సాక్షి, హైదరాబాద్: రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎంగా కేసీఆర్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారని ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల, ఆందోళనల, అవినీతి తెలంగాణగా మార్చారని ఆరోపించారు. మంత్రులే తమ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment