Cullinan
-
భారత్‌లో రూ.10.50 కోట్ల రోల్స్ రాయిస్ కారు లాంచ్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) భారతీయ విఫణిలో 'కల్లినన్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 10.50 కోట్లు కాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్యూవీ డెలివరీలు 2024 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారును కల్లినన్ సిరీస్ 2 అని కూడా పిలువవచ్చు.2024 రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్ మరియు అప్డేటెడ్ టెక్నాలజీ పొందుతుంది. ఇది ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, వెనుక భాగంలో స్టెయిన్లెస్-స్టీల్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. రీడిజైన్ గ్రిల్ ఇక్కడ చూడవచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ కూడా కొంత అప్డేట్ పొందాయి.ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలురోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ స్టాండర్డ్ వేరియంట్ 571 హార్స్ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ 600 హార్స్ పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
నీతా అంబానీ కొత్త కారు - ధర తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే సంపన్న కుటుంబాలలో 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ ఒకటి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెరారీ, బెంట్లీ వంటి ఎక్స్పెన్సివ్ కార్లను కలిగిన ఉన్న వీరు తాజాగా మరో కాస్ట్లీ కారుని తమ గ్యారేజిలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియోలో గమనించినట్లతే 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కంపెనీకి చెందిన 'కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్' (Cullinan Black Badge) కారు ముంబై రోడ్లపై Z+ సెక్యూరిటీ కాన్వాయ్‌లో వెళ్లడం చూడవచ్చు. ఇది ముకేశ్ అంబానీ భార్య 'నీతా అంబానీ'కి చెందినట్లు, దీని ధర రూ.10 కోట్లు (ఆన్ రోడ్) వరకు ఉంటుందని సమాచారం. పెట్రా గోల్డ్ షేడ్‌లో కనిపించే ఈ కారు సాధారణ కార్లకంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగిన కల్లినన్ 5,000 ఆర్పీఎమ్ వద్ద 563 బీహెచ్పీ పవర్, 1600 ఆర్పీఎమ్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు లోపల కొన్ని భాగాలు కార్బన్ ఫైబర్‌తో, లెదర్ అపోల్స్ట్రే బ్లాక్ కలర్ స్కీమ్ పొందుతుంది. ఇలాంటి కారు ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కొనుగోలు చేశారు. -
ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!
Sohan Roy: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ ఏది అంటే.. వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). మన దేశంలో ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా మొదలైన పారిశ్రామిక వేత్తలు ఈ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లను వినియోగిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే మొట్ట మొదటి 'రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఫస్ట్ 'కల్లినన్' సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, యుఎఇకి చెందిన 'సోహన్ రాయ్' (Sohan Roy) రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి భారతీయుడు. అతడు తన భార్య 'అభిని సోహన్'కు 25 వ పెళ్లి రోజు కానుకగా కొనుగోలు చేసినట్లు గతంలోనే వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. దీని ధర రూ. 5 కోట్ల కంటే ఎక్కువని సమాచారం. సోహన్ రాయ్ ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈఓగా ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా ఈయన సినిమా డైరెక్టర్ కూడా. సోహన్ దర్శకత్వంలో DAM999 చిత్రం తెరకెక్కింది. అంతే కాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ విస్మయాస్ మాక్స్ స్టూడియో కాంప్లెక్స్‌ను ఏరీస్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. (ఇదీ చదవండి: వంటగదిలో మొదలైన వ్యాపారం కోట్లు కురిపిస్తోంది - 50 ఏళ్ల మహిళ సక్సెస్ స్టోరీ) ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కల్లినన్ విషయానికి వస్తే.. ఇది ఖరీదైనదైనప్పటికీ లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు 2018లో మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది ట్విన్-టర్బోచార్జ్డ్ 6.75-లీటర్ V12 ఇంజన్ ప్యాక్ కలిగి 5000 ఆర్‌పిఎమ్ వద్ద 563 హార్స్ పవర్, 1600 ఆర్‌పిఎమ్ వద్ద 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. (ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!) రోల్స్ రాయిస్ కల్లినన్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా విశాలంగా ఉండే ఈ కారు 1835 మిమీ పొడవు, 5341 మిమీ వెడల్పు, 2164 మిమీ ఎత్తు కలిగి ఈ కారు బరువు సుమారు మూడు టన్నుల వరకు ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కువమంది ధనవంతులు కొనుగోలు చేసిన కార్లలో ఇది ప్రధానమైనది. -
రోల్స్ రాయిస్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి
బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీదారు రోల్స్ రాయిస్ భారతదేశంలో మరో న్యూ మోడల్ కారును మన మార్కెట్లోకి తీసుకొచ్చింది. కలినన్ ఎస్యూవీ ధరను భారతదేశంలో రూ .6.95 కోట్ల (ఎక్స్ షోరూం, ఇండియా) ధరగా నిర్ణయించింది. రోల్స్ రాయిస్ కొత్త ఎస్‌యూవీని 'లగ్జరీ ఆర్కిటెక్చర్' గా నిర్మించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రంగా చెప్పుకునే కలినన్ డైమండ్ పేరుతో 'రోల్స్ రాయిస్ కలినన్'ను విడుదల చేసింది రోల్స్ రాయిస్. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాస్ట్లీ ఎస్యూవీ కూడా ఇదేనని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ కారును తయారుచేశామని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా 'ఎవ్రీవేర్' మోడ్ ఆప్షన్ ద్వారా ఇసుక, మట్టి, తడిగడ్డి, కంకరరోడ్డు, మంచురోడ్డు ఇలా దేనిమీదైనా ఈ కారును ఏమాత్రం కుదుపులు లేకుండా, హాయిగా నడపొచ్చని పేర్కొంది. ఫీచర్లు 6.75 లీటర్ల వీ 12 ఇంజిన్, 653 బీహెచ్పీ శక్తిని, 850 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డాష్‌బోర్డుపై టచ్‌స్క్రీన్‌తో పాటు ముందు సీట్ల వెనుక కూడా 12 అంగుళాల టచ్స్క్రీన్లను ఏర్పాటుచేశారు. 22 అంగుళాల అల్లోయ్ వీల్స్ జోడించింది. అలాగే వెనుకవైపు సీట్ల కింద బూట్లో రెండు ఇన్నర్ బెంచీలను ఏర్పాటుచేశారు. కావాలనుకుంటే వాటిని బయటకు లాగి కుర్చీల్లా మార్చుకోవచ్చన్నమాట. -
రోల్స్ రాయిస్ కుల్లినన్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కుల్లినన్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఈ లగ్జరీ ఎ స్యూవీపై దాదాపు మూడు సంవత్సరాలుగా వివిధ అంచనాలు వెలువడుతున్నాయి. ఎట్టకేలకు ఈ అంచనాలకు చెక్‌పెడుతూ ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ‘‘ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ’’ అనే ఫ్లాట్‌ఫామ్‌లో తీర్చదిద్దిన రెండవ కారు. రోల్స్ రాయిస్ పాపులర్ లగ్జరీ కారు ఫాంటమ్ 8వ జనరేషన్ మోడల్ మొదటిది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే 6.75 లీటర్ల టర్బో వీ 12 ఇంజీన్, 563బీహెచ్‌పీపవర్, 850ఎన్ఎం, 627ఎల్బీ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సంవత్సరానికి చివరి నాటికి సుమారు 350,000 డాలర్ల (సుమారు 2కోట్ల 35 లక్షల రూపాయలు) ధరలతో కుల్లినన్ విక్రయానికి లభించనుంది.ప్రపంచాన్ని చుట్టేసే వినియోగదారుల కోసం అల్టిమేట్ లగ్జరీగా ఒక కొత్త తరగతి మోటారు కారును సృష్టించడంలో కొత్త ప్రమాణాన్ని ఏర్పరచుకున్నామని రోల్స్-రాయ్స్ అధ్యక్షుడు, బీఎండబ్ల్యు గ్రూపు బోర్డు సభ్యుడు పీటర్ స్క్వార్జెనెబ్యూర్ తెలిపారు. -
రికార్డుల ‘ముడి’ విప్పుతుంది..
చూడ్డానికి గాజు ముక్కలా కనిపిస్తోంది గానీ.. ఇది మన జేబులో ఉంటే రూ.600 కోట్లు మనదైనట్లే.. ఎందుకంటే గాజుముక్కలా కనిపిస్తున్న ఇది సానబెట్టని ముడి వజ్రం. దక్షిణాఫ్రికాలోని కల్లినాన్ గనుల్లో దొరికింది. స్ట్రాబెర్రీ సైజులో ఉండే 122.5 క్యారెట్ల ఈ నీలి వజ్రం.. ముడి వజ్రాలలో అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే.. గతంలో అత్యంత ఖరీదైన ముడి వజ్రం(507 క్యారెట్ల వైట్ డైమండ్) రూ. 201 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది మాత్రం కనీసం రూ. 600 కోట్లు పలుకుతుందని.. గత రికార్డులను బద్దలుకొడుతుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో జొహన్నెస్ బర్గ్‌లో జరిగే ప్రైవేటు టెండర్ ప్రక్రియలో దీన్ని వేలం వేస్తారు.