
పంట రుణాలు మాఫీ చేయండి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట రుణాల మాఫీ విషయం ఇంకా కొలిక్కి రాలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు. రైతుల అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంటలకే పరిమితం చేశారన్నారు. జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో పంట రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.