సాక్షి, ముంబై: గ్లోబల్‌గా అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ కూడా ఉద్యోగాల తీసివేతకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. జెట్ ఇంజిన్ల తయారీదారు రోల్స్ రాయిస్ ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది ఉద్యోగులను తొలగిస్తోందని వార్త మీడియాలో పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే కంపెనీ స్పందన మాత్రం భిన్నంగా ఉంది.
టైమ్స్ నివేదికల ప్రకారం లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 3,000 మంది నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా ఈ తొలగింపులను చేపట్టనుంది. వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్వహణ మార్పులతో సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఇటీవల రోల్స్ రాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టుఫాన్ ఎర్గిన్‌బిల్జిక్ ప్రకటించారని కూడా నివేదించింది. రోల్స్ సివిల్ ఏరోస్పేస్, మిలిటరీ ,పవర్ సిస్టమ్స్ విభాగాల తయారీయేతర వ్యాపారాలను కలపాలని కార్పొరేషన్ భావిస్తోందన్న అంచనాలు వెలువడ్డాయి.
అవన్నీ ఊహాగానాలే: రోల్స్ రాయిస్
అయితే ఈ వార్తలను బ్రిటీష్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల కోతల వార్తలన్నీ ఊహాగానాలేనని ఈ సందర్బంగా ది సండే టైమ్స్ క్లెయిమ్‌లను కంపెనీ తోసిపుచ్చింది. దీర్గకాల సక్సెస్, ఉద్యోగుల శ్రేయస్సే తమ ప్రాధాన్యత అని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు.
కాగా ప్రపంచవ్యాప్త విమానయాన పరిశ్రమ విడి భాగాలు, నిపుణుల కొరతతో ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది, అలాగే విమాన ఇంజిన్‌లకు టైటానియం వంటి పదార్థాలను సరఫరా చేసే రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment