భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే సంపన్న కుటుంబాలలో 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ ఒకటి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెరారీ, బెంట్లీ వంటి ఎక్స్‌పెన్సివ్ కార్లను కలిగిన ఉన్న వీరు తాజాగా మరో కాస్ట్లీ కారుని తమ గ్యారేజిలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వీడియోలో గమనించినట్లతే 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కంపెనీకి చెందిన 'కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్' (Cullinan Black Badge) కారు ముంబై రోడ్లపై Z+ సెక్యూరిటీ కాన్వాయ్‌లో వెళ్లడం చూడవచ్చు. ఇది ముకేశ్ అంబానీ భార్య 'నీతా అంబానీ'కి చెందినట్లు, దీని ధర రూ.10 కోట్లు (ఆన్ రోడ్) వరకు ఉంటుందని సమాచారం.
పెట్రా గోల్డ్ షేడ్‌లో కనిపించే ఈ కారు సాధారణ కార్లకంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగిన కల్లినన్ 5,000 ఆర్‌పీఎమ్ వద్ద 563 బీహెచ్‌పీ పవర్, 1600 ఆర్‌పీఎమ్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిమీ.
ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్
రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు లోపల కొన్ని భాగాలు కార్బన్ ఫైబర్‌తో, లెదర్ అపోల్స్ట్రే బ్లాక్ కలర్ స్కీమ్ పొందుతుంది. ఇలాంటి కారు ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment