![PM Modi At G20 Foreign Ministers Meet Global Governance Failed - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/2/PMMODI.jpg.webp?itok=hTX23hya)
ఉక్రెయిన్‌లోని రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా జీ20 విదేశాంగ మంత్రులు సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ఈ జీ20 సమావేశాలు భారత అధ్యక్ష హోదాలో ఢిల్లీలోని హరియానాలో గురుగ్రామ్ వేదికగా మార్చి1 నుంచి 4వ వరకు జరగనున్నాయి. ఈ మేరకు జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ.. "ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విపలమయ్యాయన్నారు. అంతేగాదు ప్రస్తుతం ప్రపంచ స్థాయి సంస్థలు సంక్షోభంలో ఉన్నాయనే దానిని మనందరం గుర్తించాలి.
దీనికి ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, మహమ్మారీ, ఉగ్రవాదం, యుద్ధాలే నిదర్శనమని, అందువల్లే ప్రపంచ పాలన వైఫల్యం చెందిందని స్పష్టంగా తెలుస్తోంది. సంవత్సరాల పురోగతి తర్వాత సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల కోసం మనం మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదంలో ఉన్నాం. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధన భద్రతను కల్పించడం కోసం భరించలేని అప్పులతో సతమతమవుతున్నాయి. అలాగే ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఈ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అందుకే భారత్ దక్షిణాది గళం వినిపించేందుకే యత్నిస్తోంది.
మనమంతా ప్రపంచ విభజన సమయంలో కలుస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలపై సాముహికంగా పరిష్కారాన్ని కనుగొనాలి. అలాగే ఈ సమావేశంలో పాల్గొనని వారిపట్ల కూడా మాకు బాధ్యత ఉంది. మన కలిసి చేయగలిగిన వాటిల్లోకి పరిష్కరించలేని సమస్యలను తీసుకురాకూడదు. తమ చర్యలతో ప్రభావితమైన దేశాల మాట వినకుండా ఏ దేశం లీడర్‌షిప్‌ను సాధించలేదు. మనల్ని ఏకం చేస్తున్న వాటిపై దృష్టి సారించాలి గానీ విభజించే వాటిపై కాదని" సదస్సులో ప్రదాని మోదీనొక్కి చెప్పారు.
కాగా, రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్‌లో జరుగుతున్న ఈ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో దాదాపు 40 మంత్రి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో జీ20 సభ్య దేశాల తోపాటు బంగ్లాదేశ్, ఈ జిప్ట్, నెదర్లాండ్స, మారిషస్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోసహా తొమ్మిది అతిథి దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు సమాచారం.
(చదవండి: బిల్‌గేట్స్‌తో సమావేశం వండర్‌ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు! కేంద్ర ఆరోగ్య మంత్రి)
Comments
Please login to add a commentAdd a comment