ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) 2020 నవంబర్‌లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ)తో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐలను పంపిణీ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 2021లో కెనరా బ్యాంక్ నికర లాభం రూ.2,557 కోట్లు. దీంతో కెనరా బ్యాంక్ ఈ వారం తన సిబ్బందికి 15 రోజుల జీతం విలువైన పీఎల్‌ఐ(పనితీరు-ఆధారంగా ప్రోత్సాహకాల)ను చెల్లించింది. బ్యాంకులు మే 18న నాలుగవ త్రైమాసికంలో 1,010.87 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని ఆర్జించాయి.
2020-21 నాలుగో త్రైమాసికంలో 165 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీఎల్‌ఐ కింద నగదును తన ఉద్యోగులకు విడుదల చేసింది. అన్ని ర్యాంకులు, హోదాల్లోని ఉద్యోగులకు ఈ పీఎల్‌ఐలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐలో 2.5 లక్షల మందికి ఈ లాభం పొందే అవకాశం ఉంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment