
హాలీవుడ్‌లో యాక్షన్ హీరోలు ఎవరు లేరు. అందులోనూ నా ఏజ్ గ్రూప్ యాక్షన్ హీరోలు అసలే లేరు. 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ తప్ప పూర్తి తరహాలో యాక్షన్ చిత్రీకరించే నైపుణ్యం ఉన్న వారిని చూసి చాలా కాలం అయింది.
Tiger Shroff Says Hollywood Is His Goal But I Have Failed In Auditions: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటించిన చిత్రం 'హీరోపంతి 2'. 2014లో వచ్చిన రొమాంటిక్-యాక్షన్ మూవీ 'హీరోపంతి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. సాజిద్ నడియద్‌వాలా నిర్మించగా, ఇందులో లైలా అనే ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన యాక్టింగ్ మార్క్ చూపించనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో 'మీరు హాలీవుడ్‌కు వెళ్లే సమయం వచ్చిందా' అని అడిగిన ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ ఆసక్తిర విషయాలు తెలిపాడు.
'హాలీవుడ్‌లో యాక్షన్ హీరోలు ఎవరు లేరు. అందులోనూ నా ఏజ్ గ్రూప్ యాక్షన్ హీరోలు అసలే లేరు. 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ తప్ప పూర్తి తరహాలో యాక్షన్ చిత్రీకరించే నైపుణ్యం ఉన్న వారిని చూసి చాలా కాలం అయింది. అయితే హాలీవుడ్ నుంచి నాకు రెండు సార్లు ఆఫర్ వచ్చింది. కానీ ఆ రెండు సార్లు ఆడిషన్‌లో ఫెయిల్ అయ్యాను. అయినా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాబట్టి చూద్దాం. హాలీవుడ్ సినిమాల్లో నటించడమే నా లక్ష్యం.' అని చెప్పుకొచ్చాడు టైగర్ ష్రాఫ్. కాగా సైబర్ నేరాలను అరికట్టేందుకు లైలాతో బబ్లూ (టైగర్ ష్రాఫ్) అనే వ్యక్తి ఎలా తలపడ్డాడనేదే 'హీరోపంతి 2' కథ అని తెలుస్తోంది.
చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్
హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్..