రోజు రోజుకి హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ ముసగువీరుల దాటికి సాదారణ వ్యక్తులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యాకర్లకు భారీ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇటీవలు కలోనియల్ పైప్‌లైన్ కంప్యూటర్లను హ్యాక్ చేసి సుమారు 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హ్యాకర్లు, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం పంపిణీదారు అయిన జెబిఎస్‌పై సైబర్ దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా వ్యాపార లావాదేవీలు స్తంభించడంతో కంపెనీ వ్యాపారం బాగా దెబ్బతింది.
జెబిఎస్ యుఎస్ఎ హోల్డింగ్స్ ఇంక్. సైబర్ క్రైమినల్స్ కు 11 మిలియన్ డాలర్ల(రూ. 80 కోట్ల) చెల్లించినట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రీ నౌగెరా వెల్లడించారు. జెబిఎస్ కంపెనీ అమెరికా దేశ మాంసం సరఫరాలో ఐదవ వంతును ఈ సంస్థే సరఫరా చేస్తుంది. జెబిఎస్‌పై ఆధారపడే రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, రైతులకు మరింత నష్టం కలగ కుండ ఉండటానికి నగదు చెల్లించాల్సి వచ్చినట్లు బ్రెజిల్ మాంసం సంస్థ జెబిఎస్ యుఎస్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రీ నోగుఇరా చెప్పారు. "నేరస్థులకు డబ్బు చెల్లించడం చాలా బాధాకరం, కాని మేము మా కస్టమర్ల కోసం సరైన పని చేసాము" అని నోగ్యురా బుధవారం ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మెజారిటీ జెబిఎస్ ప్లాంట్లు తిరిగి పనిచేస్తున్న తర్వాత ఈ చెల్లింపులు చేసినట్లు ఆయన అన్నారు.
ఆస్ట్రేలియా నుంచి దక్షిణ అమెరికా, ఐరోపాకు గొడ్డు మాంసం, పౌల్ట్రీ, పంది మాంసం ప్రాసెస్ చేసి విక్రయించడంలో జెబిఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం సంస్థ. యుఎస్‌లో ఈ సంస్థ అతిపెద్ద గొడ్డు మాంసం సరఫరా దారుగా ఉంది. అమెరికాలో జెబిఎస్ కంపెనీకి తొమ్మిది గొడ్డుమాంసం ప్రాసెస్ చేసే కర్మాగారాలు ఉన్నాయి. వీటిపై గత వారం రాన్సమ్‌వేర్ ముఠా ఒకటి సైబర్ దాడి చేసింది. దీంతో ఆయా కర్మాగారాల్లో ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ముఠాతో కూడా రష్యాకు సంబంధాలు ఉండొచ్చని ఎఫ్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాను ‘రెవిల్’ లేదా ‘సోడినోకిబి’ అంటారు.
చదవండి: ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment