‘ఎంసెట్’లో ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి
‘ఎంసెట్’లో ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి
Published Thu, Jul 28 2016 3:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, లీకేజీ బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వం మొదట్నుంచీ బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ఎంసెట్-2 లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
Advertisement
Advertisement