న్యూయార్క్: ‘ఎటర్నల్ రాక్స్’ అనే కొత్త కంప్యూటర్ వైరస్‌ను పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇది కూడా వాన్నా క్రై లాగానే విండోస్ సిస్టమ్స్‌పైనే దాడి చేస్తుందని తెలిపారు. వాన్నాక్రై విండోస్ సిస్టమ్స్‌పై దాడి చేసేందుకు ఆయా కంప్యూటర్లలోని ఏయే కాన్ఫిగరేషన్స్ కారణమయ్యాయో, అలాంటి కాన్ఫిగరేషన్స్ ఉన్న కంప్యూటర్లనే ఎటర్నల్ రాక్స్ కూడా లక్ష్యంగా చేసుకుంటుందని వారు చెప్పారు.
వాన్నా క్రై కన్నా ఈ వైరస్ మరింత బలమైనదనీ, దీనిని ఎదుర్కోవడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. వాన్నా క్రై లాగానే ఎటర్నల్ రాక్స్ కూడా ఇతర కంప్యూటర్లకు వ్యాప్తి చెందడానికి ఎటర్నరల్ బ్లూ అనే ఎన్‌ఎస్‌ఏ టూల్‌నే ఉపయోగించుకుంటుందనీ, ఆరు ఇతర ఎన్‌ఎస్‌ఏ టూల్స్‌ని కూడా వాడుకుంటుందని పరిశోధకులు వివరించారు.