న్యూఢిల్లీః 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ నిషేధంపై జోక్యానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 2012 లో డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మహిళలపై అకృత్యాలకు మాయని మచ్చగా నిలిచింది. అయితే నిర్భయ గ్యాంగ్ రేప్ స్టోరీని బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడంతో వివాదం తలెత్తింది.
డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో కింది కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా.. అదే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ ఢిల్లీ హైకోర్టు వివరించింది. నిర్భయ గ్యాంగ్ రేప్ పై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ప్రసారాల అనుమతిపై ఇప్పటికే ట్రయల్ కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉండగా.. తాము దీనిపై కల్పించుకునేది లేదని జస్టిస్ జి రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ ల తో కూడిన ధర్మాసనం తెలిపింది.