
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టే సింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష ఈ నెల 21న జరగనుంది. అప్పుడే నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment