పాక్ యాంటీటెర్రర్ గ్రూప్‌లో మహిళలు
కరాచీ:
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావియెన్స్ ప్రభుత్వం.. ఉగ్రవాద వ్యతిరేక దళంలో తొలిసారిగా మహిళలకు చోటు కల్పించింది. 40 మంది యువతులు ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రర్ డిపార్ట్‌మెంట్‌లో విధుల్లో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అనేకరకాల దేహదారుఢ్య పరీక్షలతోపాటు మెడికల్ టెస్ట్‌లు, ఇంటర్వూ్యలు నిర్వహించిన తర్వాత వారిని ఎంపిక చేశామని, పాక్ ఆర్మీతో ఎంపికైన యువతులకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.
ఆరునెలల ఎంపికైన నలభై మందిని ఆరునెలల శిక్షణ తర్వాత పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ హోదాతో సమానమైన పోస్టుల్లో నియమిస్తామని, పనితీరు ఆధారంగా రెగ్యులర్ కౌంటర్ టెర్రర్ డిపార్ట్‌మెంట్, ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్‌లో చోటు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం చట్టాలను సవరించింది. దీంతో పోలీస్ విభాగంలో ఉద్యోగాల కోసంగాను నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైనవారిలో మహిళల సంఖ్య 2శాతం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. పాక్‌లో మొత్తం పోలీసుల సంఖ్య 3,91,364 కాగా అందులో 5,731 మంది మాత్రమే మహిళలున్నారు.