మాట్లాడుతున్న మండల కార్యదర్శి నర్సయ్య
రెబ్బెన : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్ని కల హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలం అ య్యాయని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య ఆ రోపించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే సీపీఐ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గత 90 సంవత్సరాలుగా బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం సీపీఐ ఎన్నో ప్రజా పోరాటాలు చేపట్టిందన్నారు. కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికుల హక్కుల కో సం ఎన్నో త్యాగాలను చేసిందన్నారు. కాని కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రజ లకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని సైతం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మాటల గారడీతో పాలన సాగిస్తోందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ మి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కేజీటూ పీజీ ఉచిత విద్యపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేకుండా పో యిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 4వ వరకు నిర్వహించబోయే రాష్ట్ర మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. మండలంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో రెబ్బెన పట్టణ కార్యదర్శి రామడుగుల శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కుందారపు బసవయ్య, నాయకులు సాగర్‌గౌడ్, సంతోష్‌గౌడ్, అంకూస్, జేఏసీ కన్వీనర్ మల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment