పంజాబ్ నేషనల్ బ్యాంక్ మే 1వ తేదీ నుంచి కస్టమర్ల ఖాతాలలో తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఏటీఎం ట్రాన్సాక‌్షన్ ఫెయిలైతే ఆ లావాదేవీకి రూ.10 చొప్పున పెనాల్టీ ఛార్జీని బ్యాంక్ విధంచనుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో ఈ కొత్త నియమాన్ని ప్రకటించింది. అలాగే ఛార్జీల గురించి కస్టమర్‌లకు తెలియజేయడానికి ఎస్సెమ్మెస్‌లు పంపడం ప్రారంభించింది.
అయితే ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం ట్రాన్సాక‌్షన్ విఫలమైతే ఆ సమస్యను పరిష్కరించడానికి పీఎన్‌బీ మార్గదర్శకాలను రూపొందించింది. విఫలమైన ఏటీఎం ట్రాన్సాక‌్షన్ గురించి కస్టమర్‌లు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన ఏడు రోజుల్లో బ్యాంక్ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఒక వేళ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైతే కస్టమర్లకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం అందుతుంది.
ఏటీఎం ట్రాన్సాక‌్షన్ విఫలమైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ల తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌లు 1800180222 లేదా 18001032222 ద్వారా కస్టమర్ రిలేషన్‌షిప్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. కాగా మే 1 నుంచి అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10తోపాటు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు బ్యాంక్ ఇదివరకే సమాచారం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment