చాట్‌జీపీటీ పేరు అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తం మారు మోగిపోతోంది. చాట్‌జీపీటీ చేయలేని పనే లేదంటూ మన దగ్గరి నుంచి ఇన్‌పుట్ తీసుకుని వేగంగా అవుట్‌పుట్ ఇవ్వగల సత్తా దీని సొంతమని అగ్ర రాజ్యాలు సైతం చెబుతున్నాయి. కానీ ఇటీవల ఇండియాలో జరిగిన పరీక్షల్లో మాత్రం చాట్‌జీపీటీ బొక్కబోర్లా పడింది.
చాట్‌జీపీటీ ఇప్పటికే ఎన్నో కష్టతరమైన పారీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. అయితే భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేయలేక ఫెయిల్ అయింది. అంతే కాకుండా ఇండియాలో టాప్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ ఆయిన 'జేఈఈ అడ్వాన్స్‌డ్' లో కూడా చాట్‌జీపీటీ ఫెయిల్ అయినట్లు తెలిసింది.
జేఈఈ అనేది భారతదేశంలో ఐఐటీ, ఎన్‌ఐటీల వంటి ప్రీమియం ఇన్‌స్టిట్యూట్‌లలో చోటు సంపాదించుకోవడం కోసం విద్యార్థులు పెట్టే పరీక్ష. అలాంటి పరీక్షలో చాట్‌జీపీటీ నెగిటివ్ స్కోర్ చేసింది. రెండు పేపర్లలో కలిపి కేవలం 11 ప్రశ్నలకు మాత్రమే AI సమాధానం ఇచ్చింది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్‌లో ఏఐ చాట్‌బాట్ 45 శాతం మార్కుల్ని సాధించింది.
(ఇదీ చదవండి: నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..)
ఈ పరీక్షలు మాత్రమే కాకుండా NEET ఎగ్జామ్‌లో 200 ప్రశ్నలకు గానూ 180 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉండగా చాట్‌జీపీటీ ప్రయత్నం ఇక్కడ కూడా వృధా అయింది. బయాలజీ సెక్షన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చినట్లు చెబుతున్నారు. CLAT పరీక్షలో కూడా చాట్‌జీపీటీ అంతంతమాత్రంగానే నిలిచింది. ఇందులో కేవలం 50.83 శాతం ప్రశ్నలకు మాత్రమే బదులిచ్చింది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నల విభాగంలో ఏఐ ఫెయిల్ అయింది. కానీ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్‌లో మాత్రం ఎక్కువ మార్కులు సాధించింది. దీన్ని బట్టి చూస్తే కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలకు చాట్‌జీపీటీ సరైన సమాధానాలు ఇవ్వలేకపోతోందని తెలుస్తోంది.
2022 నవంబర్‌లో ప్రారంభమైన చాట్‌జీపీటీ అమెరికాలో నిర్వహించిన యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ వంటి ఎన్నో పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి, లెవెల్ 3 ఇంజినీర్ల కోసం నిర్వహించే గూగుల్ కోడింగ్ ఇంటర్వ్యూలలో కూడా తనదైన సత్తా చాటుకుంది.
(ఇదీ చదవండి: కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!)
అమెరికా పరీక్షల్లో పాసై భారతదేశంలో మాత్రం తన సత్తా చాటలేకపోయింది. ఇదిలా ఉండగా చాట్‌జీపీటీ టెక్నాలజీతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం పొంచి ఉందని ఇటీవల కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment