refuses
-
ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లాదేశ్ హైకోర్టు నో
ఢాకా: బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బంగ్లాదేశ్ హైకోర్టు గురువారం కొట్టేసింది. దేశద్రోహం ఆరోపణలపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్, తదనంతర పరిణామాలపై వార్తపత్రికల్లో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ మునీరుద్దీన్ సమరి్పంచిన్పటికీ హైకోర్టు ఇస్కాన్‌పై నిషేధానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయవాది మొనియుజ్జమాన్ తదితరులు దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ ఫరా మొహబూబ్, జస్టిస్ దెబాశిష్ రాయ్ చౌదరీల హైకోర్టు ధర్మాసనం విచారించింది. కృష్ణదాస్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్న సమయంలో ఛట్టోగ్రామ్లో జరిగిన ఘర్షణలు, గాయపడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) సైఫుల్ ఇస్లాం మరణం తదితరాలను ప్రభుత్వ లాయర్లు ప్రస్తావించారు. ఇస్కాన్ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణలు, వేర్వేరు ప్రాంతాల్లో మైనారిటీ హిందువులపై దాడులకు సంబంధించిన నివేదికను అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాన్ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు ఇస్కాన్‌పై నిషేధం అక్కర్లేదని తేల్చిచెప్పింది. ‘‘ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేస్తూ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’’అని జడ్జి మహబూబ్ అన్నారు. పీపీ హత్య, ఇస్కాన్ ఆగడాలలతో 33 మందిని అరెస్ట్చేశామని, ఈ నేపథ్యంలో ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ అదనపు అటార్నీ జనరల్ అనీక్ ఆర్ హఖ్, డిప్యూటీ అటార్నీ జనరల్ అసదుద్దీన్ చేసిన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ‘‘శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణగా నిలబడాలి’అని కోర్టు ఆదేశించింది. తీర్పును ఇస్కాన్ బంగ్లాదేశ్ స్వాగతించింది. ‘‘మత, సంక్షోభానికి దారితీసే ఎలాంటి కార్యకలాపాల్లో ఇస్కాన్ బంగ్లాదేశ్ భాగస్వామిగా లేదు. ఐక్యత, మత సామరస్యం గురించి మాత్రమే ఇస్కాన్ ప్రభోదిస్తుంది. తాజా ఘటనలతో ఇస్కాన్‌కు ముడిపెడుతూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మా సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇతరులు చేస్తున్న కుట్ర ఇది’’అని ఇస్కాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు సత్యరంజన్ బారోయీ, ప్రధాన కార్యదర్శి చారుచంద్ర దాస్ బ్రహ్మచారి మీడియా సమావేశంలో అన్నారు. మరోవైపు కృష్ణదాస్‌ను వెంటనే విడుదలచేయాలని ఢిల్లీలో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా డిమాండ్‌చేశారు. తీర్పును నిరసిస్తూ మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాయర్ల విభాగమైన జాతీయతాబాది అయిన్జిబీ ఫోరమ్ సభ్యులు గురువారం సుప్రీంకోర్టు బార్ వద్ద ఆందోళనకు దిగారు. -
Supreme Court: ‘నీట్’ కౌన్సెలింగ్ రద్దు కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ కౌన్సెలింగ్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ, పేపర్ లీక్, మూల్యాంకనంలో వ్యత్యాసాలపై దాఖలైన పలు పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. నీట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ పిటిషన్లపై తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కోరారు. గ్రేసు మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించనున్న పరీక్షపై స్టే ఇవ్వాలని మరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. గ్రేసు మార్కులు పొందిన అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించే పరీక్షతోపాటు వచ్చే నెల 6న జరిగే కౌన్సెలింగ్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. అడ్మిషన్ల ప్రక్రియ తుది తీర్పునకు లోబడే ఉంటుందని వ్యాఖ్యానించింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు ఈ పిటిషన్లను జత చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. వేర్వేరు హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఎన్టీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీం నోటీసులిచ్చింది. హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్నపిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయా హైకోర్టుల్లో విచారణలపై స్టే విధించింది. -
ఎంతటి దుర్భర పరిస్థితి? చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులోనూ తప్పని నిరాశ
దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపుతో అగ్రస్థానానికి ఎదిగి సంచలనం సృష్టించిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ కుంభకోణంలో ఇరుక్కుని కేసులను ఎదుర్కొంటూ తన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ సుప్రీం కోర్టులోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. బ్యాంకు నుంచి తన పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి చందా కొచ్చర్ దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు డిసెంబర్ 8న నిరాకరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చందా కొచ్చర్ గతంలో బాంబే హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేయగా డివిజన్ బెంచ్ తిరస్కరించింది. తాజాగా ఆ డివిజన్ బెంచ్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కొచ్చర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు తీర్పు అన్యాయమని, బ్యాంకు మొదట్లో కొచ్చర్‌కు రిటైర్మెంట్ ప్రయోజనాలను అందించేందుకు అంగీకరించి తర్వాత వెనక్కితీసుకుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ ఏడాది మే నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలను కోరుతూ ఆమె చేసిన మధ్యంతర దరఖాస్తును తిరస్కరించిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవి నుంచి చందా కొచ్చర్ తొలగింపును సమర్థించిన బాంబే హైకోర్టు దీనిపై ఆమె వేసిన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఆమె వేసిన మధ్యంతర పిటిషన్‌ను గతేడాది నవంబర్‌లో కొట్టేసింది. 2018లో ఆమె దక్కించుకున్న 6.90 లక్షల షేర్లతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2018 మేలో తనపై విచారణ ప్రారంభం కాగానే చందా కొచ్చర్ సెలవుపై వెళ్లిపోయారు. ఆ తరువాత ముందస్తు రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆమోదించిన ఐసీఐసీఐ బ్యాంక్ టెర్మినేషన్ ఫర్ కాజ్'గా పరిగణించి ఆర్బీఐ నుంచి అనుమతి కూడా కోరినట్లు తెలిపింది. కాగా 2019 జనవరిలో దాఖలు చేసిన చార్జిషీట్లో చందా కొచ్ఛర్ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిందని సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు తరువాత నిరర్థక ఆస్తులుగా మారాయని, ఫలితంగా బ్యాంకుకు తప్పుడు నష్టం, రుణగ్రహీతకు, నిందితులకు తప్పుడు లాభం కలిగిందని సీబీఐ అభియోగం మోపిన సంగతి తెలిసిందే. -
3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ కూడా ఉద్యోగాల తీసివేతకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. జెట్ ఇంజిన్ల తయారీదారు రోల్స్ రాయిస్ ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది ఉద్యోగులను తొలగిస్తోందని వార్త మీడియాలో పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే కంపెనీ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. టైమ్స్ నివేదికల ప్రకారం లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 3,000 మంది నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా ఈ తొలగింపులను చేపట్టనుంది. వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్వహణ మార్పులతో సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఇటీవల రోల్స్ రాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టుఫాన్ ఎర్గిన్బిల్జిక్ ప్రకటించారని కూడా నివేదించింది. రోల్స్ సివిల్ ఏరోస్పేస్, మిలిటరీ ,పవర్ సిస్టమ్స్ విభాగాల తయారీయేతర వ్యాపారాలను కలపాలని కార్పొరేషన్ భావిస్తోందన్న అంచనాలు వెలువడ్డాయి. అవన్నీ ఊహాగానాలే: రోల్స్ రాయిస్ అయితే ఈ వార్తలను బ్రిటీష్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల కోతల వార్తలన్నీ ఊహాగానాలేనని ఈ సందర్బంగా ది సండే టైమ్స్ క్లెయిమ్‌లను కంపెనీ తోసిపుచ్చింది. దీర్గకాల సక్సెస్, ఉద్యోగుల శ్రేయస్సే తమ ప్రాధాన్యత అని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా ప్రపంచవ్యాప్త విమానయాన పరిశ్రమ విడి భాగాలు, నిపుణుల కొరతతో ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది, అలాగే విమాన ఇంజిన్లకు టైటానియం వంటి పదార్థాలను సరఫరా చేసే రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతోంది. -
బాంబే హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు!
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. డిసెంబర్ 2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ బీజేపీ సభ్యుడు దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ మమతా బెనర్జీ దాఖలు చేసిన అప్పీల్‌ను బాంబే హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ ఏడాది జనవరిలో గతంతో జారీ చేసిన సమన్లను పక్కకు పెట్టి, మమతాపై మళ్లీ కొత్తగా విచారణ ప్రారంభించాలని మేజిస్ట్రేట్ కోర్టును సెషన్స్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సెషన్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై. జస్టిస్ అమిత్ బోర్కర్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం స్పందిస్తూ.. మెరిట్‌లపై ఫిర్యాదును నిర్ణయించకుండా సెషన్స్ జడ్జి అనుసరించిన విధానం, విచారణకు తిరిగి మేజిస్ట్రేట్‌కు పంపడం సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఉంది. కావున ప్రస్తుత కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసర లేదు’ అని పేర్కొన్నారు. కాగా 2022లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు మమతాపై చర్య తీసుకోవాలని కోరుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముంబై యూనిట్ ఆఫీస్ బేరర్ వివేకానంద్ గుప్తా మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో గుప్తా..మమతా బెనర్జీ 2021 మార్చిలో ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో లేచి నిలిబడలేదని పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని మమత అవమానించారని ఆయన ఆరోపించారు. సీఎం బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీస్టేషన్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌తో కూడిన డీవీడీని కోర్టుకు సమర్పించారు. ఐతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గుప్తా మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న మెజిస్ట్రేట్ కోర్టు మమతాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో జనవరి 2023లో సెషన్‌కోర్టు న్యాయమూర్తి ఆర్కే రోకడే మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేసి, ఫిర్యాదు మళ్లీ పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాగా మమతా ప్రత్యేక కోర్టు సవాలు చేస్తూ.. సమన్లు రద్దు చేసి, తిరిగి విచారణకు పంపించే బదులు మొత్తం ఫిర్యాదును రద్దు చేయాల్సిందిగా హైకోర్టుని ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేశారు. అందుకు హైకోర్టు నిరాకరిస్తూ..పిటీషన్‌ను కొట్టేసింది. (చదవండి: ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం) -
జనాభా నియంత్రణ మా పని కాదు
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి ‘ఇద్దరు పిల్లల’ విధానాన్ని తప్పనిసరి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమని జస్టిస్ ఎస్.ఎ.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకాల ధర్మాసనం వెల్లడించింది. జనాభా పెరుగుదల అనేది ఏదో ఒక మంచి రోజున ఆగిపోయే వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలో జనాభా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరికొందరు వేసిన పిటిషన్లపై సైతం శుక్రవారం దృష్టి సారించింది. జనాభా నియంత్రణ తమ పని కాదని, దానికంటే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. జనాభాను అరికట్టడానికి తాము చట్టాన్ని తీసుకురాలేమని ఉద్ఘాటించింది. వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సూచించింది. -
రిసెప్షనిస్టు హత్య కేసు: అంత్యక్రియలకు ససేమిరా! అంటున్న తల్లిదండ్రులు
Receptionist Murder Case:ఉత్తరాఖండ్‌లోని 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్య కేసు పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హ్యత కేసులో బీజీపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు కూడా. ఆ తర్వాత బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు శనివారం చిల్లా కాలువా నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాదు ఈ కేసుకి సంబంధించి ఆమె వాట్సాప్ చాట్లపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా అంకితా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వాహించేందుకు నిరాకరించారు. ఆమె పోస్ట్‌మార్టం రిపోర్టు అప్పగించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబట్టారు. ఐతే నిందితుల ఇలాంటి తప్పలు చేసేందుకు భయపడేలా వారి రిసార్టును కూల్చివేయాల్సిందిగా సీఎం ధామీ పుష్కర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయమై అంకితా తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిసార్ట్ కూల్చివేతతో కీలక ఆధారాలు మాయమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇలా ఎందుకు చేశారంటూ...ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు డీఐజీ మాట్లాడుతూ...రిసార్ట్‌లో పని చేస్తున్న ప్రతి ఉద్యోగిని విచారించాం. ప్రతి ఒక్కరి నుంచి వాగ్మూలం తీసుకుంటున్నాం. రిసార్ట్ నేపథ్యంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. అలాగే వెలుగులోకి వచ్చిన సదరు బాధితురాలు అంకితా భండారీ వాట్సాప్‌లను కూడా పరీశీలిస్తున్నాం. అయినా మాకు ఇంకా పోస్ట్‌మార్టం నివేదిక అందలేదు. తొందరలోనే అందే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. అని అన్నారు. అయితే అంకితా కుటుంబీకులు మాత్రం అంత్యక్రియలు చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేగాదు ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారించాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. (చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కీలక విషయాలు..) -
NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టే సింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష ఈ నెల 21న జరగనుంది. అప్పుడే నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు. -
టీడీపీ నేత అశోక్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు
-
గ్రామపెద్ద సరేనంటేనే క్షవరం
సాక్షి, యశవంతపుర: దళితులకు క్షవరం చేయబోమనడంతో గొడవ ఏర్పడింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా ధళెహళె గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఇప్పటికీ అంటరానితనం దురాచారం అమలవుతోంది. ఓ క్షౌరశాలలో క్షవరం కోసం కొందరు దళితులు రాగా, క్షురకుడు అన్నప్ప గ్రామ పెద్ద సరేనంటే మీకు క్షవరం చేస్తానని చెప్పాడు. మాకు ఎందుకు క్షవరం చేయవు అని దళిత యువకులు ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో శనివారం చర్చనీయాంశమైంది. సంఘటనపై జిల్లాస్థాయి అధికారులు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో దళితులను ఆలయాల్లోకి అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
అలా ఆదేశాలివ్వలేం..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై అధికారులు జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించకుండా ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని ముందస్తుగా ప్లాన్ వేసుకుని చేసే అవకాశం ఉందని, అలాంటప్పుడు అధికారులకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఎన్ఎస్ఏ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలు, ఢిల్లీలో ఎన్ఎస్ఏ ప్రయోగించకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒకవేళ ఆదేశిస్తే.. వ్యవస్థ గందరగోళంగా తయారవుతుందని అభిప్రాయపడింది. హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోండి సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలు, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటం పేరుతో హింసకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని 154 మంది ప్రముఖులతో కూడిన బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. కొన్ని రాజకీయ శక్తులు హింసాయుత నిరసనకారులకు సహాయం చేస్తున్నారని బృందానికి నేతృత్వం వహించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) చైర్మన్ జస్టిస్ పెర్మాడ్ కోహ్లి ఆరోపించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తుల పట్ల ఆందోళనచెందుతున్నామన్నారు. రాష్ట్రపతికి సమర్పించిన మెమొరాండంపై 11 మంది హైకోర్టు జడ్జిలు, 72 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 56 మంది రక్షణ శాఖ మాజీ ఉన్నతాధికారులు, మేధావులు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు సంతకాలు చేశారు. -
సీఏఏపై స్టేకి సుప్రీంకోర్టు నో
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం వాదన వినకుండా ఈ చట్టంపై స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. అలాగే, సీఏఏకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందించేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి నాలుగు వారాల గడువునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లను పరిశీలించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యుల «రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. అదే సమయంలో.. సీఏఏపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరపరాదంటూ అన్ని హైకోర్టులనూ ఆదేశించింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ అమలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లు అందులో కోరారు. ఈ చట్టానికి అనుకూలంగా కూడా కొందరు పిటిషన్లు వేశారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీఏఏ అమలుపై స్టే విధించాలనీ, ఎన్పీఆర్ను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే సీఏఏపైనా, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) అమలుపైనా దాఖలైన అన్ని పిటిషన్లను నాలుగు వారాల అనంతరం విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. అదికూడా కేంద్రం ప్రతిస్పందన అనంతరమేనని తేల్చి చెప్పింది. అస్సాం, త్రిపురలకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ‘సీఏఏ విషయంలో అస్సాం పరిస్థితి భిన్నమైంది. అస్సాంలో గతంలో పౌరసత్వానికి కటాఫ్ మార్చి 24, 1971 అయితే, సీఏఏ తర్వాత ఇది డిసెంబర్ 31, 2014’కి పొడిగించారు’అని ధర్మాసనం పేర్కొంది. సీఏఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లలో 60 కాపీలు మాత్రమే ప్రభుత్వానికి అందినట్లు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. మిగిలిన అన్ని అభ్యర్థనలపై స్పందించేందుకు సమయం కావాలని ఆయన కోరారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, ఆర్జేడీ నాయకులు మనోజ్ షా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా మోయిత్రా, జమైత్ ఉలేమా–ఇ– హింద్, ఏఐఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఒవైసీ సహా అనేక మంది సీఏఏని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. -
మేము జోక్యం చేసుకోలేం
న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అందువల్ల తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎన్నిక ముగిసిపోయిన తర్వాత కావాలంటే గుజరాత్ కాంగ్రెస్ శాఖ ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను కల్పించింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో గుజరాత్లో రెండు రాజ్య సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయిలతో కూడిన వెకేషన్ బెంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుకి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం ఉండదని తెలిపింది. ‘ఈ విషయంలో ప్రాథమిక హక్కులకు ఏ విధంగా భంగం కలిగింది ? ఎన్నికల్లో పోటీ చేయడం ఎవరికైనా చట్టబద్ధంగా వచ్చిన హక్కు. మీరు అవసరం అనుకుంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోండి’ అని న్యాయమూర్తులు గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు పరేశ్‌భాయ్ ధనాని దాఖలు చేసిన పిటిషన్ తరఫున వాదించడానికి కోర్టుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ వివేక్ టాంఖాకు సలహా ఇచ్చారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 100 స్థానాలుంటే, కాంగ్రెస్‌కు 75 ఉన్నాయి. రాజ్యసభకు నామినేషన్ వేసిన జైశంకర్ గాంధీనగర్: విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ స్థానానికి మంగళవారం నామినేషన్ దాఖలుచేశారు. జై శంకర్ సోమవారమే బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. జైశంకర్‌తోపాటు గుజరాత్ బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జుగల్జీ ఠాకూర్ గుజరాత్ రాజ్యసభ మరో స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికకావడంతో రెండు రాజ్యసభ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. -
జెట్‌పై బ్యాంకుల కసరత్తు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్ ఎయిర్వేస్పై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జెట్‌ను పునరుద్ధరించేందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇంకా ఏ ప్రణాళికా ఖరారు కాలేదు‘ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మరోవైపు, జెట్‌కు రుణాలిచ్చిన సంస్థల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్‌తో కూడా భేటీ అయ్యారు. రూ.8,000 కోట్ల పైగా రుణభారం ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కంపెనీ 123 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 5కు పడిపోయింది. సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్.. డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. రుణాలిచ్చిన బ్యాంకులు.. కంపెనీ యాజమాన్య అధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థకు అత్యవసరంగా రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూర్చేలా ప్రతిపాదనలు చేశాయి. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ కూడా ఆహ్వానించాయి. దీంతో కంపెనీలో వాటాలు దక్కించుకునేందుకు నరేష్ గోయల్ కూడా బిడ్ వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బిడ్డింగ్‌లో పాల్గొనరాదని ఆయన నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. సంక్షోభంపై కేంద్రం సమీక్ష... జెట్ ఎయిర్వేస్ సంక్షోభం, పెరుగుతున్న విమాన చార్జీలు, ఫ్లయిట్స్ రద్దు తదితర అంశాలపై సమీక్ష జరపాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల భద్రత, హక్కులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు. జెట్ వివాదంపై సమీక్షకు ఆదేశించినట్లు ప్రభు ప్రకటించడం వారం రోజుల్లో ఇది రెండోసారి. తక్షణ సాయం కోసం నిధులు అందించాలంటూ బ్యాంకులను జెట్ ఎయిర్వేస్ కోరినట్లు ఖరోలా తెలిపారు. సంస్థ ప్రస్తుతం అయిదు విమానాలు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 10 రూట్లలో చార్జీల తగ్గింపుపై డీజీసీఏ దృష్టి జెట్ ఎయిర్వేస్ ఫ్లయిట్స్ రద్దు నేపథ్యంలో చార్జీలను రోజువారీ సమీక్షించడం కొనసాగుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి తెలిపారు. అలాగే, సత్వరం తగు చర్యలు తీసుకునేందుకు ఎయిర్‌లైన్స్‌తో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు. ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో .. రద్దీ ఎక్కువగా ఉండే 40 రూట్లలో చార్జీలు సమీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. పది రూట్లలో చార్జీలు 10–30 శాతం దాకా పెరిగాయని గుర్తించినట్లు .. వాటిని సముచిత స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్స్‌కు సూచించినట్లు ఖరోలా చెప్పారు. ఏప్రిల్ 18న విమానయాన సంస్థలు, విమానాశ్రయాల ప్రతినిధులతో పౌర విమానయాన శాఖ సమావేశం కానున్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. మంగళవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో సుమారు 8 శాతం మేర క్షీణించి రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు ససేమిరా
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చేసిన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేధింపుల కేసులో నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వొద్దనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల్లో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. 2018 మార్చి 20వ తేదీన ఎస్సీ, ఎస్టీ చట్టంలో సుప్రీంకోర్టు సవరణలు చేసింది. ఈ సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని పునర్ నియమించాలని సూచించింది. ఈ పిటిషన్లపై విచారణకు జస్టిస్ యూయూ లలిత్‌ను చేర్చి తిరిగి ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది. గతేడాది ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ లలిత్ భాగమైనందున ఆయనను ఇందులో చేర్చాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ అరెస్టులను నిలువరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
అయోధ్యపై సత్వర విచారణకు నో
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసును సత్వరమే చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును సత్వరమే విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై విచారణను జనవరిలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సత్వర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. అయోధ్య భూవివాదం విషయంలో సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ అఖిల భారత్ హిందు మహాసభ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘అయోధ్య వివాదం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్పీళ్లన్నీ జనవరిలో ధర్మాసనం ముందుకు రానున్నాయి. అప్పటి వరకు సత్వర విచారణ చేపట్టలేం’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. అయోధ్య అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని సుప్రీంను కోరారు. ఇక అఖిల భారత్ హిందూ మహాసభ తరఫున లాయర్ బరుణ్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు. -
పవర్ కంపెనీలకు భారీ షాక్
అలహాబాద్ హైకోర్టు పవర్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఎన్‌పీఐలపై ఆర్బీఐ చర్యలపై మధ్యంతర ఊరటనిచ్చేందుకు సోమవారం నిరాకరించింది. ఈ తీర్పుతో దాదాపు 60కిపైగా దిగ్గజ కంపెనీలను భారీగా ప్రభావితం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌ను సమర్ధించిన కోర్టు ప్రధానంగా విద్యుత్ సంస్థలకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. ఆర్బీఐ మంజూరు చేసిన 180 గ్రేస్ పీరియడ్(ఆరునెలలు) నేటితో ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. భారీగా రుణ పడిన సంస్థలు చెల్లింపులను ఆలస్యం చేస్తే వెంటనే చర్యల్నిప్రారంభించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకసర్క్యులర్ జారీ చేసింది. రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. దీనిపై కొన్ని విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో దివాలా పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు (మంగళవారం) వాదనలు జరగనున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ హ్యారీ డౌల్ చెప్పారు. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు ఐబీసీ క్రింద చర్యల్ని ప్రారంభిస్తాయనీ, అలాగే కంపెనీలు స్వతంత్రంగా పై కోర్టుకు అప్పీల్ చేయవచ్చని ఆయన చెప్పారు. నిరర్దక ఆస్తుల వ్యవహారంలో ఆర్బీఐ సర్క్యులర్‌ను అనుసరించాల్సి ఉంటుందని యుకో బ్యాంకు వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులు ఇపుడు దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు.. విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు దాదాపు 1.74 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. -
అతని ట్రాన్స్ఫర్ వారికి కన్నీళ్లు తెప్పించింది!
-
ఎయిర్‌లైన్స్ దురాగతంపై నెటిజన్ల మండిపాటు
-
సింగపూర్ ఎయిర్‌లైన్స్ అమానవీయం
విమాన ప్రయాణంలో భారత సంతతికి చెందిన ఓ జంటకు తీరని అవమానం జరిగింది. అదీ ప్రత్యేక జాగ్రత్త, రక్షణ అవసరమైన బిడ్డ విషయంలో సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, వీడియోను, బాధితతల్లి ఫేస్‌బుక్‌ను పోస్ట్ చేయడంతో ఇదివైరల్ అయింది. ఎయిర్‌లైన్స్ దురాగతంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెడితే దివ్య జార్జ్ దంపతులు, వారి అయిదేళ్ల పాప(స్పెషల్లీ నీడ్ చైల్డ్) ను విమానంలోకి విమాన కెప్టెన్ నిరాకరించాడు. పాప సీటు బెల్ట్‌తో ప్రయాణించడానికి వీల్లేదంటూ మొండిగా వాదించాడు. అయితే ఒళ్లో కూర్చోబెట్టుకోండి..లేదంటే విమానం దిగి పొమ్మన్నాడు. అంతేకాదు రక్షణ రీత్యానే ఇలా చేస్తున్నామని పేర్కొన్నాడు. దీనిపై విచారం వ్యక్తం చేస్తూ దివ్య ఫేస్బుక్ పోస్ట్‌లో ఇలా వివరించారు. 7:35 గంటలకు బయలుదేరాల్సిన తమ విమానాన్ని ఒక గంట ఆలస్యం చేశారు, ఎందుకంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లతో ప్రయాణించటానికి వారు నిరాకరించారు. పాపకు ఏదైనా అయితే బాధ పడాల్సింది మేము కదా అని వాపోయారు. ఇది అన్యాయమనీ, దీంతో మాటలకందనంద బాధ కలిగించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ బడ్జెట్ ఏవియేషన్ హోల్డింగ్స్, స్కూట్ ఎయిర్‌లైన్స్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. కాగా దివ్య అయిదేళ్ల పాప కేవలం 8.5 కిలోగ్రాముల బరువును కలిగి ఉంది అంటే..ఇది ఏడాది వయస్సున్న పిల్లల వయసుతో సమానమన్నమాట. వెకేషన్కోసం ఈ కుటుంబం సింగపూర్‌నుంచి ఫూకట్‌కు బయలుదేరినట్టు సమాచారం. తమకు, తమ బిడ్డకు జరిగిన అవమానం గురించి దివ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దంపతులుకు సంపూర్ణ మద్దతు లభించింది. -
మళ్లీ క్లాట్ నిర్వహణకు సుప్రీంకోర్టు నో
న్యూఢిల్లీ: ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష(క్లాట్)ను మరోసారి నిర్వహించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న క్లాట్ తొలిదశ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. క్లాట్ పరీక్షలో సాంకేతిక సమస్యల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు జూన్ 15లోగా ఓ పరిష్కారాన్ని కనుగొనాలని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్(ఎన్‌యూఏఎల్‌ఎస్) ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఆదేశించింది. దేశంలోని 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 13న ఎన్‌యూఏఎల్‌ఎస్ క్లాట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు 6,000 మంది విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయారు. -
ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. యడ్యూరప్పకు లైన్ క్లియర్
సాక్షి, ఢిల్లీ : కర్ణాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కేంద్రంగా బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. కానీ కాంగ్రెస్-జేడీఎస్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఉన్నారు. సుప్రీంకోర్టు గురువారం తెల్లవారుజామున 2 గంటలకు విచారణను ప్రారంభించింది. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వి, కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, తుషార్ మెహతాలు హాజరై తమ వాదనాలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని తెలిపింది. అంతేకాకుండా గవర్నర్ అధికారాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. గురువారం ఉదయం 9గంటలకు యథాతథంగా సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 02 గంటలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయలేదు. ప్రమాణస్వీకారం అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కాంగ్రెస్ తరపున వాదనలు వినిపించిన సింఘ్వి కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 117మంది ఎమ్మెల్యేల మద్దతుందని తెలిపారు. అంతేకాక 104 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని సింఘ్వి అన్నారు. కేంద్ర తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప తరఫున మాజీ అటార్నీ జనరల్ ముఖుల్రోత్గి తన వాదనలు వినిపించారు. దాదాపుగా మూడున్నర గంటలపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖను మధ్యాహ్నం 2గంటల కల్లా తమ ముందుంచాలని ధర్మాసనం యడ్యూరప్పకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయం 10. 30కి (మే 18) ధర్మాసం వాయిదా వేసింది. -
సింగ్ బ్రదర్స్‌కు సుప్రీం మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఫోర్టిస్ ఆస్తులను విక్రయించే విషయంలో సింగ్ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ఈ విషయంలో స్టేటస్ కో స్థితిని కొనసాగించాలని గురువారం సుప్రీం పునరుద్ఘాటించింది. ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్.. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వద్ద తనఖాకు ఉంచిన షేర్లను విక్రయించేందుకు జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా తనఖాలో ఉన్న షేర్లను అమ్మివేసేందుకు బ్యాంకులకు (ఎస్ బ్యాంకు, యాక్సిస్బ్యాంకు) సైతం కోర్టు అనుమతి నిరాకరించింది. వీటితోపాటు నాన్ఎన్కంబర్డ్ షేర్ల విక్రయంపైనా కోర్టు నిషేధాజ్ఞలను కొనసాగాతాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 31 న కేసు తుది విచారణ వరకు వారి ఆస్తులను ఏమాత్రం తొలగించకుండా ఉండాలని సుప్రీం ఆదేశించింది. ఆస్తుల విక్రయానికి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రమోటర్లు సింగ్ బ్రదర్స్‌కు చుక్కెదురు కావడంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ షేరు దాదాపు6.6 శాతం పతనాన్ని నమోదు చేసింది. కాగా ఔషధ సంస్థ డైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పడు నివేదికలు అందించిన కేసులో ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు భారీ నష్టపరిహారాన్ని ఎదుర్కొంటున్నారు. రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2016లో సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరింది. అలాగే డైచీ శాంక్యో పిటీషన్ మేరకు ఆగస్టు 11 ఫోర్టిస్ ఆస్తులను, షేర్లను అమ్మడానికి వీల్లేదని సుప్రీం ఆదేశించింది. ఫోర్టిస్‌లో వాటాలను విక్రయించడానికి అనుమతి కోసం ఆగస్టు 23న సింగ్ సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
'ఇండియాస్ డాటర్' పై జోక్యానికి నిరాకరణ..!
న్యూఢిల్లీః 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ నిషేధంపై జోక్యానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 2012 లో డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మహిళలపై అకృత్యాలకు మాయని మచ్చగా నిలిచింది. అయితే నిర్భయ గ్యాంగ్ రేప్ స్టోరీని బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడంతో వివాదం తలెత్తింది. డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో కింది కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా.. అదే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ ఢిల్లీ హైకోర్టు వివరించింది. నిర్భయ గ్యాంగ్ రేప్ పై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ప్రసారాల అనుమతిపై ఇప్పటికే ట్రయల్ కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉండగా.. తాము దీనిపై కల్పించుకునేది లేదని జస్టిస్ జి రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ ల తో కూడిన ధర్మాసనం తెలిపింది. -
భార్య తాకట్టు...హత్య
చండీగఢ్: ఆపదలో వున్నపుడు, ఆర్థిక అవసరాలకోసం విలువైన వస్తువులను, ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలు విషయమే. కానీ ముప్పయి వేలకోసం భార్యను తాకట్టుపెట్టాడు హర్యానాలోని ఓ వ్యక్తి. అయితే తీసుకున్న అప్పు చెల్లించినా భార్యను విడుదల చేయడానికి నిరాకరించిన సదరు వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు ఉన్నతాధికారుల కథనం ప్రకారం సల్మాను సబ్బీర్ ఇద్దరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. కొంతకాలం క్రితం హరియాణా వచ్చిన స్థానికంగా ఒకఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ పొట్ట పొసుకుంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. బొంతలు కుట్టి అమ్ముకునే గోలం, సబ్బీర్ దంపతులు పక్క పక్కనే ఉండేవారు. ఈ క్రమంలో గోలం దగ్గర భార్య సల్మాను తాకట్టుపెట్టాడు సబ్బీర్ . కొంతకాలానికి ఎలాగోలా కష్టపడి ఆ అప్పును తీర్చేశాడు. కానీ సల్మాను విడిచిపెట్టడానికి గోలం నిరాకరించడంతో పాటుగా మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై నిలదీయడానికి అతని స్నేహితులు అక్తర్, గౌరవ్ తో కలిసి గోలం నివాసానికి వెళ్లాడు. అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే గోలంను హత్యచేసి సమీపంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయారని డిఎస్పీ రాజేంద్ర కుమార్ తెలిపారు అక్టోబర్ 31న హత్య జరిగితే నవంబర్ 1 న తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక యమునానగర్ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ మృతదేహం ఆచూకీ కోసం ఆరాతీయగా బొంతలు తయారు చేసుకొనే గోలందిగా స్థానికులు గుర్తించారు. హత్యకేసుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఎట్టకేలకు గత ఆదివారం ఛేదించారు. అనుమానాస్పద వ్యక్తులుగా సబ్బీర్, సల్మా దంపతులను అదుపులోకి ప్రశ్నించగా, నేరాన్ని అంగీకరించారు. అయితే గోలం ను హత్యచేసిన విషయాన్ని అతని బంధువులకు సమాచారం అందించినట్టు సల్మా పోలీసులతో చెప్పింది. ఈ విషయాన్ని గోలం బంధువు ఆలం కూడా ధృవీకరించారు. వారి మధ్య జరిగిన లావేదేవీల గురించి తనకు తెలియదు గానీ, గోలందగ్గర పాటుగా సల్మా నాలుగు ఉన్నట్టు అంగీకరించారు.