తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ఉదయం ఆసక్తికరమైన ఒక ట్వీట్‌ను షేర్ చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో సహకారిగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు బుధవారం ఆర్బీఐ ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఈ విషయమై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని, సీఎం కేసీఆర్ సారధ్యంలో సత్తా చాటుతూ తెలంగాణ దూసుకుపోతోందని సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్.
తెలంగాణకు అది ఇచ్చాం.. ఇది ఇచ్చాం అని హిందీలో అర్థం పర్థం లేని స్టేట్‌మెంట్లు ఇచ్చే అజ్ఞానులకు ఇది చూపించండి. తెలంగాణ ప్రజల్లారా వాళ్లకు తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి. అంటూ మరో ట్వీట్‌లో ఆయన పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు విసిరారు.
Request all Telanganaites to share this with any ignoramus who says otherwise
— KTR (@KTRTRS) September 16, 2021
Tired of the nonsensical statements; “Humne Telangana Ko Yeh Diya, woh Diya”!
Agar Diya kisine tho Telangana Ji Janta ney is Desh ko Diya
And we are proud to be contributing to the Nation 🇮🇳
ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి జాబితాలో నాలగవ స్థానంలో నిలిచింది తెలంగాణ. ఈ మేరకు ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్‌స్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2020-21’ పేరిట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రిలీజ్ చేసింది. జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో విస్తీర్ణంపరంగా 11లో, జనాభాలో 12వ ప్లేస్‌లో ఉన్న తెలంగాణ.. దేశ ఆర్థిక భాగస్వామ్యంలో నాలుగో స్థానంలో నిలవడం విశేషం.
తలసరి ఆదాయం రెట్టింపు..
ఇక రాష్ట్ర తలసరి ఆదాయం ఆరేళ్లలో రెట్టింపు అయింది. ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పతి గణనీయంగా పెరగడంతో తలసరి ఆదాయం కూడా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632కు పెరిగిందని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన వార్షిక హ్యాండ్ బుక్‌లో వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం దేశంలోనే తెలంగాణ టాప్-5లో నిలిచింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండగా.. ఆరేళ్లలో రూ.2,37,632కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment