
న్యూఢిల్లీ: ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష(క్లాట్)ను మరోసారి నిర్వహించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న క్లాట్ తొలిదశ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. క్లాట్ పరీక్షలో సాంకేతిక సమస్యల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు జూన్ 15లోగా ఓ పరిష్కారాన్ని కనుగొనాలని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్(ఎన్‌యూఏఎల్‌ఎస్) ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఆదేశించింది. దేశంలోని 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 13న ఎన్‌యూఏఎల్‌ఎస్ క్లాట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు 6,000 మంది విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment