పాకిస్తాన్‌లో 2024 ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ నామినేషన్‌పై ఓ వైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా ప్రకాష్ ఎన్నికల రంగంలోకి దిగడం కూడా ఉత్కంఠ రేపుతోంది. పురుషాధిక్య పాకిస్తాన్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కొందరు మహిళా నేతలు కూడా ఉన్నారు. వారెవరో.. వారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మరియమ్ నవాజ్:
పాకిస్తాన్ రాజకీయాల్లో అగ్రశ్రేణి మహిళా రాజకీయ నేతలలో మరియమ్ నవాజ్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, కుల్సూమ్ నవాజ్‌ల కుమార్తె. ఆమె తన తండ్రితో పాటు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
ఆయలా మాలిక్:
ఇమ్రాన్ ఖాన్ ప్రచార నిర్వాహకురాలు ఆయలా. ఈమె మామ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు సర్దార్ ఫరూక్ అహ్మద్ ఖాన్ లెఘారీ. ఆయలా సోదరి సుమైరా మాలిక్ కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
అలీజ్ ఇక్బాల్:
పాకిస్తాన్ మాజీ ఎంపీ అలీజ్ ఇక్బాల్ హైదర్ అక్కడి ప్రముఖ మహిళా నేతల్లో ఒకరు. అలీజ్ తండ్రి ఇక్బాల్ హైదర్ చట్టసభ సభ్యుడు. అలీజ్.. బిలావల్ భుట్టో జర్దారీకి ప్రతినిధిగా కూడా ఉన్నారు.
షాజియా మేరీ:
పాక్ మహిళా నేతలలో షాజియా మేరీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. షాజియా మేరీ సింధీ బలూచ్ పాకిస్తాన్ రాజకీయనేత. ఆమె 2002లో సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
హీనా రబ్బానీ ఖర్:
పాక్‌కు చెందిన మహిళా నేత హీనా రబ్బానీ ఖర్ తన ప్రత్యేక ప్రసంగాలతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. హీనా రబ్బానీ ఖర్ 2011- 2013 మధ్య కాలంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
కష్మలా తారిక్:
కష్మలా తారిక్ పాక్‌లో మహిళల రక్షణకు పాటుపడుతున్నారు. ఆమె 2018 నుండి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కష్మలా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు.
షర్మిలా ఫారూఖీ
పాక్ రాజకీయాలపై లోతైన అవగాహన కలిగిన మహిళా నేతగా షర్మిలా ఫారూఖీ పేరొందారు. ప్రస్తుతం షర్మిల పాకిస్తాన్‌లోని సింధ్ ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు.
మార్వి మెమన్:
మార్వి మెమన్ ప్రస్తుతం బెనజీర్ ఇన్‌కమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగానూ పేరొందారు.
హీనా పర్వేజ్ బట్
హీనా పర్వేజ్ బట్ తరచూ ప్రజల మధ్య తిరుగుతూ ఉత్తమ నేతగా పేరు తెచ్చుకున్నారు. హీనా.. లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్‌మెడల్ సాధించారు.
సుమైరా మాలిక్
మానవ హక్కుల కార్యకర్తగా సుమైరా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. పాక్ మహిళల అభిమానాన్ని సుమైరా చూరగొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment