Rolls-Royce
-
జేఎల్ఎల్కు రోల్స్-రాయిస్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తాజాగా కాంప్లెక్స్ పవర్, ప్రొపల్షన్ సొల్యూషన్స్ అభివృద్ధి, తయారీలో ఉన్న రోల్స్–రాయిస్ నుంచి దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది.ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమయ్యే దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా భారీగా విస్తరించనుంది. తమ వైవిధ్యమైన ప్రాజెక్టులను సురక్షితమైన, స్థిరమైన, స్పూర్తిదాయకంగా అందించడం లక్ష్యమని ప్రాపర్టీ సర్వీసెస్ , రోల్స్ - రాయిస్ గ్లోబల్ హెడ్, ఆండ్రూ మెక్మానస్, చెప్పారు. ఇవీ చదవండి: iQoo Z7 Pro 5g వచ్చేసింది..రూ.20 వేలలో బెస్ట్ 5g ఫోన్ 30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్ భారత్ సహా ఆరు దేశాల్లో రోల్స్–రాయిస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోకు సౌకర్యాల నిర్వహణ సేవలను జేఎల్ఎల్ అందించనుంది. ఆరు దేశాల్లోని 44 కేంద్రాల్లో 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోల్స్–రాయిస్‌కు చెందిన తయారీ, గిడ్డంగులు, కార్యాలయాలను 2024 ఫిబ్రవరి నుంచి జేఎల్ఎల్ నిర్వహిస్తుంది. -
3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ కూడా ఉద్యోగాల తీసివేతకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. జెట్ ఇంజిన్ల తయారీదారు రోల్స్ రాయిస్ ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది ఉద్యోగులను తొలగిస్తోందని వార్త మీడియాలో పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే కంపెనీ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. టైమ్స్ నివేదికల ప్రకారం లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 3,000 మంది నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా ఈ తొలగింపులను చేపట్టనుంది. వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్వహణ మార్పులతో సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఇటీవల రోల్స్ రాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టుఫాన్ ఎర్గిన్బిల్జిక్ ప్రకటించారని కూడా నివేదించింది. రోల్స్ సివిల్ ఏరోస్పేస్, మిలిటరీ ,పవర్ సిస్టమ్స్ విభాగాల తయారీయేతర వ్యాపారాలను కలపాలని కార్పొరేషన్ భావిస్తోందన్న అంచనాలు వెలువడ్డాయి. అవన్నీ ఊహాగానాలే: రోల్స్ రాయిస్ అయితే ఈ వార్తలను బ్రిటీష్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఖండించింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల కోతల వార్తలన్నీ ఊహాగానాలేనని ఈ సందర్బంగా ది సండే టైమ్స్ క్లెయిమ్‌లను కంపెనీ తోసిపుచ్చింది. దీర్గకాల సక్సెస్, ఉద్యోగుల శ్రేయస్సే తమ ప్రాధాన్యత అని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా ప్రపంచవ్యాప్త విమానయాన పరిశ్రమ విడి భాగాలు, నిపుణుల కొరతతో ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది, అలాగే విమాన ఇంజిన్లకు టైటానియం వంటి పదార్థాలను సరఫరా చేసే రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతోంది. -
హల్చల్ చేస్తోన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్..!
భారత మార్కెట్లలోకి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ సరికొత్త కారును లాంచ్ చేసింది. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ గోస్ట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ గోస్ట్ ధర రూ. 12.25 కోట్ల నుంచి ప్రారంభంకానుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ రోల్స్ రాయిస్ ప్రసిద్ధ లగ్జరీ సెడాన్, ఘోస్ట్‌కి అప్‌గ్రేడ్‌గా రానుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్‌లో శక్తివంతమైన 6.75-లీటర్ వీ12 ఇంజన్‌ను అమర్చారు. ఇది స్టాండర్డ్ ఘోస్ట్‌తో పోల్చితే అదనంగా 29 పీఎస్ శక్తిను, 50 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారులో కొత్త జెడ్ఎఫ్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఈ కారులో లగ్జరీ సెడాన్ 'స్పోర్ట్' మోడ్‌ను ఎనేబుల్ చేసేందుకుగాను కొత్త బటను చేర్చారు. 'స్పోర్ట్' మోడ్ థ్రోటెల్తో కారు కేవలం 4.7 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గేర్ షిఫ్టింగ్ మరింత వేగంగా మారుతుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ వీల్స్ 21-అంగుళాల బెస్పోక్ కాంపోజిట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండనుంది. పాంథియోన్ గ్రిల్‌తో పాటు 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ' క్రోమ్ బ్లాక్‌తో రానుంది. సిగ్నేచర్ హై-గ్లోసీ బ్లాక్ పియానో 44,000 ఫినిషింగ్‌లలో కస్టమర్లు ఎంచుకోవచ్చు. చదవండి: 10 వేలకుపైగా ఉద్యోగాలు...ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ జోడీ -
చేతులు కలిపిన ఇన్ఫోసిస్, రోల్స్ రాయిస్!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, పారిశ్రామిక టెక్నాలజీ సంస్థ రోల్స్–రాయిస్ జట్టు కట్టాయి. బెంగళూరులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని గురువారం ఆవిష్కరించాయి. రోల్స్–రాయిస్ గ్రూప్‌లో భాగమైన వ్యాపార విభాగాలకు అవసరమయ్యే అత్యున్నత స్థాయి పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సర్వీసులను అందించేందుకు ఇది తోడ్పడనుంది. ఏడేళ్ల కాలవ్యవధి గల ఈ డీల్.. ఇరు సంస్థలకు ప్రయోజనకరమైనదని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జస్మీత్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏరోస్పేస్ రంగం తిరిగి పుంజుకుంటున్న క్రమంలో ఇన్ఫీతో కలిసి ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ కేంద్రం తమ అంతర్జాతీయ ఇంజినీరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయగలదని రోల్స్–రాయిస్ ప్రెసిడెంట్ (భారత్, దక్షిణాసియా) కిశోర్ జయరామన్ పేర్కొన్నారు. రోల్స్–రాయిస్ సివిల్ ఏరోస్పేస్ వ్యాపారానికి ఇంజినీరింగ్, ఆర్అండ్డీ సర్వీసుల కోసం ఇరు కంపెనీలు 2020 డిసెంబర్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌లో ఇంజినీరింగ్, ఆర్అండ్డీ సర్వీసులకు తోడ్పాటునిచ్చేలా గత దశాబ్దకాలంలో రోల్స్–రాయిస్ బెంగళూరులో వివిధ విభాగాలకు సంబంధించిన ఇంజినీరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. -
111 ఏళ్ల తరువాత రోల్స్ రాయిస్ సంచలన నిర్ణయం..!
ప్రముఖ ప్రీమియం లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 111 ఏళ్ల తరువాత రోల్స్ రాయిస్‌కు చెందిన స్పిరిట్ ఆఫ్ ఎక్ట్ససీ ఐకానిక్ మస్కట్‌ను రిడిజైన్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈవీ కార్లో ప్రత్యక్ష్యం..! కొత్త బ్రాండ్ మస్కట్ రోల్స్ రాయిస్‌కు చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్‌లో మొదటగా రానుంది. ఈ మస్కట్‌కు మరింత ఏరోడైనమిక్ డిజైన్‌తో రానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక రోల్స్ రాయిస్ నుంచి రాబోయే స్పెక్టర్ ఈవీ ఏరోడైనమిక్ డిజైన్‌లో అత్యంత సమర్థవంతమైన కారుగా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. డిజైన్‌లో చిన్నపాటి మార్పులు..! రోల్స్ రాయిస్ మస్కట్‌ను బ్రిటీష్ డిజైనర్ చార్సెల్సైక్స్ రూపొందించారు. దీనిని మరింత డైనమిక్ వైఖరితో మస్కట్ పునర్నిర్మించనున్నారు. కొత్త మస్కట్ ప్రస్తుత డిజైన్ కంటే దాదాపు 17 మిమీ తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది 82.7 మిమీ పొడవుతో రానుంది. ఈ కొత్త మస్కట్‌కు సమర్థవంతమైన ఏరోడైనమిక్ డిజైన్‌ను అందించేందుకుగాను ఈ మోడల్‌ను నిర్మించేందుకు విండ్ టన్నెల్ టెస్టింగ్‌లో దాదాపు 830 గంటలు పట్టిందని కంపెనీ పేర్కొంది. చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..! -
భారత నేవీకి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు అందిస్తాం: రోల్స్‌రాయిస్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ యుద్ధనౌకలను అభివృద్ధి చేయడానికి సంబంధించి భారత నౌకాదళంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై ఏరో ఇంజిన్స్ తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం రోల్స్–రాయిస్ ఆసక్తి వ్యక్తం చేసింది. భారత నేవీకి యుద్ధ నౌకలు మొదలైన వాటిని ఆధునికీకరించేందుకు అపార అనుభవం తమకుందని కంపెనీ నేవల్ సిస్టమ్స్ విభాగం చీఫ్ రిచర్డ్ పార్ట్రిడ్జ్ తెలిపారు. నౌకలను హైబ్రిడ్ ఎలక్ట్రిక్, పూర్తి ఎలక్ట్రిక్ విధానంలో నడిపించేందుకు అవసరమైన ఉత్పత్తులను తాము అందించగలమని వివరించారు. బ్రిటన్ నేవీ కోసం ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్–ఎలక్ట్రిక్ నేవల్ సిస్టమ్ డిజైనింగ్ నుంచి తయారీ దాకా తామే చేసినట్లు రిచర్డ్ పేర్కొన్నారు. త్వరలో నిర్వహించే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ టూర్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. -
రోల్స్ రాయిస్ మరో నూతన ఆవిష్కరణ
ఇంగ్లండ్: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ ఆటోమొబైల్స్ మేకర్ రోల్స్ రాయిస్ మరో నూతన ఆవిష్కరణతో మన ముందుకొస్తోంది. అత్యంత వేగంగా ఎగిరే విద్యుత్ విమానాన్ని రూపొందిస్తున్న ఈ సంస్థ.. అందులో వినియోగించే టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విమానానికి ‘అయాన్ బర్డ్’గా నామకరణం చేసిన రోల్స్ రాయిస్ ఇంజనీర్లు.. రెప్లికా వెర్షన్ టెస్ట్ ఫలితాలతో సంతప్తి వ్యక్తం చేస్తున్నారు. 500 హార్స్ పవర్ సామర్థ్యం కలిగి ఉండడంతో ఈ విద్యుత్ విమానం రికార్డు స్థాయి వేగాన్ని క్షణాల్లో అందుకోగలదని రోల్స్ రాయిస్ డైరెక్టర్ రాబ్ వాట్సన్ వివరించారు. ఈ విమానం టెక్నాలజీని పరీక్షించేందుకు ఉపయోగించిన విద్యుత్.. 250 ఇళ్లకు వినియోగించే విద్యుత్‌తో సరిసమానమని చెప్పారు. సోషల్ డిస్టెన్స్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలూ తీసుకుని టెస్ట్ నిర్వహించామని ఆయన చెప్పారు. టెక్నాలజీ టెస్ట్ విజయవంతంగా పూర్తవడంతో అతి త్వరలోనే అన్ని పరికరాలనూ విమానంలో అమర్చుతామని తెలిపారు. 