ముంబై: రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం, నిధుల లభ్యత సమస్యలతో 66 బిలియన్ డాలర్ల విలువైన (రూ.4.6 లక్షల కోట్లు) నివాసిత గృహ ప్రాజెక్టులు దివాలా చర్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని స్థిరాస్థి కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్ తెలిపింది. ఎన్నో కారణాలతో 4.52 లక్షల యూనిట్లు గడువు దాటిపోయినా పూర్తి కాకుండా కొనసాగుతున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసిత రియల్ ఎస్టేట్ విభాగంలోనే సమస్యలను ఎదుర్కొంటున్న ఆస్తులు (స్ట్రెస్డ్ అసెట్స్) ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యమైన, నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో 4.54 లక్షల యూనిట్లు గడువు దాటినా కానీ పూర్తి కాకుండా ఉన్నాయి’’ అని జేఎల్‌ఎల్ తెలిపింది. వీటిల్లో కొన్ని ఇప్పటికే దివాలా చర్యల పరిధిలో ఉన్నాయని, వీటి విలువ 66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment