ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' ఇప్పుడు మరో ఖరీదైన కారు 'ఆర్కాడియా డ్రాప్‌టైల్'ను వెల్లడించింది. ఈ కారు ధర సుమారు రూ. 209 కోట్లు. దీనిని కంపెనీ సింగపూర్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో వెల్లడించారు.
రోల్స్ రాయిస్ ఆర్కాడియా అద్భుతమైన డిజైన్ కలిగి చాలా వరకు వైట్ పెయింట్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్ టబ్, ముందు భాగంలో బ్లాక్ కలర్ వంటి వాటిని పొందుతుంది. ఇది ఇతర డ్రాప్‌టెయిల్‌ల మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉండటం గమనించవచ్చు.
రెండు డోర్స్, రెండు సీట్లు కలిగిన ఈ కారులో శాంటాస్ స్ట్రెయిట్ గ్రెయిన్ రోజ్‌వుడ్ ఎక్కువగా ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు తయారీలో సుమారు 233 చెక్క ముక్కలను ఉపయోగించినట్లు, దీనిని రూపొందించడానికి 8000 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినట్లు సమాచారం.
డ్యాష్‌బోర్డ్‌లో రోల్స్ రాయిస్ క్లాక్ ఉంది. కేవలం దీనిని తయారు చేయడానికే.. రెండు సంవత్సరాల రీసర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారులోని ట్విన్ టర్బోచార్జ్డ్ 6.75 లీటర్ వీ12 ఇంజిన్ కలిగి 601 హార్స్ పవర్ 841 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment