upsc exams
-
ఎగ్జామ్‌లో ఫెయిలైన చాట్‌జీపీటీ.. అట్లుంటది ఇండియా అంటే!
చాట్‌జీపీటీ పేరు అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తం మారు మోగిపోతోంది. చాట్‌జీపీటీ చేయలేని పనే లేదంటూ మన దగ్గరి నుంచి ఇన్పుట్ తీసుకుని వేగంగా అవుట్‌పుట్ ఇవ్వగల సత్తా దీని సొంతమని అగ్ర రాజ్యాలు సైతం చెబుతున్నాయి. కానీ ఇటీవల ఇండియాలో జరిగిన పరీక్షల్లో మాత్రం చాట్‌జీపీటీ బొక్కబోర్లా పడింది. చాట్‌జీపీటీ ఇప్పటికే ఎన్నో కష్టతరమైన పారీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. అయితే భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేయలేక ఫెయిల్ అయింది. అంతే కాకుండా ఇండియాలో టాప్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ ఆయిన 'జేఈఈ అడ్వాన్స్డ్' లో కూడా చాట్‌జీపీటీ ఫెయిల్ అయినట్లు తెలిసింది. జేఈఈ అనేది భారతదేశంలో ఐఐటీ, ఎన్ఐటీల వంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్లలో చోటు సంపాదించుకోవడం కోసం విద్యార్థులు పెట్టే పరీక్ష. అలాంటి పరీక్షలో చాట్‌జీపీటీ నెగిటివ్ స్కోర్ చేసింది. రెండు పేపర్లలో కలిపి కేవలం 11 ప్రశ్నలకు మాత్రమే AI సమాధానం ఇచ్చింది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్లో ఏఐ చాట్‌బాట్ 45 శాతం మార్కుల్ని సాధించింది. (ఇదీ చదవండి: నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..) ఈ పరీక్షలు మాత్రమే కాకుండా NEET ఎగ్జామ్‌లో 200 ప్రశ్నలకు గానూ 180 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉండగా చాట్‌జీపీటీ ప్రయత్నం ఇక్కడ కూడా వృధా అయింది. బయాలజీ సెక్షన్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చినట్లు చెబుతున్నారు. CLAT పరీక్షలో కూడా చాట్‌జీపీటీ అంతంతమాత్రంగానే నిలిచింది. ఇందులో కేవలం 50.83 శాతం ప్రశ్నలకు మాత్రమే బదులిచ్చింది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నల విభాగంలో ఏఐ ఫెయిల్ అయింది. కానీ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్‌లో మాత్రం ఎక్కువ మార్కులు సాధించింది. దీన్ని బట్టి చూస్తే కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలకు చాట్‌జీపీటీ సరైన సమాధానాలు ఇవ్వలేకపోతోందని తెలుస్తోంది. 2022 నవంబర్‌లో ప్రారంభమైన చాట్‌జీపీటీ అమెరికాలో నిర్వహించిన యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ వంటి ఎన్నో పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి, లెవెల్ 3 ఇంజినీర్ల కోసం నిర్వహించే గూగుల్ కోడింగ్ ఇంటర్వ్యూలలో కూడా తనదైన సత్తా చాటుకుంది. (ఇదీ చదవండి: కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!) అమెరికా పరీక్షల్లో పాసై భారతదేశంలో మాత్రం తన సత్తా చాటలేకపోయింది. ఇదిలా ఉండగా చాట్‌జీపీటీ టెక్నాలజీతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం పొంచి ఉందని ఇటీవల కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. -
యూపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సదుపాయం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుందని, దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదని యూపీఎస్సీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుందని తెలిపాయి. ఆన్లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. upsc.Govt.in లేదా upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ యూట్యూబ్ చానల్ తొలగింపు -
నేషనల్ డిఫెన్స్ పరీక్షలో అవివాహిత మహిళలకు చాన్స్
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నావల్ అకాడమీ పరీక్షకు అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం యూపీఎస్సీ ఒక ప్రకటనలో వివరించింది. జాతీయత, వయస్సు, విద్య తదితర అంశాల్లో అర్హులైన అవివాహిత మహిళలు ఈనెల 24 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే upsconline.nic.inలో పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. మహిళా అభ్యర్థులకు పరీక్ష దరఖాస్తు రుసుము ఉండదని తెలిపింది. శారీరక దారుఢ్య ప్రమాణాలు, ఖాళీల సంఖ్యపై రక్షణ శాఖ నుంచి వివరాలు అందాక నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది. పరీక్ష నవంబర్ 14వ తేదీన ఉంటుందని వివరించింది. -
సివిల్స్ ఫలితాలపై యూపీఎస్సీ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సివిల్ సర్వీసుల పరీక్షా ఫలితాలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గురువారం వివరణ ఇచ్చింది. ఈ పరీక్షల్లో 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు-2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను నిర్వహించామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయదలుచుకున్న ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్ధులను ఎంపిక చేశారని తప్పుదారి పట్టించే ప్రచారం తమ దృష్టికి వచ్చిందని యూపీఎస్సీ పేర్కొంది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా నియామకాల కోసం భారత ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షా నిబంధనలను కమిషన్ తూచాతప్పకుండా అనుసరించిందని తెలిపింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా 927 ఖాళీల కోసం తొలి విడతగా 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, నిబంధనల ప్రకారం రిజర్వ్ జాబితాను నిర్వహిస్తున్నామని ఆ ప్రకటనలో యూపీఎస్సీ వెల్లడించింది. దశాబ్ధాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారని తెలిపింది. సాధారణ ప్రమాణాల్లో ఎంపికైన రిజర్వ్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు వారికి ఉపయోగకరంగా ఉంటే వారి రిజర్వ్ స్టేటస్ ఆధారంగా సర్వీసులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. చదవండి : మాజీ సర్పంచ్ కొడుకు.. సివిల్స్ టాపర్ -
ఉద్యోగ పరీక్షలపైనా కరోనా ప్రభావం
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావం ప్రవేశ పరీక్షలే కాదు ఉద్యోగ పరీక్షలపైనా పడింది. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన వివిధ ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వూ్యలను వాయిదా వేశాయి. టీఎస్పీఎస్సీ అయితే వివిధ శాఖలతో సంప్రదింపులను కూడా రద్దు చేసుకుంది. వాయిదా పడిన యూపీఎస్సీ పరీక్షలు ఈనెల 23 నుంచి మెుదలుకొని వచ్చే నెల చివరకు వివిధ విభాగాల్లో నిర్వహించాల్సిన సైంటిస్ట్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర 12 రకాల ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ వాయిదా వేసింది. వచ్చే నెల 3 వరకు నిర్వహించాల్సిన సివిల్స్ ఇంటర్వూ్యలను వాయిదా వేసింది. ఎస్ఎస్సీ వాయిదా వేసినవి ఎన్ఐఏ, సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ వ్యూన్ ఇన్ అస్సాం రైఫిల్స్‌లో ఈనెల 24 నుంచి వచ్చే నెల 30 వరకు నిర్వహించాల్సిన రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను (ఆర్ఎంఈ) స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. వాటితోపాటు సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్ వ్యూన్ పోస్టులకు ఈనెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు నిర్వ హించాల్సిన డీటేయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను (డీఎంఈ) వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్ఐ, సీఏపీఎఫ్, సీఐఎస్ఎఫ్లో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షలను వాయిదా వేసింది. వీటితోపాటు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (లెవల్–1) పరీక్షలను, అలాగే ఈనెల 30 నుంచి నిర్వహించాల్సిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వే యింగ్, కాంట్రాక్ట్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షలు.. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పలు పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల 27 నుంచి 30 వరకు ఆల్ ఇండియా సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ వారికి నిర్వహించాల్సిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ టెస్టు పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. మరోవైపు కరోనా అదుపులోకి వచ్చే వరకు ఎలాంటి పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించవద్దని నిర్ణయించింది. వివిధ శాఖలతో నిర్వహించాల్సిన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకుంది. వివిధ శాఖలతో ఈ–మెయిల్ ద్వారానే సంప్రదింపులు జరపాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
24 గంటలు చదువే.. కలిసి ఉండలేను!
భోపాల్: పెళ్లిల్లు స్వర్గంలో నిశ్చయమైనా.. వాటిని కలకాలం నిలుపుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విబేధాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం చెప్పుకునేది కూడా ఇలాంటి వార్తే. భర్త పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తనను పట్టించుకోవడం మానేశాడని ఓ ఇల్లాలు విడాకులు కోరింది. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందటే వివాహం అయ్యింది. అయితే అతను యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతూ.. భార్యను పట్టించుకోవడం మానేశాడు. భర్త ప్రవర్తనతో విసిగి పోయిన సదరు యువతి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. కౌన్సిలింగ్ సందర్భంగా సదరు యువతి.. ‘నా భర్త పీహెచ్డీ పూర్తి చేశాడు. నా అత్తమామలకు నా భర్త ఒక్కడే కుమారుడు. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే తన తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. వారి బలవంతం మేరకు వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన నాటి నుంచి చదువుకే అంకితం అయ్యాడు. తనకు వివాహం అయ్యి భార్య ఉందనే విషయాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి ఉండటం కుదరదు. అందుకే విడాకులు కోరుతున్నాను’ అని తెలిపింది. అయితే సదరు వ్యక్తి మాత్రం తన భార్య పుట్టింటికి వెళ్లిందని.. తిరిగి రావడానికి ఇష్టపడటం లేదని.. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. అందుకే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరాడు. కాగా ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు ఈ దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీని గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘మేం వారి వివాహ బంధాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం. మరో నాలుగు సెషన్ల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. ఆ తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటే అప్పుడు వారికి విడాకులు మంజూరు చేస్తాం’ అని తెలిపారు. -
కొడుకును చూసుకుంటూనే.. రెండో ర్యాంకు
చండీగఢ్: ఓ వైపు గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలో ఏకంగా రెండో ర్యాంకుతో సత్తాచాటారు చండీగఢ్‌కు చెందిన అను కుమారి(31). నాలుగేళ్ల కుమారుడిని చూసుకుంటూనే రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదువుతూ రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించారు. ఆమె భర్త వ్యాపారవేత్త. ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేశారు. నాగ్‌పుర్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీఏ చేశారు. 2016లో తొలిసారి ప్రయత్నించారు. కేవలం రెండు నెలలు మాత్రమే చదివి పరీక్ష రాశారు. అయితే ప్రిలిమ్స్‌లో ఒక్క మార్కుతో అర్హత కోల్పోయారు. దీంతో మళ్లీ ప్రయత్నించి ఏకంగా రెండో ర్యాంకు దక్కించుకున్నారు. తాను సివిల్స్‌కు సన్నద్ధమైన గ్రామంలో పేపర్ కూడా ఉండదని, ఆన్లైన్ సహాయంతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని పేర్కొన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే దృఢసంకల్పం అవసరం అని, అలా ఉంటే విజయం సాధించకుండా ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల భద్రతే తన ప్రధాన లక్ష్యమన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ అను కుమారికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అను కుమారి నుంచి హరియాణా అమ్మాయిలు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో మొత్తం 990 మంది వివిధ సర్వీసులకు ఎంపిక కాగా, వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. యూపీఎస్సీ టాప్ 25 జాబితాలో 8 మంది మహిళలు ఉన్నారు. -
యూపీఎస్సీ పరీక్షలకు ముందస్తు ఏర్పాట్లు
ఆగస్టు 7న పరీక్ష నిర్వహణ నగరంలో 28 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు విజయవాడ : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను విజయవాడలో నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాబు. ఏ పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7న విజయవాడ కేంద్రంలో 28 సబ్సెంటర్లలో పరీక్ష జరుగుతుందని చెప్పారు. క్యాంపు కార్యాలయం హాలును కంట్రోల్ రూంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరీక్షలలో ఎటువంటి మాల్‌ప్రాక్టీసుకు అవకాశం లేకుండా సూపర్ వైజర్ల పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కల్టెర్ గంధం చంద్రడు మాట్లాడుతూ యూపీఎస్సీ జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను పాటించాలన్నారు. 7న ఆదివారం పేపర్–1పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహిస్తారని చెప్పారు. పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందన్నారు. సూపర్ వైజర్లు, అసిస్టెంట్ సూపర్ వైజర్లతోపాటు రాష్ట్రం నుండి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు, యూపీఎస్సీ తరుపున ఒక పర్యవేక్షకులు విజయవాడ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. విజయవాడలో ఏర్పాౖటెన కంట్రోల్ రూంను జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద జిల్లా వైద్య, ఆరోగ్య, శాఖ ౖÐð ద్య చికిత్స కేంద్రాలను ఏర్పాటు చే యాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్ధులకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే వారికి తగిన బస్సు సౌకర్యం కల్పించేలా ఆర్టీసీ అధికారులకు తగు సూచనలు జారీ చేశామన్నారు. జేసీ పవర్‌పాయంట్ ప్రజంటేషన్ ద్వారా పరీక్ష నిర్వహణపై సమగ్రంగా వివరించారు. నూజివీడు సబ్–కలెక్టర్ డాక్టర్ జి. లక్షీశ, అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, ఆర్డీవోలు సాయిబాబా, చక్రపాణి, డీఈవో సబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలనుందా ?
న్యూఢిల్లీ: జీవితంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఏటా దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్నారు. అందులో కొద్ది మందికే ఆ అవకాశం లభిస్తుంది. అందులోనూ లక్షల.. లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు తగులబెట్టి రాత్రింబవళ్లు చదివే వారికే ఎక్కువ అవకాశం వస్తుంది. తెలివి తేటలు దండిగా ఉన్నప్పటికీ, అకుంఠిత దీక్షతో చదివే పట్టుదల ఉన్నప్పటికీ పేదరికం కారణంగా ఎంతోమంది విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోలేక పోతున్నారు. అచ్చం అలాంటి వారి కోసమే ‘అన్అకాడమీ’ పేరిట ఆన్లైన్ ఉచిత కోచింగ్ సెంటర్ పుట్టుకొచ్చింది. ఎప్పటికప్పుడు కోచింగ్ వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ ‘అన్అకాడమీ’ నేటికి పదిలక్షల ఫోలావర్స్ను కూడగట్టుకొని ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో కొత్త రికార్డును సృష్టించింది. రోమన్ సాయిని, గౌరవ్ ముంజాల్ అనే మహానుభావులు ఈ ‘అన్అకాడమీ’ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పిన్న వయస్సులోనే ఉన్నత చదువులు చదివిన వీరిద్దరు బాల్య మిత్రులు. ఇరుగు పొరుగు వారు. ఉన్నత చదువుల్లో తమకెదురైన ఇబ్బందులు, ఇక్కట్లు తోటి విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎదురుకావద్దనే సదుద్దేశంలో ఈ అన్‌అకాడమీని ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ల పేరిట కోట్లాది రూపాయలు దండుకుంటున్న అకాడమీల మీద కోపం, అశాస్త్రీయంగా వారనుసరిస్తున్న బోధనా పద్ధతులపై కోపంతోనే వారిద్దరు తమ ఆన్లైన్ కోచింగ్ సెంటర్‌కు ‘అన్అకాడమీ’ అని పేరు పెట్టారు. ఉన్నత ఉద్యోగస్థులైన వీరు తమ డ్యూటీ కాలాన్ని మినహాయించి, తమ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి కేవలం సామాజిక దృక్ఫథంతో ఈ అన్‌అకాడమీని నడుపుతున్నారు. ఏ రూపంలో కూడా విద్యార్థుల నుంచి నయా పైసా తీసుకోవడం లేదు. రోమన్ సాయిని తన 16వ ఏట ఏమ్స్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై ఎంబీబీఎస్ కోర్సులో చేరాడు. ఆ కోర్సును పూర్తి చేసి డాక్టర్ పట్టా పుచ్చుకొన్నాక తన 23వ ఏట యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్‌లో 18వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ అయిన డాక్టర్లలో అతి పిన్న వయస్కుడు రోమన్ సాయినినే. ఆయన ప్రస్తుతం జబల్పూర్ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక ఆయన బాల్య మిత్రుడు గౌరవ్ ముంజాల్ తాను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచే వెబ్సైట్లను క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఆయన ప్రస్తుతవ ‘ఫ్లాట్ డాట్ టు’ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు, సీఈవో. దేశవ్యాప్తంగా విద్యార్థుల వసతి సౌకర్యాలను చూసే వెబ్సైట్ కంపెనీ ఇది. వీరిద్దరు కలసి 2010లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల శిక్షణ కోసం వీడియోలను రూపొందించారు. వాటిని ఆన్లైన్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు అందించడం కోసం యూట్యూబ్‌ను మాధ్యమంగా వాడుకున్నారు. అందులో భాగంగానే ‘అన్అకాడమీ’ని ఏర్పాటు చేశారు. 2013లో రోమన్ సాయిని ఐఏఎస్ సాధించారు. అప్పుడు తన అనుభవాలతో కూడిన వీడియోలను ఎందుకు పోస్ట్ చేయకూడదనే ఆలోచనతో వాటికి అన్అకాడమీ ద్వారా పోస్ట్ చేశారు. అప్పటి నుంచి యూపీఎస్సీ అభ్యర్థులే లక్ష్యంగా వీడియోల ద్వారా ఆన్లైన్ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రోమన్ 120 వీడియోలను స్వయంగా రూపొందించగా, మరో 60, 70 వీడియోలకు అసిస్టెంట్‌గా సహకారం అందించారు. ఇప్పడు తమ ఆన్లైన్ కోచింగ్ ద్వారా దాదాపు 400 వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయని, వాటిలో సగం రోమన్ రూపొందించినవేనని గౌరవ్ తెలిపారు. విద్యార్థులు ఈ వీడియోలను తమకిష్టమైన సమయంలో ఇష్టమున్న చోట కూర్చొని వీక్షించే వీలుందని ఆయన చెప్పారు. నయాపైసా ఖర్చు లేకుండానే కావాల్సిన జ్ఞానాన్ని సముపార్జించుకునే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా ఈ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మిత్రులతో షేర్ చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కూడా తమ వీడియోలను వినియోగిస్తున్నట్టు తెల్సిందని గౌరవ్ వివరించారు. సబ్ కలెక్టర్‌గా పనిచేస్తూ వీడియోలు తీయడానికి సమయమెలా చిక్కుతుందని రోమన్ సాయిని మీడియా ప్రశ్నించగా, తన ఉద్యోగం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందని, దాదాపు 8 గంటలు వీడియోల మెటీరియల్ కోసం రీసెర్చ్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత శని, ఆదివారాలు గౌరవ్, తాను కలసి వీడియోలను రూపొందిస్తామని తెలిపారు. ఇలా వారానికి రెండు వీడియోలను తీస్తామని చెప్పారు. ఇంతగా పనిచేయడానికి స్ఫూర్తినిచ్చేది ఏమిటని ప్రశ్నించగా, ‘ప్రతి ఏటా దాదాపు ఏడు లక్షల మంది ప్రిలిమనరీ పరీక్షలు రాస్తారు. వారిలో కేవలం లక్ష మందికి మాత్రమే కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్తోమత ఉంటుంది. కొందరు పేదవారైనప్పటీకీ అప్పలు చేసి చదవిస్తారు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో, వారికోసం మేము పనిచేస్తున్నాం. అందులో మాకు ఎంతో తృప్తి ఉంది. తమ అన్అకాడమీ ద్వారా ఎంతోమంది విద్యార్థులు తమ సందేహాలను మాతో తీర్చుకుంటారు. మా వీడియాల ద్వారానే ఐఎఎస్, ఐపీఎస్‌లు సాధించామన్న వారూ ఉన్నారు. అది మాకు సంతృప్తినిచ్చేదే కదా! కెమరాలకే మాకు ఎక్కువ ఖర్చయింది. అదే మా పెట్టుబడి. సమయం కూడా. నేను డాక్టర్ కూడా అయినందున త్వరలో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల కూడా కోచింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం’ అని వివరించారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం యూట్యూబ్, ఫేస్బుక్ లేదా వెబ్సైట్లో ‘అన్అకాడమి’ని సంప్రదించవచ్చు. -
ఆహా..నేహా
- పీహెచ్ కోటాలో నేహాకు సివిల్స్‌లో చాన్స్ - వినికిడి లోపమున్నా జయించిన యువతి - ఐఏఎస్ సాధించడమే లక్ష్యమంటున్న నేహా - సివిల్స్‌లో విశాఖకు 4 ర్యాంకులు సాక్షి, విశాఖపట్నం : సివిల్ సర్వీసెస్ పోస్టులకు యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో విశాఖ నగరానికి నాలుగు మెరుగైన ర్యాంకులు లభించాయి. శనివారం యూపీఎస్సీ ఫలితాలను ప్రకటించింది. రాత్రి వరకూ లభించిన వివరాల మేరకు నలుగురికి మంచి ర్యాంకులు వచ్చాయి. నగరంలోని డిక్లో సివిల్స్ శిక్షణ పొందిన డాక్టర్ అభినవ్ భిట్టాకు 825, డాక్టర్ వెంకటేశ్‌కు 844, జి.నాగసతీష్‌కు 1088 ర్యాంకు లభించాయని ఆ సంస్థ డైరక్టర్ కృష్ణ వెల్లడించారు. అయితే ఎక్కడా కోచింగ్ లేకుండానే కూర్మన్నపాలేనికి చెందిన ఎస్బీఐ ఉద్యోగిని నేహా వీరవల్లికి 1221 ర్యాంకు సాధించారు. పీహెచ్ కోటాలో ఐఏఎస్‌ను ఆమె ఆశిస్తున్నారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం: ఐఏఎస్... సమాజానికి సేవ చేయడానికే కాదు పేరుప్రతిష్టలకూ కొదవలేని ఉద్యోగం ఇది! దీని కోసం కల కనడమే కాదు... దాన్ని సాకారం చేసుకోవడానికి చదువునే తారకమంత్రం చేసుకున్నారు నేహా వీరవల్లి! చిన్న వయసులోనే బ్రెయిన్ ఫీవర్ దాడి చేసి వినికిడి శక్తిని లాగేసుకున్నా ఆమె అధైర్యపడలేదు. పుస్తకాలు, పత్రికలతో కుస్తీ పట్టి విధికే సవాలు విసిరారు. 22 ఏళ్ల వయసుకే సివిల్స్‌లో 1221 ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఒకవైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రోజుల్లో ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. ‘కేవలం పుస్తకాలను బట్టీ పట్టేస్తేనే ఫలితం సాధించలేం. సమాజాన్ని అవగాహన చేసుకుంటూ విద్యను దానికి అన్వయం చేసినప్పుడే సివిల్స్ గోల్ సాధన సులువవుతుంది. చిన్నప్పటి నుంచి పేపర్ రీడింగ్, పత్రికలకు వ్యాసాల రచన, మనోవికాస పుస్తకాల పఠనం నాకెంతో ఉపయోగపడ్డాయి’ అని చెప్పారు నేహా. శనివారం సివిల్స్ ఫలితాల నేపథ్యంలో ‘సాక్షి’ ఆమెను పలుకరించింది. ఆమె తల్లి శిరీష సహాయంతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘సివిల్స్... అందులోనూ ఐఏఎస్ అధికారి కావడమంటే నాకు చిన్నప్పటి నుంచి క్రేజ్. ఏళ్ల తరబడి హైదరాబాద్, ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడుతున్నవారికే సాధ్యం కావట్లేదు... వినికిడి సమస్య ఉన్న మీ అమ్మాయికి సాధ్యమా? అని చాలామంది మా అమ్మానాన్నలతో అనేవారు. వారెప్పుడు ఆ మాటలను పట్టించుకోలేదు. నాన్న శశికుమార్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. అమ్మ శిరీష ఇంటర్ వరకే చదువుకున్నారు. లక్ష్య సాధనలో అమ్మ సహకారం ఎంతో ఉంది. నా లక్ష్యం ఏమిటో అర్థం చేసుకొని ఆ దిశగానే ప్రోత్సహించారు. తమ్ముడు అనూజ్ మాత్రం ఇంజనీరింగ్ లక్ష్యంతో ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. ప్లస్2 వరకూ స్టీల్‌ప్లాంట్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే చదివా. గాజువాకలోని ఎంవీఆర్ కాలేజీలో బీఎస్సీలో చేరా. ఒకవైపు పాఠాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూనే సివిల్స్ సాధనకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ పట్టు సాధించా. డిగ్రీ సెకండియర్‌లో ఉండగానే ఎస్బీఐలో క్లరికల్ ఎగ్జామ్‌కు హాజరయ్యా. బ్యాంకు ఉద్యోగాలు వరుస కట్టాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని నింపింది. డిగ్రీ పూర్తి కాగానే ఎస్బీఐ స్టీల్‌ప్లాంట్ శాఖలో ఉద్యోగంలో చేరా. అలాగని సివిల్స్‌ను మరచిపోలేదు. 2013లో తొలి ప్రయత్నం చేశా. ఇంటర్వ్యూ వరకూ వెళ్లగలిగినా 16 మార్కులు తేడాతో సర్వీసు రాలేదు. అయినా పట్టు వదలకుండా రెండో ప్రయత్నంలో ప్రయత్నించా. 1221 ర్యాంకు వచ్చింది. పీహెచ్ కోటాలో ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఒకవేళ మరేదైనా సర్వీసు వచ్చినా ఐఏఎస్ వచ్చేవరకూ విశ్రమించను. బ్రెయిన్ ఫీవర్ వల్లే సమస్య...: నేను సెకెండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఫీవర్ (మెనిజైటిస్) వచ్చింది. మెదడుపై ఇది తీవ్ర ప్రభావం చూపించడం వల్ల వినికిడి శక్తి పోయింది. అది తీరని లోటే అయినా సమస్యగా ఏనాడూ నేను భావించలేదు. తోటి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోనని నిరూపించేందుకు ప్రతి నిమిషం తపించా. పాఠాలు చదువుకుంటూ నోట్స్ రాసుకునేదాన్ని. దినపత్రికల్లో వచ్చే వ్యాసాలను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యేదాన్ని. ఆర్టికల్స్ రాసేదాన్ని. అలా రైటింగ్ స్కిల్స్ పెంచుకున్నా. సివిల్స్ మెయిన్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా ఆప్షన్స్. ఇంటర్వ్యూ కూడా బాగా చేశా. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం ఉపయోగపడింది.’ -
ముగ్గురు ఐఏఎస్‌ల తల్లి.. చదివింది ఎనిమిదే!!
మాయాదేవి.. ఆమె చదివింది కేవలం 8వ తరగతి వరకు మాత్రమే. కానీ తండ్రిలేని ముగ్గురు బిడ్డలను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దింది. బిడ్డల తండ్రి ఓ సామాన్య రైతు. ఆయన కూడా పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే మరణించాడు. అయినా.. ఆ తల్లికి మాత్రం తన బిడ్డలను ఐఏఎస్ అధికారులుగా చూడాలన్న తపన ఏమాత్రం తగ్గలేదు. ఉన్న ముగ్గురు బిడ్డల్లో ఎవరో ఒకరిద్దరిని కాదు.. మొత్తం ముగ్గురినీ ఆ స్థాయిలోనే చూడాలని గట్టిగా పట్టుబట్టింది. ఎంతగా అంటే, పెద్ద కూతురు ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ఎక్కడో రాజస్థాన్‌లోని మారుమూల గ్రామంలో నివాసం ఉండే మాయాదేవి.. జీవితంలో తాను ఎంత కష్టాలు పడినా.. తన బిడ్డలను మాత్రం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి పంపింది. ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే తనంత అదృష్టవంతురాలు, సంతోషకరమైన తల్లి మరొకరు లేరని భావిస్తోంది. ఆమె పెద్దకుమార్తె క్రాంతి ఇప్పటికే యూపీఎస్సీ పరీక్షలు పాసై.. ముంబైలో ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కుమారుడు లోక్‌బంధు, రెండో కుమార్తె పూజ కూడా తాజాగా యూపీఎస్సీ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో తాను కన్న కలలు నిజమయ్యాయని, బిడ్డలు ముగ్గురూ ఉన్నత స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని ఆమె చెబుతోంది.