2050 నాటికి కాలుష్య రహిత విమానాల తయారీలో తాము కీలకం కాబోతున్నామని వాట్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఒక వైపు మానవ హననం, మరో వైపు ఆర్థిక సంక్షోభంతో కార్పొరేట్ దిగ్గజాలు సైతం అతలా కుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ 9,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్-19, లాక్డౌన్ ఆంక్షల సందర్భంగా తాము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తప్పలేదని తెలిపింది. తద్వారా 1.3 బిలియన్ డాలర్లను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెట్ ఇంజిన్ తయారీదారు ప్రకటించింది. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) విమాన ఇంజిన్లను తయారు చేసే డెర్బీ ఆధారిత సంస్థ రోల్స్ రాయిస్ కోవిడ్-19 సంక్షోభంతో విలవిల్లాడుతోంది. దీంతో మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 17వ వంతు కోతకు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రధానంగా తన సివిల్ ఏరోస్పేస్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఇది తయారీ సంక్షోభం కాకపోయినా, తాజా అనిశ్చితి, ఇతర సమస్యలను పరిష్కరించుకోవాల్సి వుందని సంస్థ సీఈవో బాస్ వారెన్ ఈస్ట్ అన్నారు. అయితే యూనియన్లతో సంప్రదింపుల కారణంగా ఉద్యోగ నష్టాలు ఎక్కడ ఉంటాయో కంపెనీ కచ్చితంగా తేల్చలేదు. ఉద్యోగ కోతల్లో ఎక్కువ భాగం ప్రధానంగా యూకేలోనే ఉంటుందని భావిస్తున్నారు. అలాగే లాక్డౌన్ ఆంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా సేవలను నిలిపివేసిన వైమానిక పరిశ్రమ కోలుకోవడానికి "చాలా సంవత్సరాలు" పడుతుందని హెచ్చరించింది. మరోవైపు ఈ నిర్ణయంపై అక్కడి కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి. -
వైరల్ అవుతున్న రోల్స్ రాయిస్ ట్యాక్సీ
సోషల్ మీడియాలో పాత తరం రోల్స్ రాయిస్ కారు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కారు మోటార్ రేసింగ్ ఔత్సాహికులకు ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. పసుపు(గోల్డెన్) నెంబర్ ప్లేట్‌తో ప్రయాణిస్తున్నట్టుగా ఉన్న రాయిస్ కారు ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన బాబీ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. బంగారు రంగులో ఉన్న ఆ కారును అతడు ఓ ప్రైవేటు రిసార్టుకు అద్దెకిచ్చాడు. ఆ రిసార్టులో దిగే వాళ్లు ఎవరైన దీన్ని బుక్ చేసుకుంటే పికప్, డ్రాప్ కోసం రోల్స్ రాయిస్‌లో ప్రయాణించే అవకాశం కల్పించాడు. 25,000 చెల్లిస్తే ఈ ప్యాకేజీలో 300 కిలోమీటర్లు ప్రయాణించడమే కాకుండా రెండుమూడు రోజులు వరకు ఉంచుకోవచ్చని యజమాని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ కారుకు సంబంధించి నెటిజన్లు స్పందించారు. ఈ కారులో ఏ విధమైన మీటర్‌ను అమర్చారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, మరోవైపు ఈ కారును ట్యాక్సీగా ఉపయోగించడానికి కారణం ఏంటని మరో నెటిజన్ ప్రశ్నలు సంధించాడు. -
రోల్స్ రాయిస్ కుల్లినన్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కుల్లినన్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఈ లగ్జరీ ఎ స్యూవీపై దాదాపు మూడు సంవత్సరాలుగా వివిధ అంచనాలు వెలువడుతున్నాయి. ఎట్టకేలకు ఈ అంచనాలకు చెక్‌పెడుతూ ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ‘‘ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ’’ అనే ఫ్లాట్‌ఫామ్‌లో తీర్చదిద్దిన రెండవ కారు. రోల్స్ రాయిస్ పాపులర్ లగ్జరీ కారు ఫాంటమ్ 8వ జనరేషన్ మోడల్ మొదటిది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే 6.75 లీటర్ల టర్బో వీ 12 ఇంజీన్, 563బీహెచ్‌పీపవర్, 850ఎన్ఎం, 627ఎల్బీ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సంవత్సరానికి చివరి నాటికి సుమారు 350,000 డాలర్ల (సుమారు 2కోట్ల 35 లక్షల రూపాయలు) ధరలతో కుల్లినన్ విక్రయానికి లభించనుంది.ప్రపంచాన్ని చుట్టేసే వినియోగదారుల కోసం అల్టిమేట్ లగ్జరీగా ఒక కొత్త తరగతి మోటారు కారును సృష్టించడంలో కొత్త ప్రమాణాన్ని ఏర్పరచుకున్నామని రోల్స్-రాయ్స్ అధ్యక్షుడు, బీఎండబ్ల్యు గ్రూపు బోర్డు సభ్యుడు పీటర్ స్క్వార్జెనెబ్యూర్ తెలిపారు. -
అతి ఖరీదైన కారు లాంచ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్లకు పెట్టింది పేరైన లగ్జరీ కార్ మేకర్ రోల్స్ రాయిస్ పాంథమ్ కొత్త ప్రీమియం మోడల్స్‌ను లాంచ్ చేసింది. పాంథమ్ ఎనిమిదో ఎడిషన్‌గా రెండు వేరియంట్లను నార్త్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.5 కోట్లుగా నిర్ణయించింది. ఎక్స్‌టెండెండ్ వీల్ బేస్ వెర్షన్ మోడల్ ధర రూ.11.35 కోట్లుగా నిర్ణయించింది. సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని కస్టమర్లకు అందించేలా హెడ్లైట్లు (లేజర్ లైట్ టెక్నాలజీన) రాత్రిపూట 600 మీటర్ల వెలుతురును అందిస్తాయని కంపెని చెబుతోంది. ఈ కొత్త జనరేషన్ పాంథమ్‌ను అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ప్లాట్‌ఫాంతో రూపొందించారు. గత మోడల్ కంటే ఇది తేలిగ్గా ఉంటుందట. 6.75 లీటర్ల ట్విన్ టర్బో చార్జ్డ్ వీ 12 ఇంజీన్ రూపొందించిన కారు కేవలం 5.3 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. విండ్‌స్క్రీన్‌తో అనుసంధానమైన 'ఫ్లాగ్ బేరర్' తో కూడిన స్టీరియో కెమెరా సిస్టమ్ రోడ్డును చూసి, దానికనుగునంగా సస్పెన్షన్ సర్దుబాటు చేస్తుంది. స్టార్ లైట్ రూఫ్, డోర్లను క్లోజ్ చేసే బటన్లు తదితర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయయి. బిజినెస్ క్లాస్ కస్టమర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభవం అందించనుంది. అంతేకాదు ఈ కార్ల కొనుగోలుపై లాంచింగ్ ఆఫర్‌గా 24 గంటల రోడ్ సైడ్ సపోర్ట్ , రీజనల్ వారంటీతోపాటు నాలుగేళ్లపాటు సర్వీస్‌ను ఉచితంగా అందించనుంది. జనాభా ఇతర దేశాల కన్నా ఎక్కువ పెరుగుతుండటం , ప్రామాణికమైన, బెస్పోక్ లగ్జరీ కార్లపై ఆసక్తి కారణాల రీత్యా ఇండియాలో తమకు ఆకర్షణీయమైన మార్కెట్ నిలుస్తోందని రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్, ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని సెలెక్ట్ కార్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఏకైక అధికార డీలర్‌గా రోల్స్ రాయిస్ ఎంచుకుంది. -
లగ్జరీ, బ్రాండెడ్ కార్లపై భారీగా ధర తగ్గింపు
న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగి, గతేడాది ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ బ్రెగ్జిట్ పరిణామాలు ఆ దేశంలో ఎలా ఉన్నాయో కాని, భారత్‌కు మాత్రం బాగానే ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. బ్రాండెడ్, ఖరీదైన లగ్జరీ కార్లపై భారీగా ధరలు తగ్గాయి. బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మక కార్ల దిగ్గజాలన్ని భారత్‌లో భారీగా ధరలు తగ్గించేశాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్, ఫెర్రరి వంటి సంస్థలు తమ కార్లపై ధరలను 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా తగ్గించినట్టు వెల్లడైంది. ఇంత భారీ మొత్తంలో ధరలు తగ్గించడానికి కారణం బ్రెగ్జిట్ నిర్ణయం అనంతరం పౌండ్ విలువ భారీగా పతనం కావడమే. రూపాయితో పోలిస్తే పౌండ్ విలువ ఏడాది వ్యవధిలోనే 20 శాతం దిగజారింది. దీంతో బ్రిటన్‌కు చెందిన తయారీసంస్థలు భారత్‌కు ఎగుమతి చేయడానికి ధరలు చౌకగా మారాయి. బ్రిటిష్ కరెన్సీలోనే భారత్ అమ్మకాలను గణిస్తారు. ఇలా ఎగుమతులు చౌకగా మారడంతో ఈ ప్రయోజనాలను భారత్‌లోని వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్టు కంపెనీలు చెబుతున్నాయి. 5 శాతం నుంచి 15 శాతం ధరలు కోత పెట్టి, ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షితులను చేసుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాయి. రెండు కోట్లకు పైగా ధర ఉన్న కార్ల విక్రయాలు భారత్‌లో 2016లో 200 యూనిట్లు నమోదయ్యాయి. దీనిలో సగానికి పైగా కార్లు బ్రిటన్‌కు చెందినవే కావడం విశేషం. భారత్‌లో జీఎస్టీ అమలైతే, మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పాటుచేసి వృద్ధిని నమోదుచేసుకుంటామని ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుడు లలిత్ చౌదరి చెబుతున్నారు. గత ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలను భారీగా తగ్గించిందని పేర్కొన్నారు. ఏ కారుపై ఎంత తగ్గింది.... కారు అసలు ధర ప్రస్తుత ధర రేంజ్ రోవర్ స్పోర్ట్ 1.35 కోట్లు 1.04 కోట్లు రేంజ్ రోవర్ వోగ్ 1.97 కోట్లు 1.56 కోట్లు ఫెర్రరి 488 3.9 కోట్లు 3.6 కోట్లు రోల్స్ రాయిస్ ఫాంటమ్ 9 కోట్లు 7.8-8.0 కోట్లు రోల్స్ రాయిస్ గోస్ట్ 5.25 కోట్లు 4.75 కోట్లు ఆస్టన్ మార్టిన్ డీబీ11 4.27 కోట్లు 4.06 కోట్లు -
12 దేశాల్లో రోల్స్ రాయిస్ భారీ అక్రమాలు
లండన్ : బ్రిటన్ ప్రముఖ తయారీ సంస్థ రోల్స్ రాయిస్, ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడవుతోంది. సీక్రెట్‌గా ఏజెంట్స్‌ను నియమించుకుని లాభాదాయకమైన భూ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వారికి లంచాలు కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గార్డియన్, బీబీసీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం బ్రాడ్ కాస్ట్ అయిన పనోరమ ప్రొగ్రామ్‌లో ఈ విషయాలు బీబీసీ పేర్కొంది. లాభాలు పెంచుకోవడానికి అక్రమ చెల్లింపుల పద్ధతిని అనుసరించి రోల్స్ రాయిస్ ప్రయోజనాలు పొందిందని బీబీసీ, గార్డియన్లు తెలిపాయి. ల్యాండ్ కాంట్రాక్టులు పొందడానికి కూడా ఏజెంట్లు అక్రమ చెల్లింపులకు తెరతీశారని సంస్థ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు. ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ అవినీతి నిరోధక ఏజెన్సీలు నెట్వర్క్ ఏజెంట్లను విచారించడం ప్రారంభించాయి. 13 బిలియన్ పౌండ్ల(రూ.1,06,125కోట్లకు పైగా) విలువ కలిగిన టర్బైన్లను, ఇంజన్లను ప్యాసెంజర్, మిలటరీ ఎయిర్క్రాప్ట్లకు విక్రయించిన రోల్స్ రాయిస్ వాటిపై మాత్రం పూర్తి వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న విచారణకు తాము సహకరిస్తామని, కానీ మధ్యవర్తిత్వలు పాల్పడిన అవినీతి, లంచాలకు సంబంధించిన విషయాలు మాత్రం సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు, ఇతర అథారిటీలు విచారిస్తాయని దాటవేస్తోంది. బ్రెజిల్, భారత్, చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అంగోలా, ఇరాక్, ఇరాన్, కజాఖ్స్తాన్, అజర్బైజాన్, నైజీరియా, సౌదీ అరేబియాలలో రోల్స్ రాయిస్ ఏజెంట్లను నియమించుకుని ఈ అక్రమాలకు పాల్పడిందని బీబీసీ రిపోర్టు చేసింది. బీబీసీ రిపోర్టులో భారత్‌కు చెందిన తన డిపెన్స్ ఏజెంట్ సుధీర్ చౌదరికి అక్రమంగా 10 మిలియన్ పౌండ్ల(రూ.81కోట్లకు పైగా) ను రోల్స్ రాయిస్ చెల్లించిందని వెల్లడైంది. భారత వైమానిక దళం వాడే హాక్ ఎయిర్క్రాప్ట్ల అతిపెద్ద కాంట్రాక్ట్ రోల్స్ రాయిస్ చేతికి వెళ్లడానికి ఆయన సహకారం అందించినట్టు బీబీసీ తెలిపింది. -
రోల్స్ రాయిస్ నుంచి డాన్
ధర రూ.6.25 కోట్లు ముంబై: బ్రిటన్‌కు చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ తాజాగా తన ‘కన్వర్టిబుల్ డాన్’ మోడల్లో కొత్త వెర్షన్‌ను దేశీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ముంబై ఎక్స్ షోరూమ్ ధర రూ.6.25 కోట్లు. ఇందులో 6.6 లీటర్ వీ 12 ఇంజిన్, 2ఁ2 సీటర్, జెడ్ఎఫ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. కారు రూఫ్.. గంటకు 50 కిలోమీటర్లు వేగం వద్ద 20 సెకన్లలో క్లోజ్ అవుతుందని తెలిపింది. కాగా కంపెనీకి అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాల్లో షోరూమ్‌లు ఉన్నాయి. -
డ్రైవర్ లెస్ లగ్జరీ కారు వచ్చేసింది
సూపర్ లగ్జరీ కారు మార్కెట్లో రోల్స్ రాయిస్ మరోసారి తళుక్కుమంది. తన మొదటి డ్రైవర్ లెస్ కారును గురువారం ఆవిష్కరించేసింది. సులువైన ప్రయాణం, గ్రాండ్ సాన్చురీ, గ్రాండ్ అరైవల్ అనుభూతితో ఈ కారును జర్మన్ కార్ మేకర్ బిలినీయర్ల ముందుకు తెచ్చింది. ఆ కారుకు అసలు స్టీరింగ్ వీల్ ఉండదు. కేవలం ఒక్క వైపు మాత్రమే డోర్ ఉంటుంది. కేవలం రెండే సీట్లతో.. చూడగానే చూపరులను కట్టిపడేసేలా వినూత్నంగా ఈ కారును రోల్స్ రాయిస్ రూపొందించింది. వర్చ్యువల్ అసిస్టెంట్ తో హోటల్స్ బుక్ చేసుకోవడం లేదా వార్డ్రోబ్ ను సెలక్ట్ చేసుకోవడం అంతా ఈ కారు ద్వారానే చేసుకోవచ్చట. ఇప్పటికే చాలా కారు తయారీదారి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించాయి. కానీ రోల్స్ రాయిస్ మాత్రం మొదటిసారి ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఈ కారు ధర దాదాపు రూ.10 కోట్లని అంచనా. న్యూ విజన్ 100 కాన్సెప్ట్ తో ఈ కారును రోల్స్ రాయిస్ తీసుకొచ్చింది. తన పేరెంట్ కంపెనీ బీఎమ్ డబ్ల్యూ సెంటనరీ వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో లండన్ ఈవెంట్ గా 103ఈఎక్స్ పేరుతో ఈ లగ్జరీ కారును రోల్స్ రాయిస్ ప్రవేశపెట్టింది. 3ఎంపీహెచ్ టాప్ స్పీడ్ సామర్థ్యం, మొబైల్ ఫోన్ తోనే ఈ కారును డ్రైవర్ ఆపరేట్ చేయడం దీని ప్రత్యేకతలు. 12 సిలిండర్ ఇంజిన్ ను ఈ కారు కలిగిఉంది. ప్రస్తుతమైతే జీరో ఉద్గారాలు ఉన్నాయని, కానీ 2040లో ఉత్పత్తి అయ్యే కార్లలో మాత్రం ఉద్గారాలు ఉండవు అనే దానికి తమ దగ్గర ఎలాంటి క్లారిటీ లేదని ఈ కొత్త జర్మన్ కారు తయారీదారు పేర్కొంది. ఈ కారుకు డోర్ కేవలం ఒక్క వైపు మాత్రమే ఉండి, లేజర్ ప్రొజెక్టర్ ద్వారా ఈ కారు వచ్చేటప్పుడు ఫ్లోర్ పై వర్చ్యువల్ రెడ్ కార్పెట్ కనిపిస్తూ గ్రాండ్ వెల్ కమ్ అనుభూతిని కల్పిస్తుంది. అంతేకాదు లగేజీ బ్యాగ్ లను నియంత్రించే పనిని మనం ఏ మాత్రం టచ్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఈ కారే చేసేస్తుంది. 1.5 మీటర్ స్క్రీన్ తో ఫిల్మ్ లను వీక్షిస్తూ గ్రాండ్ సాన్చురీ అనుభూతిని రోల్ రాయిస్ కల్పిస్తుంది. -
కొత్త బ్రాండ్ కారును విడుదల చేసిన రోల్స్ రాయల్స్