Ransomware attack
-
బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!
దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ఈమేరకు దాడి జరిగిన సర్వర్‌ను డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఆర్బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.ఎన్పీసీఐ విడుదల చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం..సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ అనే ముంబయికి చెందిన సంస్థ ప్రాంతీయ, కోఆపరేటివ్, గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలందిస్తోంది. ఈ కంపెనీ టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు రోజుల కిందట ఈ సంస్థ సర్వీసులపై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. తదుపరి చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకుండా వెంటనే గుర్తించి రిటైల్ పేమెంట్ సిస్టమ్‌తో డిస్కనెక్ట్ చేశారు. దాంతో కొంతమంది వినియోగదారులు చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీ-ఎడ్జ్ టెక్నాలజీ అందిస్తున్న సర్వర్‌తో అనుసంధానం చేసిన యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్పీసీఐ చెల్లింపులు సేవలను కొంత సమయంపాటు యాక్సెస్ చేయలేరు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!Regarding interruption in retail payments pic.twitter.com/Ve32ac7WpQ— NPCI (@NPCI_NPCI) July 31, 2024 -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్‌కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్‌కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్‌కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్‌లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్‌లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్‌లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్‌ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్‌లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్
రోజు రోజుకి హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ ముసగువీరుల దాటికి సాదారణ వ్యక్తులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యాకర్లకు భారీ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇటీవలు కలోనియల్ పైప్‌లైన్ కంప్యూటర్లను హ్యాక్ చేసి సుమారు 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హ్యాకర్లు, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం పంపిణీదారు అయిన జెబిఎస్‌పై సైబర్ దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా వ్యాపార లావాదేవీలు స్తంభించడంతో కంపెనీ వ్యాపారం బాగా దెబ్బతింది. జెబిఎస్ యుఎస్ఎ హోల్డింగ్స్ ఇంక్. సైబర్ క్రైమినల్స్ కు 11 మిలియన్ డాలర్ల(రూ. 80 కోట్ల) చెల్లించినట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రీ నౌగెరా వెల్లడించారు. జెబిఎస్ కంపెనీ అమెరికా దేశ మాంసం సరఫరాలో ఐదవ వంతును ఈ సంస్థే సరఫరా చేస్తుంది. జెబిఎస్‌పై ఆధారపడే రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, రైతులకు మరింత నష్టం కలగ కుండ ఉండటానికి నగదు చెల్లించాల్సి వచ్చినట్లు బ్రెజిల్ మాంసం సంస్థ జెబిఎస్ యుఎస్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రీ నోగుఇరా చెప్పారు. "నేరస్థులకు డబ్బు చెల్లించడం చాలా బాధాకరం, కాని మేము మా కస్టమర్ల కోసం సరైన పని చేసాము" అని నోగ్యురా బుధవారం ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మెజారిటీ జెబిఎస్ ప్లాంట్లు తిరిగి పనిచేస్తున్న తర్వాత ఈ చెల్లింపులు చేసినట్లు ఆయన అన్నారు. ఆస్ట్రేలియా నుంచి దక్షిణ అమెరికా, ఐరోపాకు గొడ్డు మాంసం, పౌల్ట్రీ, పంది మాంసం ప్రాసెస్ చేసి విక్రయించడంలో జెబిఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం సంస్థ. యుఎస్‌లో ఈ సంస్థ అతిపెద్ద గొడ్డు మాంసం సరఫరా దారుగా ఉంది. అమెరికాలో జెబిఎస్ కంపెనీకి తొమ్మిది గొడ్డుమాంసం ప్రాసెస్ చేసే కర్మాగారాలు ఉన్నాయి. వీటిపై గత వారం రాన్సమ్వేర్ ముఠా ఒకటి సైబర్ దాడి చేసింది. దీంతో ఆయా కర్మాగారాల్లో ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ముఠాతో కూడా రష్యాకు సంబంధాలు ఉండొచ్చని ఎఫ్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాను ‘రెవిల్’ లేదా ‘సోడినోకిబి’ అంటారు. చదవండి: ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల -
రాజధానిలో ర్యాన్సమ్వేర్ దాడి!
మూడు సంస్థల కంప్యూటర్లు లాక్ - 23 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ - చెల్లించకపోవడంతో డేటా మొత్తం క్రాష్ - దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికించిన ర్యాన్సమ్వేర్ వైరస్ ప్రభావం రాజధానిపైనా పడింది. జూబ్లీహిల్స్ కేంద్రంగా పనిచేసే మూడు సంస్థల్ని టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. హ్యాకర్స్ డిమాండ్ చేసిన 23వేల డాలర్లు (సుమారు రూ.16.13 లక్షలు) చెల్లించకపోవడంతో మూడు సంస్థలకు చెందిన డేటామొత్తాన్నీ క్రాష్ చేశారు. దీనిపై సోమవారం ఫిర్యాదు అందుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ–మెయిల్స్ ద్వారా వైరస్! మోర్ వీసాస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓప్లెంటస్ ఓవర్సీస్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు జూబ్లీహిల్స్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలూ విదేశీ ఉద్యోగాలకు వెళ్లేవారికి వీసాలు ఇప్పించడంతో పాటు ఇమిగ్రేషన్ సంబంధిత వ్యవహారాల సేవలు అందిస్తున్నాయి. వీటికి అనుబంధ సంస్థయిన చెవ్రోన్నే సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్స్ అభివృద్ధి, ఈఆర్పీ, ఈ–బిజినెస్‌లకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కాగా, శుక్రవారం ఈ సంస్థల సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ర్యాన్సమ్వేర్ ఎటాక్ జరిగింది. ర్యాన్సమ్వేర్ వైరస్‌లను హ్యాకర్లు ఈ–మెయిల్ రూపంలో పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వైరస్ కంప్యూటర్లలోకి ప్రవేశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ అయ్యి సిస్టమ్స్, సర్వర్ లాక్ అయిపోయాయి. అపరిచిత మెయిల్స్‌తో జాగ్రత్త... ‘వాన్నాక్రై’వైరస్ ప్రకంపనల నేపథ్యంలో నగరంలోని సంస్థల పైనా ర్యాన్సమ్వేర్ దాడులు జరగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దాడి ఎక్కడ నుంచి జరిగింది? సైబర్ నేరగాళ్లు ఏ విధానంలో డబ్బు చెల్లించిమని చెప్పారు? తదితర అంశాలను సైబర్ కాప్స్ ఆరా తీస్తున్నారు. పటిష్టమైన వ్యవస్థ లేకుంటే ర్యాన్సమ్వేర్ సమస్యకు పరిష్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయరని, దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరహాలో నేరాలు చేసేవాళ్లు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్‌లు వినియోగిస్తారని, దీంతో అలాంటి వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. గంటలోనే డేటా అంతా తుడిచేశారు డేటా ఎన్క్రిప్షన్ నాన్–సెమెట్రిక్ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్ కీ’ని ట్రాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. సైబర్ నేరగాళ్లు ఈ మూడు సంస్థల ఎన్క్రిప్టెడ్ డేటాను డీక్రిప్ట్ చేయడానికి 25వేల డాలర్లు డిమాండ్ చేశారు. ఓ సంస్థ నుంచి 9 వేల డాలర్లు, మిగిలిన రెండింటినీ 6 వేల డాలర్ల చొప్పున చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. దీనికి ఆయా సంస్థల యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో గంటలోనే కంప్యూటర్లలో డేటాను హ్యాకర్లు క్రాష్ చేసేశారు. ప్రస్తుతం డేటా రిట్రీవ్ చేసే స్థి«తిలో కూడా లేకుండా పోయింది. సంస్థల ప్రతినిధులు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.