ప్రభుత్వ ఉద్యోగమా అదెక్కడ! | TDP government failed to keep poll promises | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగమా అదెక్కడ!

Published Fri, Oct 13 2017 7:06 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్‌ ప్రభావంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, అటు ప్రైవేటు ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement