రాజధానిలో ర్యాన్సమ్‌వేర్‌ దాడి! | Ransomware attack in the capital city | Sakshi
Sakshi News home page

రాజధానిలో ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

Published Tue, May 23 2017 3:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

రాజధానిలో ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

రాజధానిలో ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

మూడు సంస్థల కంప్యూటర్లు లాక్‌
- 23 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్‌
- చెల్లించకపోవడంతో డేటా మొత్తం క్రాష్‌
- దర్యాప్తు చేస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు


సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికించిన ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ ప్రభావం రాజధానిపైనా పడింది. జూబ్లీహిల్స్‌ కేంద్రంగా పనిచేసే మూడు సంస్థల్ని టార్గెట్‌గా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. హ్యాకర్స్‌ డిమాండ్‌ చేసిన 23వేల డాలర్లు (సుమారు రూ.16.13 లక్షలు) చెల్లించకపోవడంతో మూడు సంస్థలకు చెందిన డేటామొత్తాన్నీ క్రాష్‌ చేశారు. దీనిపై సోమవారం ఫిర్యాదు అందుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ–మెయిల్స్‌ ద్వారా వైరస్‌!
మోర్‌ వీసాస్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఓప్లెంటస్‌ ఓవర్సీస్‌ గ్రీన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు జూబ్లీహిల్స్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలూ విదేశీ ఉద్యోగాలకు వెళ్లేవారికి వీసాలు ఇప్పించడంతో పాటు ఇమిగ్రేషన్‌ సంబంధిత వ్యవహారాల సేవలు అందిస్తున్నాయి. వీటికి అనుబంధ సంస్థయిన చెవ్రోన్నే సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సాఫ్ట్‌వేర్స్‌ అభివృద్ధి, ఈఆర్పీ, ఈ–బిజినెస్‌లకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కాగా, శుక్రవారం ఈ సంస్థల సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ర్యాన్సమ్‌వేర్‌ ఎటాక్‌ జరిగింది. ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌లను హ్యాకర్లు ఈ–మెయిల్‌ రూపంలో పంపినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వైరస్‌ కంప్యూటర్లలోకి ప్రవేశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్‌ అయ్యి సిస్టమ్స్, సర్వర్‌ లాక్‌ అయిపోయాయి.

అపరిచిత మెయిల్స్‌తో జాగ్రత్త...
‘వాన్నాక్రై’వైరస్‌ ప్రకంపనల నేపథ్యంలో నగరంలోని సంస్థల పైనా ర్యాన్సమ్‌వేర్‌ దాడులు జరగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దాడి ఎక్కడ నుంచి జరిగింది? సైబర్‌ నేరగాళ్లు ఏ విధానంలో డబ్బు చెల్లించిమని చెప్పారు? తదితర అంశాలను సైబర్‌ కాప్స్‌ ఆరా తీస్తున్నారు. పటిష్టమైన వ్యవస్థ లేకుంటే ర్యాన్సమ్‌వేర్‌ సమస్యకు పరిష్కారం లేదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్‌ కీ ఏర్పాటు చేయరని, దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరహాలో నేరాలు చేసేవాళ్లు బోగస్‌ సర్వర్లు, ఐపీ అడ్రస్‌లు వినియోగిస్తారని, దీంతో అలాంటి వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉండటం, కంప్యూటర్‌లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు.

గంటలోనే డేటా అంతా తుడిచేశారు
డేటా ఎన్‌క్రిప్షన్‌ నాన్‌–సెమెట్రిక్‌ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్‌ కీ’ని ట్రాక్‌ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. సైబర్‌ నేరగాళ్లు ఈ మూడు సంస్థల ఎన్‌క్రిప్టెడ్‌ డేటాను డీక్రిప్ట్‌ చేయడానికి 25వేల డాలర్లు డిమాండ్‌ చేశారు. ఓ సంస్థ నుంచి 9 వేల డాలర్లు, మిగిలిన రెండింటినీ 6 వేల డాలర్ల చొప్పున చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. దీనికి ఆయా సంస్థల యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో గంటలోనే కంప్యూటర్లలో డేటాను హ్యాకర్లు క్రాష్‌ చేసేశారు. ప్రస్తుతం డేటా రిట్రీవ్‌ చేసే స్థి«తిలో కూడా లేకుండా పోయింది. సంస్థల ప్రతినిధులు సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement