సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ ఎప‍్పటినుంచో ఎదురు చూస్తున్న కుల్లినన్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఈ లగ్జరీ ఎ స్‌యూవీపై దాదాపు మూడు సంవత్సరాలుగా వివిధ అంచనాలు వెలువడుతున్నాయి. ఎట్టకేలకు ఈ అంచనాలకు చెక్‌పెడుతూ ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ‘‘ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ’’ అనే ఫ్లాట్‌ఫామ్‌లో తీర్చదిద్దిన రెండవ కారు. రోల్స్ రాయిస్ పాపులర్ లగ్జరీ కారు ఫాంటమ్ 8వ జనరేషన్ మోడల్ మొదటిది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే 6.75 లీటర్ల టర్బో వీ 12 ఇంజీన్, 563బీహెచ్‌పీపవర్, 850ఎన్‌ఎం, 627ఎల్‌బీ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సంవత్సరానికి చివరి నాటికి సుమారు 350,000 డాలర్ల (సుమారు 2కోట్ల 35 లక్షల రూపాయలు) ధరలతో కుల్లినన్ విక్రయానికి లభించనుంది.ప్రపంచాన్ని చుట్టేసే వినియోగదారుల కోసం అల్టిమేట్ లగ్జరీగా ఒక కొత్త తరగతి మోటారు కారును సృష్టించడంలో కొత్త ప్రమాణాన్ని ఏర్పరచుకున్నామని రోల్స్-రాయ్స్ అధ్యక్షుడు, బీఎండబ్ల్యు గ్రూపు బోర్డు సభ్యుడు పీటర్ స్క్వార్జెనెబ్యూర్ తెలిపారు.
రోల్స్ రాయిస్ కుల్లినన్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
Published Thu, May 10 2018 8:43 PM | Last Updated on Thu, May 10 2018 8:55 PM
1/4
2/4
3/4
4/4
Advertisement
Comments
Please login to add a commentAdd a comment