హానికర సాఫ్ట్‌వేర్ (ర్యాన్సమ్‌వేర్) దాడికి గురైన సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ సర్వీసులను తిరిగి పునరుద్ధరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 300 సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు ఉపశమనం లభించింది.
ఎన్‌పీసీఐ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఇటీవల ర్యాన్సమ్‌వేర్ దాడి జరిగింది. దాంతో వెంటనే స్పందించి దాడి జరిగిన సర్వర్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. తిరిగి సర్వీస్ ప్రొవైడర్ సేవలను తాజాగా పునరుద్ధరించారు. వినియోగదార్లు ఏటీఎంల నుంచి నగదు స్వీకరణ, యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు.
ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్ దాడి!
కస్టమర్లకు నిధుల బదలాయింపు, ఏటీఎంల వద్ద నగదు స్వీకరణ, యూపీఐ చెల్లింపు సేవల కోసం బ్యాంకులు సీ-ఎడ్జ్‌పై ఆధారపడ్డాయి. సీ-ఎడ్జ్ హానికర సాఫ్ట్‌వేర్ దాడికి గురికావడంతో లావాదేవీల విషయంలో కొన్ని సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వినియోగదార్లు సోమవారం నుంచి అంతరాయం ఎదుర్కొన్నారు. సీ-ఎడ్జ్‌లో ర్యాన్సమ్‌వేర్ విస్తరణకు అవకాశం ఉండడంతో పేమెంట్ సిస్టమ్‌లను వేరు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ దాడి కేవలం టెక్నాలజీ సిస్టమ్‌లకే పరిమితమైందని, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సొంత మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment