బ్యాంకు సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి! | NPCI disconnects retail payment services offered by C-Edge Tech after ransomware attack | Sakshi
Sakshi News home page

Ransomware: బ్యాంకు సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

Published Thu, Aug 1 2024 11:34 AM | Last Updated on Thu, Aug 1 2024 11:50 AM

NPCI disconnects retail payment services offered by C-Edge Tech after ransomware attack

దేశీయ బ్యాంకింగ్‌ సేవలందించే టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. ఈమేరకు దాడి జరిగిన సర్వర్‌ను డిస్‌కనెక్ట్‌ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఆర్‌బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.

ఎన్‌పీసీఐ విడుదల చేసిన పబ్లిక్‌ అడ్వైజరీ ప్రకారం..సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ అనే ముంబయికి చెందిన సంస్థ ప్రాంతీయ, కోఆపరేటివ్‌, గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలందిస్తోంది. ఈ కంపెనీ టీసీఎస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు రోజుల కిందట ఈ సంస్థ సర్వీసులపై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. తదుపరి చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకుండా వెంటనే గుర్తించి రిటైల్‌ పేమెంట్‌ సిస్టమ్‌తో డిస్‌కనెక్ట్‌ చేశారు. దాంతో కొంతమంది వినియోగదారులు చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీ-ఎడ్జ్‌ టెక్నాలజీ అందిస్తున్న సర్వర్‌తో అనుసంధానం చేసిన యూపీఐ, ఐఎంపీఎస్‌, ఎన్‌పీసీఐ చెల్లింపులు సేవలను కొంత సమయంపాటు యాక్సెస్‌ చేయలేరు. ఇప్పటికే బ్యాంకింగ్‌ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.

ఇదీ చదవండి: కాల్‌ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement