Sohan Roy: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ ఏది అంటే.. వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). మన దేశంలో ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా మొదలైన పారిశ్రామిక వేత్తలు ఈ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లను వినియోగిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే మొట్ట మొదటి 'రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఫస్ట్ 'కల్లినన్' సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, యుఎఇకి చెందిన 'సోహన్ రాయ్' (Sohan Roy) రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి భారతీయుడు. అతడు తన భార్య 'అభిని సోహన్'కు 25 వ పెళ్లి రోజు కానుకగా కొనుగోలు చేసినట్లు గతంలోనే వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. దీని ధర రూ. 5 కోట్ల కంటే ఎక్కువని సమాచారం.
సోహన్ రాయ్ ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈఓగా ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా ఈయన సినిమా డైరెక్టర్ కూడా. సోహన్ దర్శకత్వంలో DAM999 చిత్రం తెరకెక్కింది. అంతే కాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ విస్మయాస్ మాక్స్ స్టూడియో కాంప్లెక్స్‌ను ఏరీస్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది.
(ఇదీ చదవండి: వంటగదిలో మొదలైన వ్యాపారం కోట్లు కురిపిస్తోంది - 50 ఏళ్ల మహిళ సక్సెస్ స్టోరీ)
ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కల్లినన్ విషయానికి వస్తే.. ఇది ఖరీదైనదైనప్పటికీ లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు 2018లో మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది ట్విన్-టర్బోచార్జ్డ్ 6.75-లీటర్ V12 ఇంజన్ ప్యాక్ కలిగి 5000 ఆర్‌పిఎమ్ వద్ద 563 హార్స్ పవర్, 1600 ఆర్‌పిఎమ్ వద్ద 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ.
(ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!)
రోల్స్ రాయిస్ కల్లినన్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా విశాలంగా ఉండే ఈ కారు 1835 మిమీ పొడవు, 5341 మిమీ వెడల్పు, 2164 మిమీ ఎత్తు కలిగి ఈ కారు బరువు సుమారు మూడు టన్నుల వరకు ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కువమంది ధనవంతులు కొనుగోలు చేసిన కార్లలో ఇది ప్రధానమైనది.
Comments
Please login to add a commentAdd a comment