HC
-
TG Highcourt: ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు తీర్పు
-
మా ముందు హాజరై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఓ భవన నిర్మాణ అనుమతికి సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కె.విద్యాధర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. నవంబర్ 22న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మరపోచంపల్లి గ్రామంలో 40 అడుగుల వెడల్పుతో లోపలి రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతులను పునః పరిశీలించాలని గతంలో కోర్టు ఆదేశించినా అధికారులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదంటూ అక్షయ డెవలపర్స్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) కోరుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దిగువ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు వరుసగా 60, 62, 65 ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులను 65, 67 ఏళ్లకు పెంచాలని బీసీఐ కోరుతోంది. వివిధ కమీషన్లు, ఫోరంలకు చైర్ పర్సన్లుగా అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించాలని పార్లమెంట్‌ను కోరుతూ తీర్మానించినట్లు వెల్లడించింది. (చదవండి: పోలీసులకు రక్షణ కల్పిస్తున్న 'పాములు'!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..) -
యస్ బ్యాంకు స్కాం: వాధవాన్ సోదరులకు బెయిల్
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో వాధవాన్ సోదరులకు బెయిల్ లభించింది. కోట్ల రూపాయల మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లకు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 60 రోజుల వ్యవధిలో చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనపై జస్టిస్ భారతి డాంగ్రే సానుకూలంగా స్పందించారు. అయితే ఒక్కొక్కరూ లక్ష రూపాయలు సెక్యూరిటీగా జమ చేయడంతోపాటు పాస్‌పోర్టులను అప్పగించాలని వీరిద్దరిని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై వీరిని మే 14 న ఈడీ అరెస్టు చేసింది. అయితే జూలై 15 న వాధవన్స్, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్, అతని భార్య బిందు కపూర్, కుమార్తెలు రోష్ని, రేఖ, వారి చార్టర్డ్ అకౌంటెంట్ దులరేష్ కె జైన్‌తో పాటు సహచరులపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. 'క్విడ్ ప్రో క్వో' కు సంబంధించి సీబీఐ 2020 మార్చి 7న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత ఈడీ ఈ కేసులో విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో వీరిద్దరూ జైలులో ఉండాల్సి ఉంటుంది. -
చిదంబరం ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లోఉన్న మాజీ ఆర్థికమంత్రి చిదంబరం (74) ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక మెడికల్ బోర్డును ఈ సాయంత్రం 7 గంటల్లోగా బోర్డును ఏర్పాటు చేసి.. శుక్రవారం మధ్యాహ్నానికి నివేదిక అందచేయవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గురువారం ఎయిమ్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ( చిదంబరం ఫ్యామిలీ వైద్యులు ) నాగేశ్వర రెడ్డిని బోర్డులో చేర్చాలని తెలిపింది. అక్టోబర్ 5న తీవ్ర అనారోగ్యానికి గురైన చిదంబరంను వైద్య పరీక్షల తరువాత వచ్చే16 వారాల పాటు స్టెరాయిడ్ చికిత్సలో ఉంచాలని నిర్ణయించారు. అయితే ఎయిమ్స్ చికిత్సకు తన శరీరం స్పందించడం లేదనీ, హైదరాబాద్ ఏఐజీ వద్ద అత్యవసర చికిత్సకు బెయిల్ మంజూరు చేయాలని చిదంబరం కోర్టును కోరారు. అటు చిదంబరం ఆరోగ్యపరంగా కోలుకునే వాతావరణాన్ని కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన దాదాపు ఏడు కిలోల బరువు కోల్పోయారన్నారు..పరిస్థితి క్షీణిస్తోందని, అతను శుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సిబల్ కోరారు. ఉదర సంబంధమైన తీవ్ర వ్యాధితో బాధపడుతున్న చిదంబరం సోమవారం అస్వస్థత కారణంగా ఎయిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. INX Media (Enforcement Directorate case): Delhi High Court directs AIIMS (All India Institute of Medical Sciences) to constitute a medical board comprising of Dr Nageshwar Reddy (family doctor of P Chidambram from Hyderabad) for Chidambram's treatment in AIIMS. (file pic) pic.twitter.com/uJZNqsVYWI — ANI (@ANI) October 31, 2019 -
టాటా-డొకోమొ సెటిల్మెంట్ను వ్యతిరేకించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో, టాటా సన్స్ సెటిల్మెంట్కు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నో చెప్పింది. టాటా డొకోమో మధ్య ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్బీఐ ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో తన వాదనను వినిపించింది. డొకొమొ, షేర్ల బదిలీ అక్రమమని ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ సందర్భంగా ఆర్బీఐ వాదించింది. అయితే ఆర్బీఐ వాదనలను హైకోర్టు కొట్టి పారేసింది. దీనిపై పూర్తి వివరణను కోరింది. తమ అభ్యంతరాలపై నివేదిక సమర్పించ్సాలిందిగా జస్టిస్ ఎస్మురళీధర్ ఆర్బీఐని కోరారు. తదుపరి విచారణ తేదీ మార్చి 14 న కోర్టు ముందు తన వైఖరిని సమర్పిస్తుందని ఆర్బీఐ చెప్పింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వివాద పరిష్కారానికి రెండు సంస్థల ప్రయత్నాలకు ఇండో-జపనీస్ సంబంధాలకు ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించింది. కాగా గత రెండేళ్లు గా టాటా సన్స్ ,జపనీస్ ప్రముఖ టెలికాం సంస్థ ఎన్టీటీ డొకొమొ మధ్య సాగుతున్న వివాదానికి 1.17 బిలియన్ డాలర్లను(దాదాపు రూ. 7,900 కోట్లు) చెల్లించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం టాటా సన్స్ 1.17 బిలియన్ డాలర్లను ఇప్పటికే డిపాజిట్ చేసింది. -
ఏ చట్టంలో ఏముంది?
భూసేకరణ అంశంపై రాష్ట్రంలో జగడాలు కేంద్ర చట్టం.. 123 జీవో..కొత్త సవరణ చట్టం వాటిల్లోని అంశాలేమిటి?.. బాధితులకు దేనితో ప్రయోజనం? 123 జీవోపై హైకోర్టు స్టేతో తెరపైకి వివాదాలు రాష్ట్రంలో భూసేకరణ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 123 జీవో ద్వారా భూముల సేకరణను నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరోవైపు కేంద్రం అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టం–2013కు సవరణలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర భూసేకరణ సవరణ బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం పొందాక ఈ చట్టం అమల్లోకి రానుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి వచ్చాకే భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 123 జీవోలో ఏముంది? కేంద్ర చట్టం ఏం చెబుతోంది? కొత్తగా రూపొందించిన రాష్ట్ర చట్టంలో ఏయే అంశాలున్నాయి?.. వీటిల్లో నిర్వాసితులకు ఏది ప్రయోజనకరం అనేది ఆసక్తి రేపుతోంది. ఈ అంశాలను పరిశీలిస్తే... – సాక్షి, హైదరాబాద్ జీవో 123 ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123ను జారీ చేసింది. దీని ప్రకారం... ప్రజోపయోగ పనులకు సేకరించే భూములకు, ఆస్తులకు సంబంధించి సదరు యజమానులతో ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్వాసితులతో నేరుగా బేరసారాలు జరిపి సహేతుకమైన ధర చెల్లించే ఒప్పందం చేసుకుంటుంది. ♦ తమ భూములు, ఆస్తులు, తన జీవనాధారపు నష్ట పరిహారం, పునరావాసం, పునరాశ్రయానికి కావాల్సిన ఖర్చులన్నీ కలిపి పరిహారం పొందినట్లుగా నిర్వాసితులు సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ♦ కమిటీ సమక్షంలో జరిగిన తుది నిర్ణయం పై భవిష్యత్తులో తమకెలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించాలి. దీంతో నిర్వాసితులకు చెందిన భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయి. ♦ అఫిడవిట్లు సమర్పించిన భూముల యజమానుల వివరాలతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యంతరాలకు కేవలం 15 రోజుల గడువిస్తుంది. అయితే మరింత వేగంగా భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు ఈ వ్యవధిని వారం రోజులకు కుదిస్తూ 2015 అక్టోబర్ 7న మరో జీవో జారీ అయింది. ♦ సహేతుకమైన ధర ఖరారు ప్రక్రియలో పునరావాసం, పునరాశ్రయం అనే పదాలను తొలగిస్తూ అదే ఏడాది నవంబర్ 28న మరో జీవో జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూసేకరణ (సవరణ) బిల్లు–2016 కేంద్ర భూసేకరణ చట్టం–2013లోని కీలక అంశాలకు సవరణలు చేసి.. ఇంచుమించుగా 123 జీవోలోని అంశాలతోనే దీనినీ రూపొందించారు. ప్రభావిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం కంటే ఎక్కువ ఇచ్చేందుకు, దాని కంటే మెరుగైన పునరావాసం, పునః పరిష్కారం చేసేందుకు రాష్ట్రానికి హక్కు ఉంది. 2013 చట్టంలోని 107వ ఆర్టికల్ ఈ అధికారాన్ని కల్పించింది. దాని ప్రకారమే బిల్లును ప్రవేశపెట్టారు. ♦ ప్రజాప్రయోజనం దృష్ట్యా చేపట్టే నీటిపారుదల, విద్యుదీకరణ, గృహ నిర్మాణ ప్రాజెక్టుల భూసేకరణకు నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. ♦ 2013 చట్టంలోని సామాజిక ప్రభావం, ప్రజా ప్రయోజన నిర్ధారణకు చేపట్టే ప్రాథమిక విచారణ అధ్యాయాన్ని తొలగించారు. దీంతో సామాజిక ప్రభావ మదింపు, పరిశోధన లేకుండానే భూసేకరణ చేపట్టే అధికారం రాష్ట్రం సొంతమవుతుంది. ♦ ఆహార భద్రత ప్రయోజనాల పరిరక్షణ కోసం 2013 చట్టంలో నిర్దేశించిన మూడో అధ్యాయాన్ని తొలగించారు. మూడో అధ్యాయం ప్రకారం.. ఏటా రెండు లేదా అంతకు మించి పంటలు సాగు చేసే భూములను సేకరించకూడదు. అసాధారణ పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే అంతే విస్తీర్ణంలో వ్యవసాయ భూములను అభివృద్ధి చేయాలి. కానీ ఈ అధ్యాయాన్ని సవరణలో మొత్తంగా తొలగించారు. ♦ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలకు చేపట్టే భూసేకరణకు ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్ భూ యజమానితో సంప్రదింపులు జరిపి, వారి సమ్మతితో అమ్మకం ధర ఖరారు చేసుకుంటారు. దాని ప్రకారం ఉత్తర్వులిచ్చి గెజిట్ జారీ చేస్తారు. దాంతో నిర్వాసిత భూ యజమానుల హక్కులు ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయి. ఆ భూములు ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ అవుతాయి. ♦ ఖరారు చేసుకున్న ధర ప్రకారం సహాయ పునరావాస, పరిహార మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి. ♦ నిర్వాసితులకు అక్రమంగా డబ్బు చెల్లించినట్లు గుర్తిస్తే భూమి శిస్తు తరహాలో తిరిగి వసూలు చేసుకుంటారు. కేంద్ర భూసేకరణ చట్టం–2013 భూసేకరణకు సంబంధించి ఈ చట్టం ఎన్నో నిబంధనలను ఏర్పరిచింది. దీని ప్రకారం... ముందుగా భూసేకరణ చేపట్టే ప్రాంతాలకు ♦ నోటిఫికేషన్ జారీ చేయాలి. గ్రామ సభలు నిర్వహించి, అక్కడి ప్రజలకు తెలియజెప్పాలి. ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి.. నిర్వాసితుల గుర్తింపు, పునరావాస అంచనా పథకం తయారీ, గ్రామసభల్లో బహిరంగ విచారణ, అభ్యంతరాల స్వీకరణ, డిక్లరేషన్ ప్రచురణ, నోటీసుల జారీ, కలెక్టర్ ఆధ్వర్యంలో తుది అవార్డు ప్రకటన ప్రక్రియలు చేపట్టాలి. అభ్యంతరాలకు 60 రోజుల గడువు ఇవ్వాలి. ♦ పరిహారం చెల్లింపునకు రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాల ధర, లేదా సమీప గ్రామాల్లో ఉన్న భూముల అమ్మకాల సగటు అమ్మకపు విలువను పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో అదే రేటు ప్రకారం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో రెండింతలు ఇవ్వాలి. ♦ భూమి లేదా భవనానికి అనుబంధంగా ఉన్న ఆస్తుల విలువను లెక్కించాలి. భూమిలో ఉన్న పంటలు, మొక్కలు చెట్లు కోల్పోతే యజమానికి జరిగే నష్టం, ఇతర స్థిర చరాస్తులకు వాటిల్లే నష్టం, వ్యాపారానికి కలిగే నష్టం కూడా జత చేయాలి. ♦ చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని నిర్ధారించాక.. ఆ పరిహారానికి వంద శాతం అదనపు మొత్తం ‘సొలీషియం’గా కలిపి తుది అవార్డును నిర్ణయించాలి. ♦ నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజన ప్రమాణాల మేరకు ఇంటిని నిర్మించి ఇవ్వాలి. లేదంటే ఇంటికయ్యే వ్యయం చెల్లించాలి. ♦ భూసేకరణతో భూమి లేకుండా పోయిన కుటుంబాలకు ఆ ప్రాంతంలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టు ఆయకట్టులో కనీసం ఒక్కో ఎకరం సాగు భూమి ఇవ్వాలి. ♦ ప్రాజెక్టుల వల్ల ఉద్యోగాలు కల్పించబడితే బాధితకు టుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం, లేదా ప్ర తి బాధిత కుటుంబానికి ఒకే దఫా రూ.5 లక్షలు చెల్లిం పు, లేదా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.2 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వార్షిక చెల్లింపులు చేయాలి. ♦ నిర్వాసితులైన ప్రతి కుటుంబానికి అవార్డు ప్రకటించిన తేదీ నుంచి ఏడాది పాటు నెలకు కనీసం రూ.3 వేల లెక్కన నెలసరి జీవన మనుగడ వేతనం చెల్లించాలి. ♦ బాధిత కుటుంబాన్ని, భవన సామగ్రిని, ఇతర వస్తువులను, పశువులను తరలించుకునేందుకు రవాణా ఖర్చులుగా ఒకే దఫాగా రూ.50 వేల ఆర్థిక సాయం. ♦ పశువుల కొట్టాలు, చిన్న చిన్న దుకాణాలను వేరేచోట నిర్మించుకునేందుకు రూ.25 వేలకు తక్కువ కాకుండా నోటిఫికేషన్ జారీ చేసి బాధితులకు చెల్లించాలి. ♦ వృత్తి పనివారు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి కలిగిన వారు నిర్వాసితులైతే ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 వేలకు తక్కువ కాకుండా చెల్లించాలి. ♦ సాగునీటి, జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వాసిత కుటుంబాలకు రిజర్వాయర్లలో చేపలు పట్టుకోవడానికి హక్కులు కల్పించాలి. ♦ ప్రతి బాధిత కుటుంబానికి ఒకే దఫా ‘రీసెటిల్మెంట్ వేతనం‘గా రూ.50 వేలు చెల్లించాలి. ♦ నిర్వాసితులు వేరేచోట పునరావాసం పొందడానికి వీలుగా కనీస మౌలిక సౌకర్యాలను కల్పించే బాధ్యత సదరు సంస్థదే. -
ఏవో, ఏఈవో, హెచ్‌వో పోస్టుల భర్తీకి
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీకి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈ వో), ఉద్యానవన అధికారుల (హెచ్‌వో) పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వ్యవసాయాధి కారులు, విస్తరణాధికారులు, ఉద్యానవన అధికారుల పోస్టుల భర్తీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, రాత పరీక్షకు అనుమతినిస్తూ ఫలితాలను వెల్లడించవద్దని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. తరువాత వీటిపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే మిగిలిన అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
నేడు హైకోర్టులో ఓటుకుకోట్లు కేసు విచారణ
-
స్విస్ చాలెంజ్‌పై స్టే .
-
ఏసీబీ వలలో హెచ్‌సీ
HC in ACB trap ఏసీబీ వలలో హెచ్‌సీ, HC,ACB,trap దేవరాపల్లి: దేవరాపల్లి పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్.వెంకట అప్పారావు ఏసీబీ వలకు చిక్కాడు. బాలిక కిడ్నాప్ కేసులో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం రాత్రి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మండలంలోని వెంకటరాజుపురం గ్రామానికి చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసు విషయమై 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం మేరకు బాధితుడి నుండి 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దేవరాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుండి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరాజుపురం గ్రామంలో ఓ బాలిక ఈ నెల 3న కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకి 7వ తేదీన తెలిసింది. కేసు నమోదు చేసి నిందితుడిని 9న రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడు భోజంకి సంతోష్ భవిష్యత్‌లో బాలిక జోలికి రాకుండా ఉంచడంతో పాటు అతనికి బెయిల్ రాకుండా చేస్తానని చెప్పి స్టేషన్ ఖర్చులకు రూ. 5 వేలు, తనకు అదనంగా మరో ఐదు వేలు ఇవ్వాలని హెచ్‌సీ వెంకటఅప్పారావు డిమాండ్ చేశారు. అంత సొమ్ము ప్రస్తుతం ఇచ్చుకోలేమని, నాలుగైదు రోజులు గడువు కావాలని కోరారు. అతని చేష్టలపై విసుగు చెందిన బాలిక మేనమామ లెక్కల శ్రీనివాసరావు ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన ఏసీబీ డీఎస్పీ కె.రామకష్ణ ప్రసాద్, సీఐలు కె.గణేష్, ఎం.వి. రమణమూర్తిలతో కూడిన బందం ప్రథకం రచించింది. ఈ మేరకు గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో 10 వేలు లంచం తీసుకుంటుండగా హెచ్సీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హెచ్సీని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, దేవరాపల్లిలో పోలీసులపై ఏసీబీ అధికారులు దాడి చేశారన్న విషయం తెలియడంతో మండలంలోని ఇతర పోలీస్ అధికార్లు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. -
'ఇండియాస్ డాటర్' పై జోక్యానికి నిరాకరణ..!
న్యూఢిల్లీః 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ నిషేధంపై జోక్యానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 2012 లో డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మహిళలపై అకృత్యాలకు మాయని మచ్చగా నిలిచింది. అయితే నిర్భయ గ్యాంగ్ రేప్ స్టోరీని బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడంతో వివాదం తలెత్తింది. డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో కింది కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా.. అదే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ ఢిల్లీ హైకోర్టు వివరించింది. నిర్భయ గ్యాంగ్ రేప్ పై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ప్రసారాల అనుమతిపై ఇప్పటికే ట్రయల్ కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉండగా.. తాము దీనిపై కల్పించుకునేది లేదని జస్టిస్ జి రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ ల తో కూడిన ధర్మాసనం తెలిపింది. -
పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్..
-
పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్..
తిరువనంతపురంః వందేళ్ళ చరిత్ర కలిగిన పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కేరళ హైకోర్టు 43 మందికి బెయిల్ మంజూరు చేసింది. దేవీ ఉత్సవాల సమయంలో బాణసంచా పేలి జరిగిన ఘోర ప్రమాదంలో అప్పట్లో సుమారు 114 మంది చనిపోగా 383 మంది వరకూ గాయపడ్డవిషయం తెలిసిందే. పుట్టింగళ్ దేవీ ఆలయ ఆగ్నిప్రమాదంలో నిందితులైన వారందరికీ కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కోర్టు..నిందితులుగా ఉన్న మొత్తం 43 మందికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఆలయ ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో తీవ్ర విపత్తును సృష్టించింది. కంబాపురాలో బాణాసంచా భద్రపరిచిన గోడౌన్ అంటుకోవడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అంటుకున్న నిమిషాల్లోనే కాంప్లెక్స్ మొత్తం వ్యాపించడంతో అక్కడే ఉన్న భక్తులు కొందరు అగ్నికి ఆహుతైపోగా, మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో సంభవించిన పేలుళ్ళతో ఆలయం గోడలు, సమీప కాంక్రీట్ భవనాలు కూలడంతో శిథిలాలకింద పడ్డ భక్తులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం సందర్భంలో పోలీసులు ఆరుగురిపై హత్యాయత్నం, ఇతర నేరాలతోపాటు, ప్రమాదానికి కారణమైన ఆలయ అధికారులు, బాణాసంచా కాంట్రాక్టర్లు పలువురిపై కేసులు నమోదు చేశారు. -
''స్కూళ్ళు.. డబ్బు ఒడికే యంత్రాలు''
ముంబైః పాఠశాలలు పిల్లలనుంచీ డబ్బును ఒడికే యంత్రాలుగా మారిపోతున్నాయంటూ ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ విద్యార్థిని అకారణంగా స్కూల్ నుంచి బయటకు పంపిన కారణంగా దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. అడిగిన ఫీజు కట్టినతర్వాత కూడా... పుస్తకాలు, యూనిఫాం అంటూ మరో 50 వేలు కట్టాలని స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసినట్లు విద్యార్థి తండ్రి కోర్టుకు ఓ లేఖద్వారా విన్నవించాడు. దీంతో విచారించిన ముంబై హైకోర్టు సదరు స్కూలుకు నోటీసులు పంపించింది. ఇటీవల స్కూలు యాజమాన్యాలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయని, డబ్బు ఒడికే యంత్రాలుగా మారుతున్నాయని ముంబై హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫీజు మొత్తం కట్టిన తర్వాత కూడా.. విద్యార్థినుంచి మరో 50 వేల రూపాయలు డిమాండ్ చేయడంతోపాటు, నిర్దాక్షిణ్యంగా విద్యార్థిని స్కూలునుంచి బయటకు పంపించిన విషయంలో దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ హెచ్ వి బి గ్లోబల్ అకాడమీ స్కూల్ కు నోటీసులు జారీ చేసింది. స్కూల్లో చదువుతున్న 12 ఏళ్ళ విద్యార్థి కి జరిగిన అన్యాయంపై బాలుడి తండ్రి రాసిన లేఖను జస్టిస్ వీఎం కనాడే, ఎమ్ ఎస్ సోనాక్ డివిజన్ బెంచ్ విచారించింది. ఏడవ తరగతిలో చేర్పించేందుకుగానూ పాఠశాల యాజమాన్యం ముందుగా కోరినట్లుగానే 1,09,500 రూపాయలను కట్టామని, అందుకు యాజమాన్యం రసీదు కూడ ఇచ్చిందని, అనంతరం యూనిఫాంలు, స్టేషనరీ పేరుతో 50 వేల రూపాయలు అదనంగా కట్టాలంటూ డిమాండ్ చేయడంతో తాము వ్యతిరేకించినందుకు గాను తమ కుమారుడ్ని పాఠశాలనుంచి బలవంతంగా టీసీ (ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్) ఇచ్చి బయటకు పంపించేశారంటూ విద్యార్థి తండ్రి సంతోష్ మెహతా కోర్టుకు ఇచ్చిన లేఖలో వివరించాడు. అంతేకాక తమ కుటుంబాన్ని కూడా స్కూలు సిబ్బంది వేధింపులకు గురి చేసినట్లు మెహతా లేఖలో పేర్కొన్నాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ఫిబ్రవరి నెల్లోనే విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కు, ఛైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశానని, అప్పట్లో విద్యార్థిని స్కూల్లోకి అనుమతించమంటూ విద్యాశాఖ డైరెక్టర్ స్కూలు యాజమాన్యానికి సూచించారని చెప్పారు. అనంతరం తమ కుమారుడు స్కూలుకు వెళ్ళగా సెక్యూరిటీ సిబ్బంది లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని, దాంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్లు మెహతా తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా సదరు స్కూలుకు నోటీసులు పంపించి, జూలై 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. -
బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాల్చొద్దు..
కొచ్చిః కేరళ హైకోర్టు స్థానిక ప్రజలకు ప్రత్యేక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వంటి వస్తువులను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా, పౌర సంబంధిత సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ హెచ్చరించింది. బ్రీత్ ఈజీ కార్యక్రమంలో భాగంగా కేరళ హైకోర్టు ప్రత్యేక నిర్ణయం తీసుకొంది. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వస్తువులను తగులబెట్టడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక, అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అటువంటి పనులను నిషేధిస్తూ నిబంధనలను విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, అటువంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు సైతం సుమోటో కేసులను ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ బి. రాధాకృష్ణన్, అను శివరామన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడాన్ని నిషేధిస్తూ కోర్టు ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది. -
కార్డుల సర్‌చార్జ్ పై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపులకు వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్రాన్ని,ఆర్‌బిఐలకు ఆదేశించింది. ఆగస్టు 19లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను, కేంద్ర బ్యాంకును కోరింది. దీనిపై పూర్తి మార్గదర్శకాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై సర్ చార్జ్ విధించడాన్ని సవాలు చేస్తూ అమిత సాహ్ని అనే లాయర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నగదు లావాదేవీలను మినహాయించి కేవలం డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై సర్ చార్జ్ విధించడం అక్రమమని వాదించారు. ఈ చర్య దేశంలో నల్లధనం చలామణిని ప్రోత్సహించేలా ఉందని పిటిషనర్ ఆరోపించారు. 2.5 శాతం చెల్లింపు లేదా అంతకంటే ఎక్కువగా సర్ ఛార్జి విధించడం వలన అక్రమ, అసమాన లావాదేవీలు దేశవ్యాప్తంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ జయంత నాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. -
మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
జయ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
-
ఆధార్ కార్డు లేకుండా గ్యాస్ ఇవ్వండి: హైకోర్టు
-
సుప్రీం కోర్టులో సీబీఐకి ఊరట, గౌహతి హైకోర్టు తీర్పుపై స్టే
-
పోలీసుల నిర్ణయాన్ని తోసిపుచ్చిన హైకోర్టు
-
98 కిలోల గంజాయి స్వాధీనం
చీడికాడ, పాడేరు, న్యూస్‌లైన్: వేర్వేరు ప్రాంతాల్లో 98 కిలోల గంజాయి పట్టుబడింది. కట్టవాని అగ్రహారం వంతెన వద్ద ఆటోలో తరలిస్తున్న 90 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని డ్రయివర్ను అదుపులోకి తీసుకున్నట్లు హెచ్‌సీ దాసు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ శనివారం సాయంత్రం వడ్డాది నుంచి బైలపూడికి ఏపీ31టీడబ్ల్యు2001 నంబరున్న ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు అందించిన సమాచారం మేరకు కట్టవాని అగ్రహారం వంతెన వద్ద మాటువేశామని తెలిపారు. దిబ్బపాలెం తాడి రాజుకు చెందిన ఆటోను తనిఖీ చేయగా లగేజీ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయన్నారు. దీంతో ఆటో డ్రయివర్ తాడి రాజు (23)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుతెలిపారు. కాలినడకన తీసుకెళ్తుండగా పట్టివేత పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి కాలినడకన గంజాయి రవాణా చేస్తున్న నలుగురు గిరిజనులను గుర్తించి అరెస్టు చేశామని పాడేరు ఎస్ఐ ప్రసాద్ సోమవారం విలేకరులకు తెలిపారు. తమకు అందిన ఫోన్ సమాచారం మేరకు చింతలవీధి కూడలి వద్ద తనిఖీలు నిర్వహించగా కాలినడకన లగేజి బ్యాగులతో వస్తున్న జి.మాడుగుల మండలం గొడుగుమామిడి గ్రామానికి చెందిన సాగిన బాలకృష్ణ, జర్రాయికి చెందిన సిరగం బాలకృష్ణ, జోగులుపుట్టుకు చెందిన కూడెలి రవికుమార్, పెదబయలు మండలం లింగేటి గ్రామానికి చెందిన బోయిని కృష్ణారావును అదుపులోకి తీసుకోగా గంజాయి రవాణా వెలుగు చూసిందన్నారు. వీరి బ్యాగుల్లోని 8 కిలోల గంజాయితో పాటు రూ.లక్ష 56 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు. అరెస్టయిన నలుగురినీ రిమాండ్‌కు తరలించామన్నారు. -
సమ్మె విరమిస్తారా? కొనసాగిస్తారా? చెప్పండి
-
ఏపిఎన్జీఓల సమ్మె పై హైకోర్టులో వడీవేడిగా వాదనలు