ప్రభుత్వ బంగ్లా కూడా అక్కర్లేదు: కేజ్రీవాల్ | Arvind Kejriwal refuses official bungalow | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బంగ్లా కూడా అక్కర్లేదు: కేజ్రీవాల్

Published Tue, Dec 24 2013 1:18 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ప్రభుత్వ బంగ్లా కూడా అక్కర్లేదు: కేజ్రీవాల్ - Sakshi

ప్రభుత్వ బంగ్లా కూడా అక్కర్లేదు: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎంగా త్వరలో పాలన పగ్గాలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వరుసగా తిరస్కరిస్తున్నారు.  ముఖ్యమంత్రి కోసం ప్రభుత్వం కల్పించే అధికార బంగ్లా సదుపాయం తనకు అక్కరలేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్తో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సపోలియా మంగళవారం భేటీ అయ్యారు.

 

ఈ సందర్బంగా సీఎం కేజ్రీవాల్కు ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తున్నట్లు కేజ్రీవాల్కు సపోలియా ప్రతిపాదించారు. అందుకు ప్రభుత్వ బంగ్లా వద్దని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కోసం ప్రభుత్వం కల్పించే భద్రత కూడా తనకు అవసరం లేదని, దేవుడే తన భద్రతను పర్యవేక్షిస్తాడని సోమవారం కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో విఐపి సంస్కృతిని కట్టడి చేయడమే తన ప్రధాన లక్ష్యం అంటూ కేజ్రీవాల్ గతంలో చెప్పిన మాట్లాలను అనుసరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement