Pakistan Security Guard Kicks Pregnant Woman, CCTV Footage Video Goes Viral - Sakshi
Sakshi News home page

అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...

Published Tue, Aug 9 2022 4:09 PM | Last Updated on Tue, Aug 9 2022 4:59 PM

CCTV Footage Shows Security Guard Kicks Pregnant Woman At Pakistan - Sakshi

కరాచి: పాకిస్తాన్‌ ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అన్న కనికరం లేకుండా కొట్టి కొందపడేసి బూట్లతో తన్ని దారుణంగా ప్రవర్తించాడు ఒక సెక్యూరిటి గార్డు. పోలీసులు తెలపిన కథనం ప్రకారం....పాకిస్తాన్‌లోని కరాచీలో నోమన్ గ్రాండ్ సిటీ అనే అపార్టమెంట్స్‌ గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉంది.  సనా అనే ఒక ఐదు నెలల గర్భిణి ఆ ఆపార్టమెంట్స్‌ లోనే పనిమనిషిగా పనిచేస్తోంది.

ఐతే ఆమె తన కొడుకు సోహిల్‌ తన కోసం ఆహారం తీసుకువచ్చాడని తనని లోపలికి అనుమతించాల్సిందిగా ఆ ఆపార్టమెంట్‌ సెక్యూరిటీ గార్డుని వేడుకుంది. ఐతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్‌ నాసిర్‌, అదిల్‌ ఖాన్‌, మహ్మద్‌ ఖలీల్‌ లోపలకి రావడాని అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఆ సెక్యూరిటీ గార్డు కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.

దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తిరిగి లేచేందుకు ప్రయత్నించే లోపే బూట్లతో ముఖం పై తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్ప్రుహ కోల్పోయింది. ఈ సంఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు​ అవ్వడ్డంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు సింధ్‌ ముఖ్యమంత్రి మురాద్‌ అలీ షా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఆ గార్డు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఆ గార్డు పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా.

(చదవండి: కలెక్టర్‌ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement