సప్తగిరి గ్రామీణ బ్యాంకులో.. జగత్‌కిలాడీలు.! | Saptagiri .. jagatkiladilu rural bank.! | Sakshi
Sakshi News home page

సప్తగిరి గ్రామీణ బ్యాంకులో.. జగత్‌కిలాడీలు.!

Published Thu, Jul 31 2014 3:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

సప్తగిరి గ్రామీణ బ్యాంకులో.. జగత్‌కిలాడీలు.! - Sakshi

సప్తగిరి గ్రామీణ బ్యాంకులో.. జగత్‌కిలాడీలు.!

  • మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతుల పేర్లతో రుణాలు తీసుకుని మింగేసిన
  •  దాసుకుప్పం బ్రాంచ్ మేనేజర్
  •  బ్యాంకులో నిరుపేదల సొమ్మును కూడా సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసిన మనోహరుడు..!
  •  కొట్టేసిన సొమ్ములో భారీ వాటా పొందిన ఓ ఉన్నతాధికారి కేసును నీరుగార్చే యత్నం
  •  నెలన్నర క్రితమే రూ.రెండు కోట్లకుపైగాకాజేశాడని తెలిసినా చర్యలు తీసుకోని యాజమాన్యం
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి:  దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పం చుకున్నట్లు ఓ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్, మరో ఉన్నతాధికారి కుమ్మక్కై పేదలకు రు ణాలు ఇచ్చినట్లు చూపి.. రూ.రెండు కోట్లను నొక్కేశారు. ఆ అక్రమాల గుట్టు కాస్త నెల న్నర క్రితం రట్టు కావడంతో ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. అక్రమాల్లో తీగ లాగితే తాను ఇరకాటంలో పడతానని భావించిన ఆ ఉన్నతాధికారి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
     
    సత్యవేడు మండలం దాసుకుప్పం సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మనోహరుడికి సంఖ్యాశాస్త్రం(న్యూమరాలజీ)లో ప్రావీ ణ్యం ఉంది. ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరికి సంఖ్యాశాస్త్రంపై ఉన్న మక్కువను మనోహరుడు తనకు అనుకూలంగా మల్చుకున్నారు. ఉన్నతాధికారిని గుప్పిట్లో పెట్టుకుని చెలరేగిపోయారు. స్వయం సహాయక సం ఘాల మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, రైతుల పేర్లను ఫోర్జరీ చేసి.. రుణాలు తీసుకుని మింగేస్తూ వచ్చారు. ఆ క్రమం లో బ్యాంకుకు నిర్దేశించిన లక్ష్యంకన్నా అధికంగా రుణా లు ఇచ్చేసినట్లు చూపి.. నిధులు నొక్కేశారు.

    ఏడాదిగా ఇదే రీతిలో నిధులను కాజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.రెండు కోట్లను మనోహరుడు కొట్టేశారు. నెలన్నర క్రితం దాసుకుప్పానికి చెందిన ఓ ఎస్సీ రైతు పంట రుణం మంజూరు చేయాలని బ్యాంకు అధికారులను సంప్ర దించారు. అప్పటికే ఆ రైతు పేరుతో మనోహరుడు రూ.65 వేలు కొట్టేశారు. గతం లో తీసుకున్న రూ.65 వేలు చెల్లిస్తే.. మళ్లీ రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ రైతు తెల్లబోయారు. తాను ఎలాంటి రుణం తీసుకోలేదని ఆ రైతు చెప్పడంతో మనోహరుడి అక్రమాల బాగోతం వెలుగుచూసింది.

    ఇదే అంశాన్ని బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించి మనోహరుడిపై చర్యలు తీసుకోవాల్సిన ఓ ఉన్నతాధికారి.. దానికి విరుద్దంగా బ్యాంకు అధికారులపై చిందులు వేసినట్లు తెలిసింది. పైగా మనోహరుడికి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో బ్యాంకు అధికారులు తెల్లబోయారు.
     
    నెలన్నర తొక్కిపట్టిన ఉన్నతాధికారి..
     
    మనోహరుడితో కలసి వాటాలు దండుకున్న ఉన్నతాధికారి ఆయనను రక్షించేందుకు రంగంలోకి దిగారు. దాసుకుప్పం బ్రాంచ్‌లోనే మనోహరుడు పనిచేస్తే ఇబ్బంది వస్తుందని పసిగట్టిన ఆ ఉన్నతాధికారి.. నాగలాపురం బ్రాంచ్‌కు ఆయనను బదిలీ చేశారు. మనోహరుడు రూ.రెండు కోట్లు మింగేశారని నెలన్నర క్రితమే బ్యాంకు అధికారులు తేల్చినా.. ఆయనపై సీబీఐకిగానీ సత్యవేడు పోలీసుస్టేషన్‌లోగానీ ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలోనే సత్యవేడు మండలం పుదుకుప్పంకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు రుణం కోసం బ్యాంకు అధికారులను ఆశ్రయించారు.

    ఆ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, రాజేశ్వరి, మరియమ్మాల్, సరోజిని తదితర మహిళా సంఘాల పేరుతో మనోహరుడు రూ.57 లక్షలకుపైగా రుణం తీసుకున్నట్లు బయటపడింది. తమ పేరుతో బ్యాంకు మేనేజర్ రూ.57 లక్షల రుణం తీసుకుని మింగేయడంపై మహిళా సంఘాలు సోమవారం రాత్రి ఆగ్రహించాయి. సోమవారం, మంగళవారం, బుధవారం దాసుకుప్పం బ్రాంచ్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు.

    దాంతో చేసేది లేక దాసుకుప్పం బ్రాంచ్ అధికారులు మనోహరుడిపై సత్యవేడు పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా ఆ బ్యాంకు యాజమాన్యం పట్టించుకోలేదు. దాసుకుప్పం బ్రాంచ్‌లో రూ.రెండు కోట్లకుపైగా మేనేజర్ మనోహరుడు మింగేసిన వైనంపై విచారణకు ఎలాంటి అధికార బృందాన్ని నియమించలేదు. ‘తిన్నదేదో తిన్నావ్. తృణమో పణమో చెల్లించు.. కేసు లేకుండా చూస్తా’ అని ఓ ఉన్నతాధికారి ఇచ్చిన అభయంతో మనోహరుడు సెలవుపై వెళ్లిపోయారు.
     
    కేసును నీరుగార్చేయత్నం..
     
    మనోహరుడిపై సత్యవేడు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును నీరుగార్చేందుకు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే లోపభూయిష్టంగా ఫిర్యాదు ఇప్పించారు. నెలన్నర క్రితం మనోహరుడిపై సస్పెన్షన్ వేటు వేయాల్సిన ఆ అధికారి.. పోలీసు కేసు నమోదైన తర్వాత సస్పెండ్ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఇప్పుడు విచారణకు సహకరించకుండా.. పోలీసులకు తప్పుడు సమాచారం అందించి కేసును నీరుగార్చడానికి రంగంలోకి దిగారు.

    తద్వారా మనోహరుడిని రక్షించడంతోపాటు తానూ సురక్షితంగా బయటపడవచ్చునన్నది ఆ ఉన్నతాధికారి ఎత్తుగడ. దాసుకుప్పం బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కేఎస్ సుధాకర్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా.. నెలన్నర క్రితం ఆ బ్రాంచ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు.

    రుణాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించి.. పోలీసు ఫిర్యాదు ఇచ్చామన్నారు. ఇప్పటిదాకా ఆ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. దాసుకుప్పం బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు రుణాల మంజూరు పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బు కొట్టేస్తున్నా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తే.. తామెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement