Rural Bank
-
ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ
హానికర సాఫ్ట్వేర్ (ర్యాన్సమ్వేర్) దాడికి గురైన సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ సర్వీసులను తిరిగి పునరుద్ధరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 300 సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు ఉపశమనం లభించింది.ఎన్పీసీఐ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఇటీవల ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. దాంతో వెంటనే స్పందించి దాడి జరిగిన సర్వర్‌ను డిస్కనెక్ట్ చేశారు. తిరిగి సర్వీస్ ప్రొవైడర్ సేవలను తాజాగా పునరుద్ధరించారు. వినియోగదార్లు ఏటీఎంల నుంచి నగదు స్వీకరణ, యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్లకు నిధుల బదలాయింపు, ఏటీఎంల వద్ద నగదు స్వీకరణ, యూపీఐ చెల్లింపు సేవల కోసం బ్యాంకులు సీ-ఎడ్జ్‌పై ఆధారపడ్డాయి. సీ-ఎడ్జ్ హానికర సాఫ్ట్వేర్ దాడికి గురికావడంతో లావాదేవీల విషయంలో కొన్ని సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వినియోగదార్లు సోమవారం నుంచి అంతరాయం ఎదుర్కొన్నారు. సీ-ఎడ్జ్‌లో ర్యాన్సమ్వేర్ విస్తరణకు అవకాశం ఉండడంతో పేమెంట్ సిస్టమ్‌లను వేరు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ దాడి కేవలం టెక్నాలజీ సిస్టమ్‌లకే పరిమితమైందని, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సొంత మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!
దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ఈమేరకు దాడి జరిగిన సర్వర్‌ను డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఆర్బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.ఎన్పీసీఐ విడుదల చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం..సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ అనే ముంబయికి చెందిన సంస్థ ప్రాంతీయ, కోఆపరేటివ్, గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలందిస్తోంది. ఈ కంపెనీ టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు రోజుల కిందట ఈ సంస్థ సర్వీసులపై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. తదుపరి చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకుండా వెంటనే గుర్తించి రిటైల్ పేమెంట్ సిస్టమ్‌తో డిస్కనెక్ట్ చేశారు. దాంతో కొంతమంది వినియోగదారులు చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీ-ఎడ్జ్ టెక్నాలజీ అందిస్తున్న సర్వర్‌తో అనుసంధానం చేసిన యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్పీసీఐ చెల్లింపులు సేవలను కొంత సమయంపాటు యాక్సెస్ చేయలేరు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!Regarding interruption in retail payments pic.twitter.com/Ve32ac7WpQ— NPCI (@NPCI_NPCI) July 31, 2024 -
గ్రామీణ బ్యాంకులపై ప్రై‘వేటు’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా 3–4 నెలల్లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించనున్నామని.. దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్ ఉత్తర్వులను కూడా జారీచేయడం గమనార్హం. అయితే, ఈ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలతో గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నీరుగారడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు, చేతివృత్తులు, దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు బ్యాంక్ సేవ లు అందించడమే లక్ష్యంగా గ్రామీణ బ్యాంక్‌లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ (ఏపీజీవీబీ), తెలంగాణ (టీజీబీ), ఆంధ్ర ప్రగతి (ఏపీజీబీ), చైతన్య గోదావరి (సీజీజీబీ), సప్తగిరి (ఎస్జీబీ) గ్రామీణ బ్యాంక్‌లున్నాయి. వీటికి 2,160 బ్రాంచీలున్నాయి.ఇందులో తెలంగాణలో 960 శాఖలు, మిగిలినవి ఏపీలో ఉంటాయి. ఏపీజీవీబీ, టీజీబీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఏపీజీబీకి సిండికేట్ బ్యాంక్, సీజీజీబీకి ఆంధ్రా బ్యాంక్, ఎస్‌జీబీకి ఇండియన్ బ్యాంక్‌లు స్పాన్సర్ బ్యాంక్‌లుగా ఉన్నాయి. గ్రామీణ బ్యాం కుల్లో కేంద్రం 50%, స్పాన్సర్ బ్యాంక్‌లు 35%, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 15% వాటాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల వాటా గోవిందా.. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికీ బ్యాంకింగ్ సేవలందాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరిట నీరుగారుస్తుందని తెలంగాణ రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఆర్‌బీఈఏ) జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. 49% వరకు వాటాను ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ చట్ట సవరణ కూడా చేశారు. పైగా వాటా విక్రయం తర్వాత కేంద్రం, స్పాన్సర్ బ్యాంక్‌ల వాటా 51%కి తగ్గకూడదనే నిబంధనను పెట్టారు. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న 15% వాటా చేజారుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఏకైక వాణిజ్య బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంక్‌లే. ఈ ప్రైవేటీకరణతో రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందని బ్యాంకింగ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రుణ, పొదుపు నిష్పత్తి ఇక్కడే సమానం.. ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల్లో 8,600 మంది ఉద్యోగులున్నారు. వీళ్లే కాకుండా 2,400 దినసరి కూలీలు పనిచేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంక్‌ల్లో 1.1 కోట్ల మంది ఖాతాదారులుంటారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా గ్రామీణ బ్యాంక్‌ల రుణ, పొదుపు నిష్పత్తి దక్షిణాది రాష్ట్రాల్లో సరిసమానంగా, ఉత్తరాదిలో 40–45% వరకు ఉంటుందని వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డిపాజిట్లు, రుణం సమానంగానే ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో రూ.33 వేల కోట్ల డిపాజిట్లుంటే రుణాలు రూ.33–34 వేల కోట్లుగా ఉన్నట్లు వివరించారు. ఏపీజీవీబీ ఐపీఓ బాటలో ఎస్బీఐ... లాభాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేసేందుకు సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కేరళ గ్రామీణ బ్యాంక్‌లో ముత్తూట్ ఫైనాన్స్ కొంత వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) ఐపీఓ ద్వారా సుమారు రూ.800 కోట్ల సమీకరించేందుకు ఎస్బీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటాలను బట్టి బోర్డు మెంబర్లు: ప్రస్తుతం గ్రామీణ బ్యాంక్‌ల్లో 9 మంది చొప్పున బోర్డ్ మెంబర్లు ఉన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి, స్పాన్సర్ బ్యాంక్‌ల నుంచి ముగ్గురు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నాబార్డ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. అయితే నిధుల సమీకరణలో 10 శాతం వాటాను కొనుగోలు చేసిన ప్రైవేటు కంపెనీలకు నుంచి బోర్డ్ మెంబర్లలో ఒకరికి, 10–25 శాతం వరకు కొనుగోలు చేస్తే ఇద్దరు, 25 శాతం పైనైతే ముగ్గురు సభ్యులు బోర్డ్ మెంబర్లలో చేరే వీలు కల్పించారు. లాభాల్లోనే 50 బ్యాంక్‌లు.. దేశంలో ఉన్న మొత్తం 56 గ్రామీణ బ్యాంక్‌లకు గాను 50 బ్యాంక్‌లు లాభాల్లోనే ఉన్నాయి. కశ్మీర్‌లోని ఇలాఖీ దెహతీ (ఈడీ), నాగాలాండ్, మణిపూర్ గ్రామీణ బ్యాంక్‌లు, బెంగాల్‌లోని భంగియ గ్రామీణ వికాస్ (బీజీవీబీ), మధ్యప్రదేశ్‌లోని మధ్యాంచల్ గ్రామీణ బ్యాంక్, ఒడిశాలోని ఉత్కల్ గ్రామీణ బ్యాంక్‌లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. 50 బ్యాంక్‌లు కలిపి రూ.4,096 కోట్ల స్థూల లాభాలు చూపించాయి. రూ.2,573 కోట్ల నికర లాభాలను ఆర్జించాయి. వివిధ పన్నుల రూపంలో రూ.1,414 కోట్లు చెల్లించాయి. దేశంలో గ్రామీణ బ్యాంక్‌ల ముఖ చిత్రమిది మొత్తం బ్యాంక్‌లు : 56 బ్రాంచీలు : 21,398 ఖాతాలు : 23 కోట్లు డిపాజిట్లు : రూ.3.72లక్షల కోట్లు రుణాలు : 2.28 లక్షల కోట్లు రిజర్వ్ నిధులు : రూ.23 వేల కోట్లు నికర ఎన్పీఏ : 4.41 శాతం మొత్తం ఉద్యోగులు : 86,555 -
గ్రామీణ బ్యాంకుల బంద్ నేడు
దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నేడు (శుక్రవారం) బంద్ కానున్నాయి. రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. అన్ని స్థాయిలకు చెందిన 91,000 మంది శాశ్వత, 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో మూకుమ్మడిగా పాల్గొంటున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేస్తున్న బ్యాంకులకు సమానంగా పే స్కేలు, ప్రమోషన్, రిక్రూట్మెంట్ రూల్సు, పెన్షన్లు ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టాల్నది వీరి ప్రధాన డిమాండ్. దేశవ్యాప్తంగా 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. 22,000 పైచిలుకు శాఖలను నిర్వహిస్తున్నాయి. ఏటా ఇవి రూ.6 లక్షల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. స్పాన్సర్ బ్యాంకుల ఉద్యోగులకు సమానంగా పే స్కేలు, విధులు ఉండాలన్న నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ 1990లో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణకై జూలై 10న ఢిల్లీలో సమావేశం అవుతున్నట్టు తెలిపారు. -
నేడు, రేపు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
♦ దేశవ్యాప్తంగా 20 వేల బ్రాంచీల్లో ♦ నిలిచిపోనున్న కార్యకలాపాలు.. హైదరాబాద్: గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నారు. తదనంతరం రెండు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో వరుసగా నాలుగు రోజులు గ్రామీణ బ్యాంకులు పనిచేయని పరిస్థితి నెలకొంది. గ్రామీణ బ్యాంకుల ఏడు ఉద్యోగ సం ఘాల జాతీయ స్థాయి ఐక్య వేదిక- యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్.ఆర్.బి యూనియన్స్ (యూఎఫ్ఆర్ఆర్బీయూ) పిలుపు మేరకు దేశంలోని 56 గ్రామీణ బ్యాంకుల్లోని ఉద్యోగులు, అధికారులు 10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొననున్నారు. దీనితో 20 వేలకు పైగా శాఖలు రెండు రోజులు మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8 జిల్లాల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ బ్యాంకుల ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. గ్రామీణ బ్యాంకులు, ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షతకు నిరసనగా ఈ సమ్మె చేస్తున్నట్లు తెలిపాయి. 10వ వేతన సవరణలోని అన్ని ఇతర అలవెన్సులు కమర్షియల్ బ్యాంకుల్లో అమలు చేసి 10 నెలలు గడుస్తున్నా... ఆయా ప్రయోజనాలను గ్రామీణ బ్యాంకులకు ఇంకా వర్తింపజేయలేదు. కమర్షియల్ బ్యాంకు ఉద్యోగులతో సమానంగా పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని సైతం గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
బ్యాంకులకు మస్కా
దాసకుప్పం ఎస్పీజీబీలో రూ.2.5 కోట్లను మింగేసిన మేనేజర్ వరదయ్యపాళెం ఎస్బీఐలోరూ.1.88 కోట్లను కొల్లగొట్టిన డెప్యూటీ మేనేజర్ ఇంటర్నల్ ఆడిట్లో లొసుగులే కారణమా ? సాక్షి ప్రతినిధి, తిరుపతి : మొన్న సత్యవేడు మండలం దాసకుప్పంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు (ఎస్పీజీబీ)లో స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు రుణాలు ఇచ్చినట్లు చూపి రూ.2.5 కోట్లను బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు కాజేశారు. నిన్న వరదయ్యపాళెం మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డెప్యూటీ మేనేజర్ మహేంద్ర రూ.1.88 కోట్లను మింగేశారు. ఈ రెండు ఉదంతాలు బ్యాంకింగ్ వ్యవస్థలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. బ్యాంకులపై విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోజువారీ ఆడిట్.. ఆర్నెల్లకు ఓ సారి ఇంటర్నల్ ఆడిట్లు పక్కాగా చేసి ఉంటే ఈ అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసే అవకాశం ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం.. మింగిన సొమ్మును కక్కించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఏ రోజుకారోజు ఏ మేరకు రుణం ఇచ్చాం.. ఏ మేరకు డిపాజిట్లు వచ్చాయి.. ఎంత సొమ్మును వసూలు చేశారు అన్న లెక్కలు ప్రతి బ్యాంకులోనూ సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేస్తారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్‌లోనూ ఆర్నెల్లకు ఓ సారి ఇంటర్నల్ ఆడిట్ బృందం లెక్కలను తనిఖీ చేస్తుంది. నిరర్ధక ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, వసూళ్లు లాభాలు వంటి అంశాలను ఆడిట్ నివేదికలో పొందుపరుస్తారు. ఆ నివేదిక ఆధారంగా బ్యాంకుల యాజమాన్యం చర్యలు తీసుకుంటాయి. రోజు వారీ ఆడిట్.. ఇంటర్నల్ ఆడిట్ వ్యవస్థతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతంగా ఉంది. దాసకుప్పం ఎస్పీజీబీ, వరదయ్యపాళెం ఎస్బీఐలో చోటుచేసుకున్న ఉదంతాలు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా డొల్లతనం ఉందని ఎత్తి చూపాయి. ఆడిట్లో లోపాల వల్లే.. దాసకుప్పం ఎస్పీజీబీలో మేనేజర్ మనోహరుడు 2012 నుంచి 2014, జూలై వరకూ 85 మంది రైతులు, 75 ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, 37 ఆర్‌వైఎస్ రుణాలు, 131 స్వయం సహాయక సంఘాల అధ్యక్షుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.2.5 కోట్ల రుణాలు ఇచ్చినట్టు చూపి ఆ మొత్తాన్ని కాజేశారు. ఈ ఉదంతం జూలై 25న బయటపడింది. బ్యాంకు యాజమాన్యం మనోహరుడిని సస్పెండ్ చేసి.. సత్యవేడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంది. మనోహరుడి నుంచి డబ్బును రికవరీ చేయడంపై ఎందుకు దృష్టి సారించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వరదయ్యపాళెం ఎస్బీఐలో డెప్యూటీ జనరల్ మేనేజర్‌గా మహేంద్ర ఫిబ్రవరి, 2010 నుంచి 2014 ఆగస్టు వరకూ పనిచేశారు. అప్పట్లో డెయిరీ, మహిళా పొదుపు సంఘాల పేరిట 41 సంఘాలను సృష్టించి రూ.1,88,95,382 రుణంగా ఇచ్చినట్లు చూపి ఆ మొత్తాన్ని మింగేశారు. ఆ బ్యాంక్ మేనేజర్ ఈ నెల 16న గుర్తించి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఏ రోజుకారోజు ఆడిట్, ఆర్నెల్లకు ఓ సారి నిర్వహించే ఇంటర్నల్ ఆడిట్లు సక్రమంగా జరిగి ఉంటే ఈ అక్రమాలకు ఆదిలోనే చెక్ పడి ఉండేది. ఈ ఆడిట్లను సక్రమంగా చేయకపోవడంతోనే ఆ రెండు బ్యాంకుల్లోనూ ఆ ఇద్దరూ కోట్లను కొల్లగొట్టినట్లు స్పష్టమవుతోంది. చర్యలు శూన్యం .. బ్యాంకుల్లో అక్రమాలు చోటుచేసుకుంటే పోలీసు కేసు నమోదు చేయడంతోపాటూ సీబీఐతో కూడా విచారణ చేయిస్తారు. దాసకుప్పం ఎస్పీజీబీలో రూ.2.5 కోట్లు మింగేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోహరుడిపై ఇప్పటిదాకా బ్యాంకు యాజమాన్యం సీబీఐకి ఫిర్యాదు చేయలేదు. పైగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సత్యవేడు పోలీసులకూ విచారణలో ఉన్నతాధికారులు సహకరించడం లేదనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో దాగిన మర్మమేమిటన్నది అంతుచిక్కడం లేదు. వరదయ్యపాళెం ఎస్బీఐలో అక్రమాలకు పాల్పడిన మహేంద్రపై మాత్రం యాజమాన్యం కఠినమైన చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేయడంతోపాటూ సస్పెండ్ చేసి, రికవరీపై దృష్టి సారించింది. సీబీఐకి కూడా ఫిర్యాదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ యాజమాన్యం తరహాలోనే ఎస్పీజీబీ ఉన్నతాధికారులు ఎందుకు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న అంశంపై బ్యాంకు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. -
సప్తగిరి గ్రామీణ బ్యాంకులో.. జగత్కిలాడీలు.!
మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతుల పేర్లతో రుణాలు తీసుకుని మింగేసిన దాసుకుప్పం బ్రాంచ్ మేనేజర్ బ్యాంకులో నిరుపేదల సొమ్మును కూడా సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసిన మనోహరుడు..! కొట్టేసిన సొమ్ములో భారీ వాటా పొందిన ఓ ఉన్నతాధికారి కేసును నీరుగార్చే యత్నం నెలన్నర క్రితమే రూ.రెండు కోట్లకుపైగాకాజేశాడని తెలిసినా చర్యలు తీసుకోని యాజమాన్యం సాక్షి ప్రతినిధి, తిరుపతి: దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పం చుకున్నట్లు ఓ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్, మరో ఉన్నతాధికారి కుమ్మక్కై పేదలకు రు ణాలు ఇచ్చినట్లు చూపి.. రూ.రెండు కోట్లను నొక్కేశారు. ఆ అక్రమాల గుట్టు కాస్త నెల న్నర క్రితం రట్టు కావడంతో ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. అక్రమాల్లో తీగ లాగితే తాను ఇరకాటంలో పడతానని భావించిన ఆ ఉన్నతాధికారి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సత్యవేడు మండలం దాసుకుప్పం సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మనోహరుడికి సంఖ్యాశాస్త్రం(న్యూమరాలజీ)లో ప్రావీ ణ్యం ఉంది. ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరికి సంఖ్యాశాస్త్రంపై ఉన్న మక్కువను మనోహరుడు తనకు అనుకూలంగా మల్చుకున్నారు. ఉన్నతాధికారిని గుప్పిట్లో పెట్టుకుని చెలరేగిపోయారు. స్వయం సహాయక సం ఘాల మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, రైతుల పేర్లను ఫోర్జరీ చేసి.. రుణాలు తీసుకుని మింగేస్తూ వచ్చారు. ఆ క్రమం లో బ్యాంకుకు నిర్దేశించిన లక్ష్యంకన్నా అధికంగా రుణా లు ఇచ్చేసినట్లు చూపి.. నిధులు నొక్కేశారు. ఏడాదిగా ఇదే రీతిలో నిధులను కాజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.రెండు కోట్లను మనోహరుడు కొట్టేశారు. నెలన్నర క్రితం దాసుకుప్పానికి చెందిన ఓ ఎస్సీ రైతు పంట రుణం మంజూరు చేయాలని బ్యాంకు అధికారులను సంప్ర దించారు. అప్పటికే ఆ రైతు పేరుతో మనోహరుడు రూ.65 వేలు కొట్టేశారు. గతం లో తీసుకున్న రూ.65 వేలు చెల్లిస్తే.. మళ్లీ రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ రైతు తెల్లబోయారు. తాను ఎలాంటి రుణం తీసుకోలేదని ఆ రైతు చెప్పడంతో మనోహరుడి అక్రమాల బాగోతం వెలుగుచూసింది. ఇదే అంశాన్ని బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించి మనోహరుడిపై చర్యలు తీసుకోవాల్సిన ఓ ఉన్నతాధికారి.. దానికి విరుద్దంగా బ్యాంకు అధికారులపై చిందులు వేసినట్లు తెలిసింది. పైగా మనోహరుడికి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో బ్యాంకు అధికారులు తెల్లబోయారు. నెలన్నర తొక్కిపట్టిన ఉన్నతాధికారి.. మనోహరుడితో కలసి వాటాలు దండుకున్న ఉన్నతాధికారి ఆయనను రక్షించేందుకు రంగంలోకి దిగారు. దాసుకుప్పం బ్రాంచ్‌లోనే మనోహరుడు పనిచేస్తే ఇబ్బంది వస్తుందని పసిగట్టిన ఆ ఉన్నతాధికారి.. నాగలాపురం బ్రాంచ్‌కు ఆయనను బదిలీ చేశారు. మనోహరుడు రూ.రెండు కోట్లు మింగేశారని నెలన్నర క్రితమే బ్యాంకు అధికారులు తేల్చినా.. ఆయనపై సీబీఐకిగానీ సత్యవేడు పోలీసుస్టేషన్లోగానీ ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలోనే సత్యవేడు మండలం పుదుకుప్పంకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు రుణం కోసం బ్యాంకు అధికారులను ఆశ్రయించారు. ఆ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, రాజేశ్వరి, మరియమ్మాల్, సరోజిని తదితర మహిళా సంఘాల పేరుతో మనోహరుడు రూ.57 లక్షలకుపైగా రుణం తీసుకున్నట్లు బయటపడింది. తమ పేరుతో బ్యాంకు మేనేజర్ రూ.57 లక్షల రుణం తీసుకుని మింగేయడంపై మహిళా సంఘాలు సోమవారం రాత్రి ఆగ్రహించాయి. సోమవారం, మంగళవారం, బుధవారం దాసుకుప్పం బ్రాంచ్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. దాంతో చేసేది లేక దాసుకుప్పం బ్రాంచ్ అధికారులు మనోహరుడిపై సత్యవేడు పోలీసుస్టేషన్లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా ఆ బ్యాంకు యాజమాన్యం పట్టించుకోలేదు. దాసుకుప్పం బ్రాంచ్‌లో రూ.రెండు కోట్లకుపైగా మేనేజర్ మనోహరుడు మింగేసిన వైనంపై విచారణకు ఎలాంటి అధికార బృందాన్ని నియమించలేదు. ‘తిన్నదేదో తిన్నావ్. తృణమో పణమో చెల్లించు.. కేసు లేకుండా చూస్తా’ అని ఓ ఉన్నతాధికారి ఇచ్చిన అభయంతో మనోహరుడు సెలవుపై వెళ్లిపోయారు. కేసును నీరుగార్చేయత్నం.. మనోహరుడిపై సత్యవేడు పోలీసుస్టేషన్లో నమోదైన కేసును నీరుగార్చేందుకు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే లోపభూయిష్టంగా ఫిర్యాదు ఇప్పించారు. నెలన్నర క్రితం మనోహరుడిపై సస్పెన్షన్ వేటు వేయాల్సిన ఆ అధికారి.. పోలీసు కేసు నమోదైన తర్వాత సస్పెండ్ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఇప్పుడు విచారణకు సహకరించకుండా.. పోలీసులకు తప్పుడు సమాచారం అందించి కేసును నీరుగార్చడానికి రంగంలోకి దిగారు. తద్వారా మనోహరుడిని రక్షించడంతోపాటు తానూ సురక్షితంగా బయటపడవచ్చునన్నది ఆ ఉన్నతాధికారి ఎత్తుగడ. దాసుకుప్పం బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కేఎస్ సుధాకర్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా.. నెలన్నర క్రితం ఆ బ్రాంచ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. రుణాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించి.. పోలీసు ఫిర్యాదు ఇచ్చామన్నారు. ఇప్పటిదాకా ఆ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. దాసుకుప్పం బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు రుణాల మంజూరు పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బు కొట్టేస్తున్నా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తే.. తామెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం. -
తాకట్టు సీజన్!
ముంచుకొచ్చిన ఖరీఫ్ రుణాల మాఫీపై కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడుతున్న రైతులు వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కాస్తా తాకట్టు సీజన్‌గా మారిపోతోంది. పంట రుణాల మాఫీ, కొత్త రుణాల మంజూరుపై ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుండడంతో రైతులు ఎటూ దిక్కుతోచక మిగిలిన బంగారాన్ని తాకట్టుపెడుతున్నారు. భార్య, కుటుంబ సభ్యుల బంగారు ఆభరణాలను బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి ఆ డబ్బుతో విత్తన వేరుశనగకాయలు సమకూర్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. గురువారం కూడేరులోని స్టేట్‌బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంక్, జల్లిపల్లిలోని గ్రామీణబ్యాంక్కు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మండల వ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేస్తారు. సాగు సమయం ఆసన్నమైంది. త్వరలో సబ్సిడీ విత్తన వేరుశనగకాయలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో చేతిలో చిల్లిగవ్వలేని రైతులు ఇదివరకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి కొత్తగా పంట రుణం మంజూరు చేస్తుందేమోనన్న ఆశతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ అందలేదని, తీసుకున్న రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కొత్తగా అప్పులు ఇవ్వడానికి ఎవ్వరూ సాహసించడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్య, కుటుంబ సభ్యుల వద్ద మిగిలి ఉన్న అరకొర బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి విత్తన వేరుశనగకాయలు కొనుక్కోవడానికి బ్యాంకుల బాట పట్టారు. కాగా రోజుకు పది మంది వరకు బంగారం తాకట్టుపై రుణ సదుపాయం కల్పిస్తున్నామని కూడేరు స్టేట్‌బ్యాంక్ మేనేజర్ విజయకుమారి తెలిపారు. బంగారు నాణ్యతను బట్టి తులంపై రూ.13 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. -
హిమబిందు కేసులో మరో ముగ్గురి అరెస్టు
పటమట, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు దారుణహత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు బుధ వారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిం దితులను రెండురోజుల కిందట అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పటమట పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరో ముగ్గురు నిందితుల అరెస్టు విషయాన్ని డీసీపీ రవిప్రకాష్ తెలియజేశారు. అరెస్టయిన వారిలో నగరానికి చెందిన ఎలక్ట్రిషియన్ జనపాల కృష్ణ(24), మంగళగిరి లో అట్టలు తయారు చేసే కంపెనీలో పనిచేసే పలువూరి దుర్గారావు అలియాస్ కయ్యా(21), చికెన్ షాపులో పనిచేసే రామలింగేశ్వరనగర్‌కు చెందిన లంకపల్లి రమణ(22) ఉన్నారన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాం కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్ యాజమాని వద్ద యనమలకుదురు గ్రామానికి చెందిన మహ్మద్ సుభాని(27) కొంతకాలంగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని స్నేహితులు పటమటకు చెందిన కారు డ్రైవర్ సోమన గోపీకృష్ణ(24), ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే జనపాల కృష్ణ(24), దుర్గారావు అలియాస్ కయ్యా(21), లంకపల్లి రమణ(22), మరో 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితో కలిసి తరచూ సుభాని పని చేసే అ పార్ట్మెంట్ వద్దకు వచ్చేవారు. అక్కడ ఉండే షాపుల వద్ద కలుసుకుని మాట్లాడుకునేవారు. హిమబిందు ఒంటరిగా ఇంట్లో ఉంటుందని సుభాని వారికి తెలిపాడు. ఆమెపై లైంగికదాడి చేయాలని వారంతా నిర్ణయించుకున్నారు. పథ కం అమలులో భాగంగా 15వ తేదీ ఉదయం 11 గంటలకు సుభాని, గోపి, రమణ, కృష్ణ, దుర్గాప్రసాద్, మరో వ్యక్తి మొత్తం ఆరుగురు అపార్ట్మెంట్ వద్ద కలుసుకున్నారు. అనంతరం సుభా ని, గోపి, మరో నిందితుడు అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్‌లోకి వెళ్లి హిమబిందు ఉంటున్న ఫ్లాట్ తలుపులు తట్టారు. సుభాని తెలిసిన వాడు కావడంతో ఆమె తలుపులు తీసింది. కింది పోర్షన్లో నీళ్లు రావడం లేదు, మరమ్మత్తు చే యాలని చెప్పగా, ఆమె అంగీకరించింది. అనంతరం పడకగదిలో నుంచి ఎటాచ్డ్ బాత్రూమ్లోకి వెళ్లిన నిందితులు ముగ్గురూ పైపులు మరమ్మత్తు చేస్తున్నట్లుగా నటించారు. ఆమె మంచం వద్ద నిలబడి ఆదమరుపుగా ఉండగా అకస్మాత్తుగా దాడి చేశారు. ఒకరి తరువాత ఒకరు లైంగికదాడి చేశారు. తరువాత కింద నుంచి వచ్చిన దుర్గారావు, లంకపల్లి రమణ, జనపాల కృష్ణ కూడా ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ విషయం బయట పడుతుందని భావిం చిన నిందితులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. సుభాని పని చేస్తున్న కారు యజమాని కుటుంబం వేరే ఊరు వెళ్లడంతో ఆ ఫ్లాట్ తాళా లు అతడి వద్దే ఉన్నాయి. హిమబిందు మృతదేహాన్ని సుభాని పనిచేసే కారు యజమాని ఫ్లాట్ వంటగదిలోకి ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత హిమబిందు ఫ్లాట్‌లోకి వెళ్లి బీరువాలో ఉన్న బం గారు నగలు, వెండి వస్తువులు, నగదు దొం గిలించి పారిపోయారు. మరుసటి రోజు 16వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత అందరూ కలిసి అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. హిమబిందు మృతదేహాన్ని ఎవరూ చూడకుండా కిందకు దించి, దగ్గరలో ఉన్న బందరు కాలువలో పడేశారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు మృతురాలి దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ తీసుకుని ఆమె మరొకరితో వెళ్లిపోయినటు ఆధారాలు సృష్టిం చారు. ఆమె కిడ్నాప్‌నకు గురైనట్లు కూడా డ్రా మా ఆడారు. 17వ తేదీన హిమబిందు మృతదేహం కాలువలో దొరకడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సుభాని తదితరులపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి కిరాతకం వెలుగులోకి వచ్చిం ది. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి బంగారు చంద్రహారం, వెంకటేశ్వరస్వామి బం గారు ఉంగరాలు రెండు, ఒక పగడపు ఉంగరం, లాకెట్టు కలిగిన పగడాల బ్రాస్లెట్, చిన్నపాటి బంగారు చైన్, వెండి యంత్రం, వెండి పసుపు కుంకుమ సెట్, వెండి కుంకుమ భరిణె, వెండి చెవి రింగులు, వెండి బుట్టలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు నరరూప రాక్షసులని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి, పటమట సీఐ రవికాంత్, ఎస్సైలు జనార్దన్, లోవరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజంపేట చోరీపై ఐజీ ఆరా
రాజంపేట, న్యూస్‌లైన్: రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ ఘటనపై రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్త్రన్ ఆరా తీశారు. హ మేరకు శుక్రవారం రాజంపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి చోరీ సంఘటనపై వివరాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చోరీపై దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సబ్‌డివిజన్ పరిధిలోని శాఖ పరమైన పురోగతిపై సమీక్షించారు. సబ్‌డివిజన్ పరిధిలో పోలీసు శాఖకు సంబంధించి నివాస గృహాలు దెబ్బతిని ఉంటే వాటికి మరమ్మతులు చేయించాలని, నివాస గృహాల విషయమై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ యనతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, రాజంపేట డీఎస్పీ అన్యోన్య, పట్టణసీఐ వెంకటరమణ తదితర పోలీసు అధికారులు ఉన్నారు.