించడంతో బ్యాంకుల లాభాలు ఆవిరయ్యేందుకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో ఆర్థిక మందగమనం తీవ్రతరం అవడంతో అనేక కంపెనీలు రుణాలు చెల్లించకుండా చేతులెత్తేస్తున్నాయి. ఇటువంటి ఎగవేతల ప్రభావం పీఎస్‌యూ బ్యాంకులపైనే అధికం. మొండిబకాయిలు పేరుకుపోయి... బ్యాంక్ భవిష్యత్తు వృద్ధిపై తీవ్ర ప్రభావానికి దారితీస్తోంది. కావాలనే రుణాలను ఎగవేస్తున్న డిఫాల్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అటువంటి ఎంటర్ప్రెన్యూర్లు/ప్రమోటర్లకు బ్యాంకుల నుంచి ఎలాంటి సహకారం లభించకుండా ఐదేళ్లపాటు నిషేధం విధించడం వంటివి కూడా ఈ సూచనల్లో ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టే కొత్త వెంచర్లు, ప్రాజెక్టులకు ఏ ఆర్థిక సంస్థ/బ్యాంక్ నుంచి రుణాలు లభించకుండా చేయాలని కూడా ఆర్థిక శాఖ పేర్కొంది. అదేవిధంగా రికవరీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిందిగా కూడా సూచించింది. కొత్త/ప్రస్తుత రుణగ్రహీతలకు రుణాల మంజూరు విషయంలో సంబంధిత వివరాలను బ్యాంకులు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి చేయాలని పేర్కొంది. మొండి బకాయిల వసూలు/రుణాల రికవరీలకు బ్యాంకులకు చట్టపరంగా మూడు మార్గాలున్నాయి. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్(సర్ఫేసీ) చట్టం-2002 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఇక డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, లోక్ అదాలత్‌లను ఆశ్రయించొచ్చు. మొండి బకాయిలు పైపైకి... ప్రైవేటురంగ బ్యాంకులతో పోలిస్తే పీఎస్‌యూ బ్యాంకుల స్థూల, నికర మొండి బకాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాకుండా రుణాల పునర్వ్యవస్థీకరణవల్ల కూడా అధిక ప్రొవిజనింగ్ కేటాయింపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల మొత్తం స్థూల ఎన్పీఏలు వాటి రుణాల్లో 3.78 శాతానికి ఎగబాకాయి. 2011 మార్చి చివరికి ఇవి 2.32 శాతమే. ఇక ఎస్బీఐ స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది మార్చి చివరినాటికి ఏకంగా 5.17 శాతానికి దూసుకెళ్లడం గమనార్హం. మాఫీల చిట్టా ఇదీ...(రూ.కోట్లలో) బ్యాంక్ 2012-13 క్యూ4 రికవరీ మాఫీ ఎస్బీఐ 1,132.00 2,418.00 బీఓబీ 326.08 1,207.21 ఐఓబీ 221.49 1,150.50 బీఓఐ 230.81 1,286.19 పీఎన్బీ 442.38 906.88 యునెటైడ్ బ్యాంక్ 130.00 786.00 అలహాబాద్ బ్యాంక్ 137.41 520.85 యూకో బ్యాంక్ 360.68 447.32 విజయా బ్యాంక్ 67.79 323.86 ఐడీబీఐ బ్యాంక్ 217.88 371.46 సిండికేట్ బ్యాంక్ 251.43 340.03 ఓబీసీ 211.13 297.94 ఎస్బీఎం 82.86 172.47 ఇండియన్ బ్యాంక్ 109.23 170.42 బీఓఎం 123.84 170.34 దేనా బ్యాంక్ 84.68 122.92 కార్పొరేషన్ బ్యాంక్ 41.87 94.46 మొత్తం 4,171.56 10,786.85