న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థల షేర్లతో కూడిన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, తగు సూచనలిచ్చేందుకు త్వరలో సలహాదారు నియామకం కూడా జరపనుందని అధికార వర్గాలు తెలిపాయి. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్, భారత్–22 ఈటీఎఫ్‌లు విజయవంతం కావడంతో కేంద్ర ఆర్థిక శాఖ ఈ సాధనం పరిధిని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో రెండు బీమా సంస్థలు (జనరల్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స), 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐఎఫ్‌సీఐ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి.
కేంద్రం భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రూ. 32,900 కోట్లు, అయిదు విడతల సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ల ద్వారా రూ. 38,000 కోట్లు దేశీ మార్కెట్ నుంచి సమీకరించగలిగింది. సీపీఎస్‌ఈ షేర్ల ఆధారిత ఈటీఎఫ్‌లను అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టడంపై ఆర్థిక శాఖ విదేశీ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ) ఈటీఎఫ్‌లో ప్రస్తుతం 11 సంస్థలు ఉన్నాయి. ఓఎన్ జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, పవర్ ఫైనాన్స, ఆర్‌ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్ టీపీసీ, ఎన్ బీసీసీ, ఎన్‌ఎల్‌సీ, ఎస్‌జేవీఎన్ ఇందులో ఉన్నా యి. సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 90,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment