ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు వేతనాల్ని సగటున 15 శాతం పెంపుపై బ్యాంకులు - బ్యాంకు యూనియన్ సంఘాలు చర్చిస్తున్నాయి.
ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. తాజాగా, ఉద్యోగులు వేతనాల్ని 15 శాతం పెంపును ప్రతిపాదించింది. అయితే, పనిదినాల మార్పులతో పాటు వేతనాల శాతాన్ని మరింత పెంచాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికే పీఎన్‌బీ వంటి కొన్ని బ్యాంకులు వేతనాల పెంపుకు పెద్దమొత్తంలో కేటాయింపులు జరుపుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వేతనం 10 శాతం పెరిగేలా బడ్జెట్ కేటాయించడానికి బదులుగా, 15శాతం పెరుగుదల కోసం నిధులను కేటాయించింది.
నిశితంగా పరిశిలీస్తున్న కేంద్రం
‘ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు బాగా పెరిగాయని, కొవిడ్ సమయంలో పనిచేయడం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుణదాతలను తిరిగి గాడిలో పెట్టడానికి ఉద్యోగులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటే తమకు మెరుగైన పరిహారం లభిస్తుందని’ ఉద్యోగులు, యూనియన్లు వాదించుకుంటున్నాయి. ఈ చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.
అసలే ఎన్నికలు
అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నందున వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కంటే ముందే వేతన సెటిల్ మెంట్‌తో పాటు వారానికి ఐదురోజుల పనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment