జేఎల్‌ఎల్‌కు రోల్స్‌-రాయిస్‌ కాంట్రాక్ట్‌  | Rolls Royce hires JLL as global real estate facilities manager | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఎల్‌కు రోల్స్‌-రాయిస్‌ కాంట్రాక్ట్‌ 

Published Thu, Aug 31 2023 4:43 PM | Last Updated on Thu, Aug 31 2023 4:58 PM

Rolls Royce hires JLL as global real estate facilities manager - Sakshi

న్యూఢిల్లీ: ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ తాజాగా కాంప్లెక్స్‌ పవర్, ప్రొపల్షన్‌ సొల్యూషన్స్‌ అభివృద్ధి, తయారీలో ఉన్న రోల్స్‌–రాయిస్‌ నుంచి దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది.ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమయ్యే దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా  భారీగా విస్తరించనుంది. తమ  వైవిధ్యమైన  ప్రాజెక్టులను సురక్షితమైన, స్థిరమైన, స్పూర్తిదాయకంగా అందించడం లక్ష్యమని ప్రాపర్టీ సర్వీసెస్ , రోల్స్ - రాయిస్ గ్లోబల్ హెడ్,  ఆండ్రూ మెక్‌మానస్, చెప్పారు.

ఇవీ చదవండి: iQoo Z7 Pro 5g వచ్చేసింది..రూ.20 వేలలో బెస్ట్‌ 5g ఫోన్‌

30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్‌ రాఖీ వేడుక: వీడియో వైరల్‌

భారత్‌ సహా ఆరు దేశాల్లో రోల్స్‌–రాయిస్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ పోర్ట్‌ఫోలియోకు సౌకర్యాల నిర్వహణ సేవలను జేఎల్‌ఎల్‌ అందించనుంది. ఆరు దేశాల్లోని 44 కేంద్రాల్లో 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోల్స్‌–రాయిస్‌కు చెందిన తయారీ, గిడ్డంగులు, కార్యాలయాలను 2024 ఫిబ్రవరి నుంచి జేఎల్‌ఎల్‌ నిర్వహిస్తుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement