ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) భారతీయ విఫణిలో 'కల్లినన్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.
రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 10.50 కోట్లు కాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్‌యూవీ డెలివరీలు 2024 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారును కల్లినన్ సిరీస్ 2 అని కూడా పిలువవచ్చు.
2024 రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్ మరియు అప్‌డేటెడ్ టెక్నాలజీ పొందుతుంది. ఇది ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, వెనుక భాగంలో స్టెయిన్‌లెస్-స్టీల్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. రీడిజైన్ గ్రిల్ ఇక్కడ చూడవచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ కూడా కొంత అప్డేట్ పొందాయి.
ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు
రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ స్టాండర్డ్ వేరియంట్ 571 హార్స్ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ 600 హార్స్ పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment