యూపీఎస్‌సీ పరీక్షలకు ముందస్తు ఏర్పాట్లు
Published Sat, Jul 23 2016 11:53 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM
ఆగస్టు 7న పరీక్ష నిర్వహణ
నగరంలో 28 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
విజయవాడ :
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను విజయవాడలో నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాబు. ఏ పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 7న విజయవాడ కేంద్రంలో 28 సబ్‌సెంటర్లలో పరీక్ష జరుగుతుందని చెప్పారు. క్యాంపు కార్యాలయం హాలును కంట్రోల్ రూంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరీక్షలలో ఎటువంటి మాల్‌ప్రాక్టీసుకు అవకాశం లేకుండా సూపర్ వైజర్ల పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కల్టెర్ గంధం చంద్రడు మాట్లాడుతూ యూపీఎస్‌సీ జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను పాటించాలన్నారు. 7న ఆదివారం పేపర్–1పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహిస్తారని చెప్పారు. పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందన్నారు. సూపర్ వైజర్లు, అసిస్టెంట్ సూపర్ వైజర్లతోపాటు రాష్ట్రం నుండి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు, యూపీఎస్‌సీ తరుపున ఒక పర్యవేక్షకులు విజయవాడ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. విజయవాడలో ఏర్పాౖటెన కంట్రోల్ రూంను జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద జిల్లా వైద్య, ఆరోగ్య, శాఖ ౖÐð ద్య చికిత్స కేంద్రాలను ఏర్పాటు చే యాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్ధులకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే వారికి తగిన బస్సు సౌకర్యం కల్పించేలా ఆర్టీసీ అధికారులకు తగు సూచనలు జారీ చేశామన్నారు. జేసీ పవర్‌పాయంట్ ప్రజంటేషన్ ద్వారా పరీక్ష నిర్వహణపై సమగ్రంగా వివరించారు. నూజివీడు సబ్–కలెక్టర్ డాక్టర్ జి. లక్షీశ, అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, ఆర్‌డీవోలు సాయిబాబా, చక్రపాణి, డీఈవో సబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement