JLL
-
జేఎల్ఎల్కు రోల్స్-రాయిస్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తాజాగా కాంప్లెక్స్ పవర్, ప్రొపల్షన్ సొల్యూషన్స్ అభివృద్ధి, తయారీలో ఉన్న రోల్స్–రాయిస్ నుంచి దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది.ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమయ్యే దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా భారీగా విస్తరించనుంది. తమ వైవిధ్యమైన ప్రాజెక్టులను సురక్షితమైన, స్థిరమైన, స్పూర్తిదాయకంగా అందించడం లక్ష్యమని ప్రాపర్టీ సర్వీసెస్ , రోల్స్ - రాయిస్ గ్లోబల్ హెడ్, ఆండ్రూ మెక్మానస్, చెప్పారు. ఇవీ చదవండి: iQoo Z7 Pro 5g వచ్చేసింది..రూ.20 వేలలో బెస్ట్ 5g ఫోన్ 30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్ భారత్ సహా ఆరు దేశాల్లో రోల్స్–రాయిస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోకు సౌకర్యాల నిర్వహణ సేవలను జేఎల్ఎల్ అందించనుంది. ఆరు దేశాల్లోని 44 కేంద్రాల్లో 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోల్స్–రాయిస్‌కు చెందిన తయారీ, గిడ్డంగులు, కార్యాలయాలను 2024 ఫిబ్రవరి నుంచి జేఎల్ఎల్ నిర్వహిస్తుంది. -
జాతీయ రహదారులతో భూముల ధరల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీ ల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లు, వేసైడ్ అమెనిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌లను నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లక్షించింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. -
రెండేసి ఇళ్లు కొంటున్నారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్ హోమ్స్ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరు కొంటున్నారంటే? ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ సీనియర్ డైరెక్టర్ రితేష్ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ కొంటున్నారంటే? ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉందని అడ్వైజరీ సర్వీసెస్ కొల్లియర్స్ ఇండియా ఎండీ శుభంకర్ మిత్రా తెలిపారు. దుబాయ్, యూఏఈలోనూ.. మిలీనియల్స్ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీ లు, ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్ రోడ్లో ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. గోవాలోని పలు బీచ్ ప్రదేశాలు కూడా హెచ్ఎన్ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్‌లోనూ సెకండ్ హోమ్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్‌లో సెకండ్ హోమ్స్ డిమాండ్ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్‌లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల ఫామ్‌హౌస్‌లు.. ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్ హోమ్స్ వృద్ధి 30–40% వరకుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో రూ.10–100 కోట్ల ఫామ్ హౌస్‌లకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబైలో సెకండ్ హోమ్స్ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్ఎన్ఐ కస్టమర్లేమో... రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, మిలీనియల్స్ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్ అపార్ట్మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో వర్క్ ఫ్రం హోమ్‌కు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, ఆఫీసులకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులను కోరుకుంటున్నారు. -
దివాలా చర్యల్లో రూ.4.6 లక్షల కోట్ల గృహ ప్రాజెక్టులు: జేఎల్ఎల్
ముంబై: రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం, నిధుల లభ్యత సమస్యలతో 66 బిలియన్ డాలర్ల విలువైన (రూ.4.6 లక్షల కోట్లు) నివాసిత గృహ ప్రాజెక్టులు దివాలా చర్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని స్థిరాస్థి కన్సల్టెన్సీ జేఎల్ఎల్ తెలిపింది. ఎన్నో కారణాలతో 4.52 లక్షల యూనిట్లు గడువు దాటిపోయినా పూర్తి కాకుండా కొనసాగుతున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసిత రియల్ ఎస్టేట్ విభాగంలోనే సమస్యలను ఎదుర్కొంటున్న ఆస్తులు (స్ట్రెస్డ్ అసెట్స్) ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యమైన, నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో 4.54 లక్షల యూనిట్లు గడువు దాటినా కానీ పూర్తి కాకుండా ఉన్నాయి’’ అని జేఎల్ఎల్ తెలిపింది. వీటిల్లో కొన్ని ఇప్పటికే దివాలా చర్యల పరిధిలో ఉన్నాయని, వీటి విలువ 66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. -
హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జేఎల్‌ఎల్‌ని ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు ఉంటే.. 2019లో లక్షా 9 వేల కోట్లకి చేరిందని అన్నారు. నగరంలో మౌలికవసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, మంచినీటి కొరత తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలో లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చి నగరంలోని తూర్పుప్రాంతంలో ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తామన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును హైదరాబాద్‌లో కేవలం 36 శాతం మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీన్ని పెంచాల్సిన అవసరముందని తెలిపారు. -
15 శాతానికి తగ్గిన వేకెన్సీ: జేఎల్ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2013లో దేశంలోని ప్రధాన నగరాల్లో 18.5 శాతంగా ఉన్న గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఖాళీలు... 2016 నాటికి 15 శాతానికి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పమని పేర్కొంది. తయారీ రంగం, లాజిస్టిక్, ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్, స్టార్టప్స్ వంటి కంపెనీలలో వృద్ధే ఇందుకు కారణమని జేఎల్ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. అయితే వచ్చే ఏడాది కాలంలో స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి వాటితో ఈ విభాగానికి పెను సవాళ్లు ఎదురుకానున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై నగరాల్లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్ దెబ్బతింటుందన్నారు. అయితే గ్రేడ్–బీ ఆఫీస్ స్పేస్ సరఫరా తగ్గడంతో ఈ విభాగంలో అద్దెలు పెరిగిపోయాయని తెలిపారు. పుణె, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మౌలిక రంగంలో భారీగా వస్తున్న పెట్టుబడులతో ఆయా నగరాల్లో 2017లో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌కు రీట్స్ పెట్టుబడులు మంచి అవకాశంగా మారతాయని చెప్పారు. -
భాగ్యనగరం కిరీటంలో మరో కలికితురాయి