రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ ఘటనపై రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్త్రన్ ఆరా తీశారు.
రాజంపేట, న్యూస్‌లైన్: రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ ఘటనపై రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్త్రన్ ఆరా తీశారు. హ మేరకు శుక్రవారం రాజంపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి చోరీ సంఘటనపై వివరాలు అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బ్యాంకు చోరీపై దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సబ్‌డివిజన్ పరిధిలోని శాఖ పరమైన పురోగతిపై సమీక్షించారు. సబ్‌డివిజన్ పరిధిలో పోలీసు శాఖకు సంబంధించి నివాస గృహాలు దెబ్బతిని ఉంటే వాటికి మరమ్మతులు చేయించాలని, నివాస గృహాల విషయమై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ యనతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, జిల్లా ఎస్‌పీ జీవీజీ అశోక్‌కుమార్, రాజంపేట డీఎస్‌పీ అన్యోన్య, పట్టణసీఐ వెంకటరమణ తదితర పోలీసు అధికారులు ఉన్నారు.