నగరంలో ‘పేమెంట్‌’  డేటా సెంటర్‌  | NPCI To Build Data Centre In Hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో ‘పేమెంట్‌’  డేటా సెంటర్‌ 

Published Fri, Jul 3 2020 3:53 AM | Last Updated on Fri, Jul 3 2020 6:19 AM

NPCI To Build Data Centre In Hyderabad  - Sakshi

ఎన్‌పీసీఐ నిర్మించనున్న స్మార్ట్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌రంజన్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) హైదరాబాద్‌ నగరంలో స్మార్ట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పేమెంట్‌ యాప్స్, కార్డులు ఇతరత్రా నగదురహిత లావాదేవీలను నిర్వ హించడం, వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ), ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేశాయి. రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎన్‌పీసీఐ నిర్మించనున్న స్మార్ట్‌ డేటా సెంటర్‌కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం శంకుస్థాపన చేశారు.

అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ఎన్‌పీసీఐ నిర్మి స్తోంది. ఈ డేటా సెంటర్‌ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద డిజిటల్‌/ ఆన్‌లైన్‌ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్‌ ఆవిర్భ స్తుంది. భౌగోళికంగా, మానవవనరుల పరం గా, శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరానికి ఉన్న అనుకూలతలు నగరాన్ని ఎంచు కోవడానికి దోహదపడ్డాయి. భూకంపం, తుపాన్ల వంటి ప్రకతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ డేటా సెంటర్‌ను నిర్మించను న్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థకు ఈ డేటా సెంటర్‌ నిర్మాణ పనులను అప్పగించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యక్యాదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement