దేశవ్యాప్తంగా రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇందులో రెండు రోజులు(శని, అది) సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా బ్యాంకు సేవలు ఆగిపోనున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 15న రెండు రోజుల సమ్మెను ప్రారంభించాలని 9 బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బియు) 2021 మార్చి 15, 16 తేదీలలో బ్యాంక్ ఉద్యోగుల అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ) తమకు తెలిపినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. సమ్మె జరిగే రోజుల్లో బ్యాంకు శాఖలు, కార్యాలయాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. కేంద్ర 2021 బడ్జెట్ సందర్భంగా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్‌బి)ను ప్రైవేటీకరించనున్నట్లు ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment