iba
-
మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి
న్యూఢిల్లీ: మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను అందించడానికి ఫైనాన్షియల్ రంగం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. మహిళలను ప్రోత్సహించే వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఆయన సూచించారు. సమగ్ర వృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ వాస్తవ అభివృద్ధి చెందిన భారతదేశం అంటే.. దేశంలోని ప్రతి పౌరుడు సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ఫిక్కీ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్‌ఐబీఏసీ– 2024 ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, భారత్ శ్రామిక శక్తి భాగస్వామ్యం (మహిళల భాగస్వామ్యం) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. బాలికల విద్యను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, పని ప్రదేశంలో భద్రత, సామాజిక అడ్డంకులను పరిష్కరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు. వినియోగం, డిమాండ్ సమిష్టిగా పెరగడంతో భారతదేశ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందన్నారు. భూమి, కారి్మక, వ్యవసాయ మార్కెట్లలో సంస్కరణల ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. -
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతనం పెంపు
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పెంచాలని కొద్దిరోజులుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి శుక్రవారం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా రూ.12,449 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు తెలిసింది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలుకానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పనిగంటలు అమల్లోకి వస్తాయి. కొత్త డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. దీని ప్రకారం.. మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్‌లను నగదుగా మార్చుకోవచ్చు. విధుల్లో మరణించినా, ఈ మొత్తం సంబంధీకులకు చెల్లిస్తారు. ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. 2022 అక్టోబరు 31న, అంతకుముందు పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. -
బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల నిత్యం గ్యాస్ ధరల పెరుగుతున్నాయి. భారత్ విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. చేసేదేమిలేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. అయితే దిగుమతి చేసుకునే గ్యాస్ స్థానే స్థానికంగా బయోమాస్‌ను సేకరించి దీన్ని తయారుచేసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్(ఐబీఏ) సూచించింది. అందుకు అనుగుణంగా బయోమాస్ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఐబీఏ పేర్కొంది. బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్‌ను సప్లయ్ చేయడానికి మెషినరీ, ఎక్విప్మెంట్ల కోసం రూ.30 వేలకోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ఐబీఏ అంచనా వేసింది. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వరిగడ్డి వంటి అగ్రి వేస్టేజ్‌ను బయోఎనర్జీ ఉత్పత్తికి వాడుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్ కేడియా అన్నారు. అయితే బయోమాస్‌ను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దాన్ని సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి అధికమొత్తంలో ఖర్చువుతుందని, దీంతో వరిగడ్డి వంటి అగ్రి వేస్ట్‌ను అమ్మడం కంటే తగలబెట్టడానికే రైతులు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం కంటే వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్మెంట్లను వాడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. -
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
మనవాళ్ళు బంగారం
ఇది మన అమ్మాయిలు రాసిన కొత్త చరిత్ర. ఒకటీ రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలు. అదీ అంతర్జాతీయ పోటీల్లో! ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మన దేశ మహిళా బాక్సింగ్ జట్టు నాలుగు పసిడి పతకాలతో ప్రపంచమంతా తలతిప్పి చూసేలా చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శనివారం నీతూ ఘంఘాస్ (48 కిలోల విభాగం), స్వీటీ బూరా (81 కిలోలు) బంగారు పతకాలు సాధిస్తే, ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కిలోలు) పసిడి కాంతులు పూయించారు. మొత్తం నలుగురూ తమ బాక్సింగ్ పంచ్‌లతో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. నిన్నటి మేరీ కోమ్ వారసులుగా బాక్సింగ్‌లో మరింత మంది యువతులు ముందుకొచ్చిన చరిత్రాత్మక సందర్భం పతకాల సాక్షిగా వెల్లడైంది. హర్యానా ఆడపిల్ల నీతూ, తెలంగాణ యువతి నిఖత్, అస్సామ్ అమ్మాయి లవ్లీనా, హర్యానాకే చెందిన సీనియర్ క్రీడాకారిణి స్వీటీ... నలుగురూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. స్వర్ణపతకం సాధించి తల్లి మెడలో దాన్ని అలంకరించాలని ఓ అమ్మాయి, బహుమతిగా వచ్చే పారితోషికంతో కొత్త మెర్సిడెస్ కారు కొని తల్లితండ్రులను తమ సొంతవూరు నిజామాబాద్‌కు తీసుకెళ్ళాలని మరో యువతి, సరైన ఫామ్‌లో లేవంటూ కొట్టిపారేసిన విమర్శకుల నోళ్ళు మూయించాలని ఇంకో వనిత, ఇష్టదైవతారాధన, ఆశీస్సులతోనే విశ్వవేదికపై విజయం సాధ్యమని భావించే వేరొక హర్యానా యువతి – ఇలా ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ప్రేరణ. మొత్తం 13 దేశాల నుంచి వచ్చి, ప్రపంచపోరులో ఫైనల్స్‌కు చేరిన మహిళలు 24 మంది. వారిలో భారత మహిళా బాక్సింగ్ చతుష్టయం సత్తా చాటింది. భారత్‌తో పాటు ఒక్క చైనా నుంచే నలుగురు ఫైనల్స్‌కు చేరుకొని, స్వర్ణాల కోసం పోటీపడ్డారు. గత ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 పతకాలు సాధించిన భారత్ ఈసారి 4 పతకాలు గెలిచి, మునుపటి రికార్డును మెరుగుపరుచుకోవడం విశేషం. గత ఏడాది 52 కిలోల విభాగంలో వరల్డ్ టైటిల్ సాధించిన 26 ఏళ్ళ నిఖిత్ ఈసారి కొత్తగా 50 కిలోల విభాగం ఎంచుకొని, అందులో తన సత్తా చాటారు. గతంలో రెండుసార్లు ఏషియన్ ఛాంపియన్ అయిన వియత్నామ్‌కు చెందిన ప్రత్యర్థి నూయెన్ తీ తామ్‌పై ఫైనల్లో 5–0 తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఆఖరి మూడు నిమిషాల ఆటలో, ప్రత్యర్థి చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, శరీర దార్ఢ్యం, మానసిక బలం తోడుగా నిఖత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ పోటీల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణాలు సాధించి, చరిత్రకెక్కారు. మేరీ లానే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా సైతం ఫైనల్లో రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అయిన ఆస్ట్రేలియాకు చెందిన గెయిట్లిన్ పార్కర్‌పై హోరాహోరీ పోరాడి, 5–2 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎప్పుడూ ఎదురుదాడి అనే ఏకైక వ్యూహంతో సాగే నీతూ ఆటలో పరిస్థితి, ప్రత్యర్థిని బట్టి వ్యూహాన్ని మార్చుకొనే కళను అలవరుచున్నారు. బాక్సింగ్ మెలకువల్లో ఆరితేరిన నిఖత్ సైతం తాను పోటీపడ్డ ఒలింపిక్ వెయిట్ వర్గంలోని ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్లతో తలపడి, మెరుగైన ఆటతీరుతో దుమ్మురేపడం గమనార్హం. రానున్న ఆసియా క్రీడోత్సవాలకు సిద్ధం కావడానికీ, తప్పులు సరిదిద్దుకోవడానికీ ఈ ప్రపంచ బాక్సింగ్ పోటీలు మన అమ్మాయిలకు మంచి అవకాశమయ్యాయి. మరో 16 నెలల్లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకు సాగే ఊపు తెచ్చింది. నిజానికి, క్రీడల్లో మన దగ్గర ప్రతిభాపాటవాల కొరత లేదు. యువతరంలో బోలెడంత ఉత్సాహం, ఉత్తేజం ఉన్నాయి. అయితే, ఆ యువ క్రీడాప్రతిభను సరైన పద్ధతిలో తీర్చిదిద్ది, దోవలో పెట్టే వేదికలే ఎప్పుడూ కరవు. 2018లో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతినీ, ప్రాథమిక వసతి సౌకర్యాలనూ పెంపొందించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లో ‘ఖేల్ మహాకుంభ్’ను ప్రారంభించారు. క్రమంగా అది బిహార్, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, కశ్మీర్‌లలోని గ్రామాలకు విస్తరించింది. దేశంలో కనీసం 200 మంది దాకా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఖేల్ మహాకుంభ్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇవన్నీ దిగువ, మధ్యాదాయ కుటుంబాల యువతుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. సాంప్రదాయిక పురుషాధిక్య రంగంలోనూ మహిళలు పైకి రావడానికి దోహదపడ్డాయి. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ తర్వాత పాలకుల ‘ఖేలో ఇండియా’ పథకం నవతరం ఆశలకు కొత్త ఊపిరి. మెరుగైన శిక్షణకు క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ యువతరానికి, ముఖ్యంగా యువతులకు వరం. మీడియా దృష్టిపెట్టని అనేక భారతీయ ఆటలు ఈ పథకంతో జనం ముందుకు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనే అథ్లెట్లకు ప్రోత్సాహం అందుతోంది. మగవారివే అనుకొనే క్రీడల్లోనూ మన వనితల జైత్రయాత్రకు ఇలాంటి ప్రయత్నాలు ఓ ఉత్ప్రేరకం. లింగభేదాల గోడలను బద్దలుకొట్టి, అందరికీ అభిమాన బాక్సర్‌గా నిఖత్ అవతరించడం అవిస్మరణీయం. గమనిస్తే, మన దేశపు ఒలింపిక్ పతకాల పట్టికలోనూ మహిళలే మహారాణులు. ఇంటా బయటా ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆరుసార్లు ప్రపంచ టైటిళ్ళు సాధించిన బాక్సర్ మేరీ కోమ్ ఆదర్శంగా మరిన్ని జాతి రత్నాలు వెలుగులోకి వచ్చాయి. 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ విజయ గాథ తర్వాత మన పురుషుల బాక్సింగ్ కొంత స్తబ్దుగా మారినవేళ బాక్సింగ్‌ను భారత్‌కు పతకాల అడ్డాగా మార్చిన మహిళలూ మీకు జోహోర్లు! -
కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు లభించాయి. ‘‘బెస్ట్ టెక్నాలజీ టాలెంట్ ’’ కేటగిరీ అవార్డుతోపాటు బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్, బెస్ట్ డిజిటల్ ఎంగేజ్మెంట్, బెస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కేటగిరీల్లోనూ బ్యాంక్‌కు అవార్డులు లభించాయి. ముంబైలో జరిగిన ఐబీఏ 18వ బ్యాంకింగ్ టెక్నాలజీ సదస్సు, ఎక్స్పో అండ్ అవార్డులు– 2022 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ లెండింగ్ ద్వారా రుణ వృద్ధి’ అనే అంశంపై జరిగిన ఒక చర్చా గోష్టిలో అశోక్ చంద్ర పాల్గొని, ఈ విభాగంలో లభ్యమవుతున్న అవకాశాల గురించి మాట్లాడారు. -
మంత్రిగారు మా గోడు వినండి! ట్యాక్స్–ఫ్రీ డిపాజిట్ల కాలాన్ని తగ్గించండి
న్యూఢిల్లీ: పన్ను రహిత స్థిర డిపాజిట్ల (ట్యాక్స్–ఫ్రీ ఎఫ్డీలు) కాలపరిమితిని ప్రస్తుత ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 2022–23 వార్షిక బడ్జెట్లో ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కోరింది. వచ్చే నెల ఒకటవ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఐబీఐ చేసిన బడ్జెట్ ముందస్తు సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల (ఈఎల్ఎస్ఎస్) వంటి మ్యూచువల్ ఫండ్ ప్రొడక్స్కు అందిస్తున్న పన్ను ప్రయోజనాలను స్థిర డిపాజిట్లకు అందించాలి. ఇందుకు సంబంధించి పన్ను రహిత స్థిర డిపాజిట్ల కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద ఐదేళ్ల స్థిర డిపాజిట్ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ. 1.50 లక్షల పనున మినహాయింపు ఉంది. ► మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ (ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల వంటివి) పోలిస్తే, పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) తక్కువ ఆకర్షణీయంగా ఉంది. అయితే లాక్–ఇన్ వ్యవధిని తగ్గించినట్లయితే, పన్నుల పరంగా స్థిర డిపాజిట్లు కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. తద్వారా బ్యాంకులకు సైతం నిధుల లభ్యత పెరగుతుంది. ► బలహీన రంగాలను ప్రోత్సహించడం, వివిధ పథకాలను అమలుచేయడంసహా అందరికీ ఆర్థిక ఫలాలు అందించడం, బ్యాంకింగ్ సేవల విస్తృతి, డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడం, ఐటీ వ్యయాలవంటి అంశాలకు బ్యాంకులు వివిధ ఖర్చులను బ్యాంకింగ్ భరిస్తోంది. వీటి భర్తీకి కొంతమేర ప్రత్యేక రిబేట్లు, అదనపు ప్రోత్సహకాలను కూడా బ్యాంకింగ్ కోరుతోంది. ► పన్నులకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం బ్యాంకింగ్‌కు అవసరం. ► బ్యాంకుల అప్పీళ్ల వ్యవహారాల్లో గణనీయమైన మొత్తాలు కూడా ఉంటాయి. అయితే విచారణ సందర్భల్లో భారీ మొత్తాలకు సంబంధించిన అంశాలనుకూడా చిన్న మొత్తాలతో కూడిన అప్పీళ్లతో సమానంగా పరిగణిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ► బ్యాంకులు–ప్రభుత్వ వాఖ మధ్య అప్పీళ్ల వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు ఉండాలి. ► పన్ను శాఖ– బ్యాంకుల మధ్య వ్యాజ్యాలను తగ్గించడానికి, అప్పీల్ ప్రక్రియ విచారణను వేగవంతంగా పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయపాలనతో ఏర్పాటు చేయబడిన వివాదాల కమిటీ మాదిరిగానే ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం అవసరం. చదవండి: కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..! -
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) 2020 నవంబర్‌లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ)తో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐలను పంపిణీ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 2021లో కెనరా బ్యాంక్ నికర లాభం రూ.2,557 కోట్లు. దీంతో కెనరా బ్యాంక్ ఈ వారం తన సిబ్బందికి 15 రోజుల జీతం విలువైన పీఎల్ఐ(పనితీరు-ఆధారంగా ప్రోత్సాహకాల)ను చెల్లించింది. బ్యాంకులు మే 18న నాలుగవ త్రైమాసికంలో 1,010.87 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని ఆర్జించాయి. 2020-21 నాలుగో త్రైమాసికంలో 165 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీఎల్ఐ కింద నగదును తన ఉద్యోగులకు విడుదల చేసింది. అన్ని ర్యాంకులు, హోదాల్లోని ఉద్యోగులకు ఈ పీఎల్ఐలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐలో 2.5 లక్షల మందికి ఈ లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా లభిస్తుంది. చదవండి: నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును వర్తింపచేయనున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపుతో బ్యాంక్‌లపై ఏటా 7900 కోట్ల రూపాయల భారం పడనుంది. వేతన పెంపును బకాయిలతో సహా నవంబర్ జీతంతో ఉద్యోగులు అందుకోనున్నారు. వేతనాల పెరుగుదలతో దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఇంక్రిమెంట్ బకాయిలను ఈనెల 1 నుంచి విడుదల చేస్తారని బ్యాంకు అధికారుల యూనియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు సామర్ధ్యం కనబరిచినవారిని ప్రోత్సహించే లక్ష్యంతో సామర్ధ్య ఆధారిత వేతనాల పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టామని ఐబీఏ ఓ ప్రకటనలో తెలిపింది. వేతన పెంపు సంప్రదింపుల్లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్ బ్యాంకులు, 6 విదేశీ బ్యాంకుల ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇక కేంద్ర వేతన సంఘ సిఫార్సులను వర్తింపచేయాలని, వారానికి ఐదు రోజుల పని, కుటుంబ పెన్షన్ తాజాపరచడం వంటి మూడు ప్రధాన డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే తొలి రెండు డిమాండ్లపై ఆశించిన ఫలితాలు చేకూరలేదు. కుటుంబ పెన్షన్ పథకం డిమాండ్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు ఐబీఏ అంగీకరించింది. ఇక ఈ పథకాన్ని బ్యాంకు ఉద్యోగులకు వర్తింపచేయడంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. చదవండి : గుడ్‌న్యూస్ : టెకీలకు వేతన పెంపు -
నగరంలో ‘పేమెంట్’ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పేమెంట్ యాప్స్, కార్డులు ఇతరత్రా నగదురహిత లావాదేవీలను నిర్వ హించడం, వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేశాయి. రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎన్పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్‌కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ఎన్పీసీఐ నిర్మి స్తోంది. ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద డిజిటల్/ ఆన్లైన్ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భ స్తుంది. భౌగోళికంగా, మానవవనరుల పరం గా, శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరానికి ఉన్న అనుకూలతలు నగరాన్ని ఎంచు కోవడానికి దోహదపడ్డాయి. భూకంపం, తుపాన్ల వంటి ప్రకతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ డేటా సెంటర్‌ను నిర్మించను న్నారు. ఎల్అండ్టీ సంస్థకు ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులను అప్పగించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యక్యాదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న వ్యాపారాల నుంచి రూ. 2.32 లక్షల కోట్ల డిఫాల్ట్‌ల ముప్పు: సిబిల్
ముంబై: కోవిడ్–19 ప్రభావంతో చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.2.32 లక్షల కోట్లు డిఫాల్ట్ అయ్యే తీవ్ర పరిస్థితి నెలకొందని సిబిల్ పేర్కొంది. ప్రత్యేకించి రూ.10 లక్షలలోపు రుణం ఉన్న లఘు పరిశ్రమలు తీవ్రంగా కరోనా ప్రభావానికి గురవుతాయని బుధవారంనాడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ పేర్కొంది. రూ.10 లక్షల లోపు రుణం ఉన్న చిన్న సంస్థల మొత్తం రుణ పరిమాణం దాదాపు రూ.93,000 కోట్లయితే, ఇందులో రూ.13,600 కోట్లు మొండిబకాయిల ఖాతాలోకి వెళ్లొచ్చని అంచనావేసింది. చిన్న పరిశ్రమలను ఆదుకోవాలి.. ఐబీఏ: కాగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలని కేంద్రం, ఆర్బీఐలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ రంగానికి సంబంధించి రుణ బకాయిల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వన్‌టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్ వంటి కొన్ని కీలక సిఫారసులు ఐబీఏ జాబితాలో ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలుసహా పలు పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఐబీఏ కీలక సిఫారసులు చేసింది. -
ఐబీఏ ఫోరెన్సిక్ ఆడిటర్ల జాబితాలో దిగ్గజ సంస్థలు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్న ఆడిటర్ల జాబితాలో దిగ్గజ సంస్థలకూ చోటు దక్కింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) రూపొందించిన జాబితాలో కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై), డెలాయిట్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఉన్నాయి. ఇంకా బీఎంఆర్ అడ్వైజర్స్, చోక్సి అండ్ చోక్సి ఎల్ఎల్పీ, గ్రాంట్ థార్న్టన్, ముకుంద్ ఎం చితాలే అండ్ కో సైతం ఫోరెన్సిక్ ఆడిటర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. మొత్తం మీద 39 ఆడిట్ సంస్థలతో ఐబీఏ ఈ జాబితాను రూపొందించింది. ఈ సంస్థలు బ్యాంకుల్లో రూ.50 కోట్లకుపైగా విలువైన మోసాలకు సంబంధించి ఆడిట్ నిర్వహించనున్నాయి. అలాగే రూ.50 కోట్లకు లోపున్న మోసపూరిత కేసుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ కోసం గాను 73 ఆడిట్ సంస్థలను ఐబీఏ గుర్తించింది. బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో రూ.లక్షకు పైన విలువతో కూడిన మోసాల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. 2012–13లో వీటి సంఖ్య 4,235గా ఉంటే, 2016–17లో 5,076 కేసులు నమోదయ్యాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.69,769 కోట్ల విలువ మేర మోసాలు జరిగాయి. ఇందుకు సంబంధించి 22,949 కేసులు వెలుగు చూడడం గమనార్హం. -
నేడు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనుండటంతో సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుల విలీనాల ప్రతిపాదనలను ఉపసంహరించుకవోడం, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల్ని నేరపూరిత చర్యగా ప్రకటించడం, ఎన్పీఏల వసూలుకు పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయడం వంటి డిమాండ్లపై ఒక రోజు సమ్మెకు తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపునివ్వటం తెలిసిందే. సమ్మె కారణంగా డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ సేవలకు విఘాతం కలగనుంది. దీనిపై ఖాతాదారులకు ఇప్పటికే సమాచారం కూడా అందించినట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తెలిపింది. మరోవైపు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు తదితర బ్యాంకుల సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మరింతగా పుంజుకుంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడం, తగినంతగా నిధుల లభ్యత, విదేశీ ఆర్థిక అనిశ్చితిని తట్టుకొని నిలబడగలిగే సత్తా తదితర అంశాలు మన ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తాయనేది వారి అభిప్రాయం. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికానికిగాను నిర్వహించిన సర్వేలో 31 దిగ్గజ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన ఉన్నతాధికారుల అభిప్రాయాలతో ఈ నివేదికను రూపొందించారు. కాగా, సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని బ్యాంకర్లు భావిస్తున్నారు. ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) తగ్గుముఖం పట్టడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే తీవ్ర మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్ రుణాలపై ఈ వడ్డీరేట్ల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్పీఏలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కు మరిన్ని అధికారాలను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు రూ.6 లక్షల కోట్లకు ఎగబాకిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఆర్థిక పరిస్థితుల సూచీ పైపైకి... సీఐఐ–ఐబీఏ ఆర్థిక పరిస్థితుల సూచీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 56.9కు ఎగబాకింది. క్రితం త్రైమాసికం(జనవరి–మార్చి)లో సూచీ 48 వద్ద ఉంది. అంటే అన్ని అంశాల్లోనూ దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అధిక శాతం మంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నట్లు లెక్క. ‘సూచీ మెరుగుదలను చూస్తే.. ఆర్థిక వ్యవస్థపై ఫైనాన్షియల్ రంగంలో చాలా ఆశావహ దృక్పథం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా దేశీయ వినిమయం జోరందుకోవడం, మౌలికసదుపాయాలపై భారీ వ్యయం, జీఎస్టీ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం సహా ఇంకా కీలకమైన పలు సంస్కరణలకు ప్రభుత్వం నడుంబిగించడం దీనికి కారణం’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాల వినియోగం పూర్తిస్థాయిలో లేనందున కార్పొరేట్ల నుంచి రుణాలకు డిమాండ్ తక్కువగానే కొనసాగనుంది. గతేడాది(2016–17) చివరి త్రైమాసికంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు పూర్తిగా బదలాయించిన నేపథ్యంలో ఈ త్రైమాసికం(మార్చి–జూన్)లో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం లేదని ఐబీఏ చైర్మన్ రాజీవ్ రిషి చెప్పారు. -
ఐడీఎస్ జరిమానాను పాత నోట్లతోనే కట్టొచ్చు
నిరాకరించొద్దంటూ బ్యాంకులకు ఐబీఏ సూచన న్యూఢిల్లీ: నల్లధనానికి సంబంధించి ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద ప్రకటించిన సొమ్ముపై డిక్లరెంట్లు తొలి విడతగా కట్టే పన్నులు, జరిమానాలను పాత రూ.500 నోట్ల రూపంలోనూ స్వీకరించవచ్చని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సోమవారం బ్యాంకులకు సూచించింది. అలా చెల్లించిన నిధులకు సంబంధించిన మూలాల గురించి ప్రశ్నించరాదని పేర్కొంది. డిక్లరెంట్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చెల్లింపుల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని బ్యాంకులకు రాసిన లేఖలో సూచించింది. ఐడీఎస్ కింద ప్రకటించిన ఆదాయంపై పన్ను, పెనాల్టీలను పాత నోట్ల రూపంలో తీసుకునేందుకు బెంగళూరులోని ఓ బ్యాంకు శాఖ నిరాకరించిందంటూ ఒక డిక్లరెంటు చేసిన ఫిర్యాదును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి సీబీడీటీ తీసుకొచ్చిన అంశాన్ని ఐబీఏ ప్రస్తావిం చింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనల ప్రకారం ఐడీఎస్ 2016కు సంబంధించి నిర్దేశించిన పన్ను, సర్‌చార్జి, పెనాల్టీలో కనీసం 25 శాతాన్ని తొలి విడతగా నవంబర్ 30లోగా కట్టాల్సి ఉంటుంది. తదనుగుణంగానే నిధుల మూలం గురించి ప్రశ్నించకుండా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పాత రూ.500 నోట్లతో జరిపే చెల్లింపులను బ్యాంకులు స్వీకరించవచ్చునని ఐబీఏ పేర్కొంది. బ్లాక్‌మనీని వెలికితీసేందుకు ప్రభుత్వం జూన్‌లో ఐడీఎస్ను తెరపైకి తెచ్చింది. 45% పన్ను లు, పెనాల్టీలు కట్టడం ద్వారా నల్లధనాన్ని మార్చుకునేందుకు వన్ టైమ్ విండో కింద వెసులుబాటు కల్పించింది. అధికారిక గణాంకాల ప్రకారం 64,275 మంది ఐడీఎస్ కింద రూ.65,250 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు పన్నుల రూపంలో దఖలు పడనున్నారుు. నిబంధనల ప్రకారం పన్నులు, పెనాల్టీలను తొలి విడతగా నవంబర్ 30లోగా, రెండో విడతగా వచ్చే ఏడాది మార్చి 31లోగా పాతిక శాతం చొప్పున కట్టాల్సి ఉంటుంది. మిగతాది వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా చెల్లించాలి. -
నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి
న్యూఢిల్లీ: ఇతర బ్యాంకులతో ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి భాగ స్వామ్య విషయమై ఏజెన్సీ బ్యాంకులను నియంత్రించడమనే నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒకసారి పునఃపరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. ప్రభుత్వ చర్యతో కంపెనీలకు సమస్యలు ఉత్పన్నం కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐబీఏ.. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ (సీసీఏ), సీబీడీటీలకు ఒక లేఖ రాసింది. నాన్-ఏజెన్సీ బ్యాంకులు పన్ను చెల్లింపుల సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించేందుకు ఏజెన్సీ బ్యాంకుల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవడం లేదని ఐబీఏ తెలిపింది. పన్నుల సేకరణ కు ప్రభుత్వం నుంచి అనుమతి పొందినవే ఏజెన్సీ బ్యాంకులు. -
బ్యాంకు ఉద్యోగులకు ఆరోగ్య బీమా
ముంబై : అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు బ్యాంకు ఉద్యోగుల కోసం కొత్తగా ఒక ఆరోగ్య బీమా పాలసీని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నెల చివరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ద్వారా ఒక మాస్టర్ మెడిక్లెయిమ్ పాలసీని బ్యాంకు ఉద్యోగులకు అందించడానికి బీమా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లకు, ఐబీఏ మధ్య మే 25న కుదిరిన కొత్త వేతన ఒప్పందం ప్రకారం.. ఐబీఏలోని 43 సభ్యత్వ బ్యాంకులు వారి ఉద్యోగులకు ఒక ఆరోగ్య బీమా పాలసీని అందించాలి. ఉద్యోగుల ఆరోగ్య బీమా అంశంపై తాము ఐబీఏతో చర్చిస్తున్నట్లు న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్, ఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు. -
బీమా కంపెనీలతో ఐబీఏ సమావేశం
ముంబై: బడ్జెట్లో ప్రతిపాదించిన పలు కొత్త బీమా, పెన్షన్ పథకాల అమలుపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) త్వరలో బీమా కంపెనీలతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో కొత్త పథకాల ప్రారంభానికి ప్రీమియంను ఎలా సేకరించాలి, సర్టిఫికెట్లను ఎలా జారీచేయాలి, బీమా కంపెనీలకు సమాచారాన్ని ఎలా బదిలీ చేయాలి వంటి అంశాలు చర్చకు రానున్నాయని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. వీటితోపాటు క్లెయిమ్ పత్రాలను ఎవరు సేకరిస్తారు వంటి త దితర అంశాలు చర్చకు రానున్నాయన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి మూడు పథకాలపై మార్చి 3న ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హస్ముక్ అదియా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్, ఎల్ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ డెరైక్టర్ శశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు చెల్లిస్తే మాకు ఓకే!
-
మీరు చెల్లిస్తే మాకు ఓకే
రుణ మాఫీపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆర్బీఐ స్పష్టీకరణ బ్యాంకులకు ఒకేసారి నగదు చెల్లించాలి అలా చెల్లిస్తేనే రైతులకు తిరిగి రుణాలను మంజూరు చేయగలం బాండ్లు, వాయిదాల పద్ధతి కుదరదు దాని వల్ల అన్నదాతలకు రుణాలివ్వడానికి బ్యాంకుల వద్ద నగదు ఉండదని వెల్లడి ఈ మేరకు ఇద్దరు సీఎస్‌లకు లేఖలు రాసిన ఆర్బీఐ సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతనిచ్చింది. రైతులు చెల్లించాల్సిన రుణాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపంలో బ్యాంకులకు చెల్లిస్తే తమకెలాంటి అభ్యంతరంలేదని స్పష్టం చేసింది. అలా కాకుండా బాండ్లు జారీ చేస్తాం, వాయిదా పద్ధతిలో చెల్లిస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వారం రోజుల కిందట లేఖలు రాసింది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాలను పత్రికల్లో వార్తల ద్వారా తెలుసుకున్న ఆర్బీఐ ఉన్నతాధికారులు తమంతట తాముగా స్పందించారు. ఆ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ లేఖలు రాసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేసిన సమయంలో ఆ మొత్తాన్ని నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించిందని ఆ లేఖల్లో ప్రస్తావించింది. ఇప్పుడు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతులు చెల్లించాల్సిన రుణాల మొత్తాన్ని బ్యాంకులకు జమ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేసింది. అలా చెల్లిస్తేనే బ్యాంకులు తిరిగి రైతులకు రుణాలను మంజూరు చేయగలవని... వాయిదాలు, బాండ్లు అంటే రైతులకు కొత్త రుణాలు మంజూరుకు బ్యాంకుల వద్ద నగదు ఉండదని పేర్కొంది. రైతుల రుణమాఫీకి ప్రాతిపదిక అనేది లేకపోతే బ్యాంకుల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని ఆ లేఖల్లో ఆర్బీఐ పేర్కొంది. రిజర్వు బ్యాంకు తన విధానాలను ప్రకటిస్తూనే నగదు రూపంలో ఆయా ప్రభుత్వాలు బ్యాంకులకు చెల్లించేట్లయితే తమకే అభ్యంతరం లేదని స్పష్టపరచడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. రిజర్వుబ్యాంకు విధానాలు, నిబంధనలు కొత్తగా వచ్చినవి కాకపోవడం, తాము ఎన్నికల హామీ ఇచ్చేటప్పటికే ఈ విధనాలు అమల్లో ఉండటంతో ఇప్పుడు రిజర్వు బ్యాంకు వైఖరిని తప్పుపట్టే పరిస్థితి లేదు. ఆర్బీఐ చెబుతున్నట్టుగా నగదు చెల్లించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించాలని స్పష్టమవడంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే, ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోవాలని మంగళవారం కోటయ్య కమిటీ, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు. రిజర్వు బ్యాంకుతో సంబంధం లేకుండానే అమలుచేస్తాం: యనమల రిజర్వుబ్యాంకుతో సంబంధం లేకుండా తాము హామీ ఇచ్చిన రైతు రుణాల మాఫీని అమలు చేస్తామని, లక్ష కోట్లయినా వెనుకాడబోమని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంచేశారు. బ్యాంకింగ్రంగం రైతు రుణాల మాఫీకి ఎప్పుడూ అనుకూలం కాదని, అంతమాత్రాన తాము ప్రజలకోసం ఇచ్చిన హామీని అమలుచేయకుండా ఉండలేమని చెప్పారు. ఆయన మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో మీడియాతో మాట్లాడు తూ... బ్యాంకులు పటిష్టంగా ఉండాలని రిజర్వుబ్యాంకు కోరుకుం టుం దని, ప్రజలు పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి జమచేస్తున్నప్పుడు మాఫీకి బ్యాంకులకు అభ్యంతరమెందుకు? వాటికి నష్టమేమిటి? అని ప్రశ్నించారు. అయితే నిపుణుల కమిటీ సిఫార్సులు వచ్చాక... బ్యాంకులకు ఎన్ని దఫాల్లో చెల్లించాలన్న దానిపై విధానాలు రూపొందిస్తామన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వేలకోట్లు రుణమాఫీలు చేసే బ్యాంకులు దేశంలో 70 శాతం మంది జనాభాగా ఉన్న రైతుల విషయంలో వీలుపడదంటూ అభ్యంతరాలు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. బ్యాంకుల తీరు ఎలా ఉన్నా, తాము రైతులను ఆదుకొనేందుకు లక్ష కోట్లయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆగస్టులో ఆర్థిక, ప్రణాళికా సంఘం ప్రతినిధులు: ఆగస్టులో రాష్ట్రానికి ఆర్థిక, ప్రణాళికాసంఘం ప్రతినిధులు రానున్నారని యనమల తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను అధ్యయ నం చేసి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ మేరకు విభజన చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. దీనిపై తాము ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో మాట్లాడామని, ఆగస్టులో వస్తామని వారు చెప్పారని తెలిపారు. -
10, 11 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నారు. వేతన సవరణపై బ్యాంక్ యూనియన్లు, యాజమాన్యం ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే దీనికి కారణం. యూనియన్లు- ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో సమస్యపై తగిన పరిష్కారం కనుగొనలేకపోవడంతో సమ్మె అనివార్యం అయినట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆఫర్, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదని బ్యాంక్ ఉద్యోగుల జాతీయ సంఘం(ఎన్‌ఓబీడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అశ్వనీ రాణా అన్నారు. డిసెంబర్ 14న వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావడంతో అదేనెల 18వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. 2012 నవంబర్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉంది. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ, అధికారుల యూనియన్లకు యూఎఫ్‌బీయూ నేతృత్వం వహిస్తోంది. దేశంలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
భద్రతకు మరో రూ. 4వేల కోట్ల వ్యయం
ముంబై: ఏటీఎంల వద్ద భద్రతను పెంచితే బ్యాంకులకు నెలకు రూ.4,000 కోట్లు అదనంగా ఖర్చవువుతుందని ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్(ఐబీఏ) అంచనా వేసింది. బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి ఘటన కారణంగా ఏటీఎంల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒక్కో ఏటీఎంకు భద్రత అవసరాల పెంపు కోసం నెలకు అదనంగా రూ.40,000 ఖర్చవుతుందని ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎం.వి. టంకసలే సోమవారం తెలిపారు. భద్రత పెంచాల్సిన ఏటీఎంలు లక్ష వరకూ ఉంటాయని, వీటిపై బ్యాంకులు నెలకు రూ.4,000 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని వివరించారు. ఈ భారాన్ని తట్టుకోవడానికి బ్యాంకులు యూజర్ చార్జీలను పెంచక తప్పదని నిపుణులంటున్నారు. ఇప్పటికే 1.4 లక్షల ఏటీఎంలకు తగినంత భద్రత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.15గా ఉన్న ఇంటర్ బ్యాంక్ ఫీజును రూ.18కు పెంచాలని, ప్రతి లావాదేవీపై చార్జీల విధింపుకు అనుమతించాలని ఆర్బీఐను కోరతామని టంకసలే చెప్పారు. -
వచ్చే నెల నుంచి కొన్ని ఏటిఎంల పాక్షిక మూసివేత
ముంబై: భద్రతా కారణాల రీత్యా దేశంలోని కొన్ని ఏటిఎంలను రాత్రి పూట పాక్షికంగా మూసివేయడానికి బ్యాంకులు సిద్ధపడ్డాయి. ఇటీవల జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఏ)సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏటిఎంలకు తగిన భద్రత కల్పించలేమని బ్యాంకులు తెలిపాయి. దాంతో వచ్చే నెల నుంచి వినియోగదారులు తక్కువగా ఉపయోగించే కొన్ని ఏటిఎంలను రాత్రి పూట మాత్రమే మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐబిఏ రిజర్వు బ్యాంకుకు లేఖ రాసింది. బెంగళూరులోని ఏటిఎంలో ఒక మహిళపై దాడి జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఐబిఏ ఈ సమావేశం నిర్వహించింది. వినియోగం తక్కువగా ఉన్న ఏటిఎంలకు భద్రత కల్పించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా బ్యాంకులు భావిస్తున్నాయి. అందువల్ల కొన్ని ఏటిఎంలను రాత్రి పూట మూసివేయాలనుకుంటున్నారు. అటువంటి ఏటిఎంలను గుర్తించాలని నిర్ణయించారు. ఏటిఎంల విషయంలో వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని చర్చించారు. సిసిటివిల ద్వారా పర్యవేక్షించాలని కొందరు సలహా ఇచ్చారు. ఒకేచోట రెండు మూడు బ్యాంకుల ఏటిఎంలు ఎన్నట్లయితే ఆ బ్యాంకులు ఉమ్మడిగా ఒక గార్డును నియమించే విషయం కూడా చర్చించారు. ఏటిఎంల భద్రత, నిర్వహణ, గార్డుల నియామకం, పాక్షిక మూసివేతలకు సంబంధించి బ్యాంకులకు తాము కొన్ని సూచనలు చేశామని, వాటిని రిజర్వు బ్యాంకు కూడా అంగీకరించవలసి ఉందని ఐబిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎంవి టంక్సాలే చెప్పారు. బ్యాంకులు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. ఏటిఎంల వద్ద నేరాలను నిరోధించడానికి గార్డులు తప్పనిసరి అని మరో అధికారి చెప్పారు.